
ప్రముఖ బుల్లితెర నటి ఆకాంక్ష దూబే మృతి కేసులో సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. ఈ కేసులో పోలీసులు ప్రముఖ సింగర్ సమర్ సింగ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో హోటల్‌లోని సీసీటీవీ దృశ్యాలు మరింత కీలకంగా మారాయి. చనిపోయే కొన్ని నిమిషాల ముందు ఆమె ఓ వ్యక్తితో ఉన్న దృశ్యాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
అసలేం జరిగిందంటే?
భోజ్‌పురి నటి ఆకాంక్ష ఓ సినిమా షూటింగ్ కోసం వారణాసి వెళ్లారు. అక్కడే ఆమె ఓ హోటల్‌లో ఉంటూ షూటింగ్‌లో పాల్గొన్నారు. మార్చి 26న షూటింగ్ ముగిసిన వెంటనే హోటల్‌కు తిరిగొచ్చిన ఆకాంక్ష దూబే అనుమానాస్పదస్థితిలో మృతిచెందారు. చనిపోవటానికి కొన్ని నిమిషాల ముందు ఓ గుర్తు తెలియని వ్యక్తితో ఆమె మాట్లాడినట్లు తెలుస్తోంది. సీసీటీవీలో ఆకాంక్షతో పాటు కనిపించిన ఆ వ్యక్తి ఎవరో ఇంకా వివరాలు తెలియరాలేదు.
ఆకాంక్ష మరణంతో అతడికి ఏదైనా సంబంధముందా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. ఆకాంక్ష మరణం హత్య అని ఆమె కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ప్రముఖ సింగర్ సమర్ సింగ్ హస్తం ఉందని ఆరోపిస్తున్నారు. ఆమెకు గతంలో సమర్ సింగ్ అనే సింగర్‌తో ప్రేమ వ్యవహారం ఉన్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment