![Mandatory Military Service Exempt South Korea Having More Children - Sakshi](/styles/webp/s3/article_images/2023/03/27/soldi.jpg.webp?itok=34TPU87b)
దక్షిణ కొరియాలో గత నెలలో దేశంలోనే అత్యల్ప సంతానోత్పత్తి రేటు నమోదయ్యింది. దీంతో అక్కడి పాలక సంప్రదాయ పీపుల్ పవర్ పార్టీ జనన రేటుని పెంచే సంప్రదాయేతర మార్గాలపై దృష్టిసారించింది. వాస్తవానికి దక్షిణ కొరియాలో 18 నుంచి 28 ఏళ్ల వయసులోపు పురుషులు తప్పనసరిగా మిలటరీ సేవ చేసేలా కఠినమైన నిబంధన ఒకటి ఉంది. ఐతే అక్కడి ప్రభుత్వం ఆ నిబంధనను సైతం బ్రేక్ చేసేందుకు రెడీ అయిపోయింది. ఈ మేరకు అక్కడ పురుషులకు 30 ఏళ్లు వచ్చేలోపు ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలు ఉంటే తప్పనిసరి అయిన మిలటరీ సేవ నుంచి మినహాయింపు ఇస్తానని చెబుతోంది.
ఈ మేరకు సియోల్ ఆధారిత మిలటరీ హ్యుమన్ రైట్స్ సెంటర్ కో ఆర్డినేటర్ చో క్యు సుక్ మాట్లాడుతూ..ఈ ప్రతిపాదన యువకులు ఇష్టపడతారని, పైగా జననాలకు అడ్డంకి తొలుగుతుందని చెప్పారు. అయితే ఈ ప్రతిపాదనను సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. యుక్త వయస్కులను పిల్లలను కనమని ప్రోత్సహిస్తున్నారా అని మండిపడుతున్నారు. అయినా మిటలటరీకి వెళ్లకుండా ఉండేందుకు ముగ్గురు పిల్లలను ఎవరు కలిగి ఉంటారు, ఆ ఖర్చులను ఎలా భరిస్తారు అని విమర్శిస్తూ ట్వీట్ చేశారు. మరికొంత మంది నిపుణులు ఇది చాలా ప్రమాదకరం, హాస్యస్పదమైనది అని చెబుతున్నారు.
ఈ క్రమంలో సియోల్ విశ్వవిద్యాలయంలోని పబ్లిక్ అడ్మినస్ట్రేషన్ అసోసియేట్ ప్రోఫెసర్ ఎరిక్ హై వాన్ కిమ్ మాట్లాడుతూ..జాతీయ ఆర్థిక వృద్ధి లేదా దేశ స్థిరత్వం కోసం పిల్లలను కనమని ప్రజలను అడగలేం. సంతానోత్పత్తిని అలాంటి సాధనంగా భావించకూడదు. అలాగే ముసాయిదా మినహాయింపు విధానం కూడా ప్రమాదకరమేనని ప్రొఫెసర్ జెఫ్రీ రాబర్ట్‌సన్ హెచ్చరించారు. దీని వల్ల ఉద్యోగం చేసే తల్లులకు ఇంటి బాధ్యతలు, పిల్లల సంరక్షణ వంటివి మరింత భారమయ్యే అవకాశం ఉంది. అలాగే ఆ ఖర్చులను భరించగలిగేలా మంచి జీతంతో కూడిన ఉద్యోగాలు పొందడం కూడా కష్టమే అని నిపుణులు చెబుతున్నారు. కాగా, దక్షిణ కొరియా ఇంకా ఈ నిబంధనను ఖరారు చేయలేదని, అమలు చేయాలా? లేదా అని అంశంపై సమీక్షిస్తున్నట్లు సమాచారం.
(చదవండి: అమెరికాలోని గురుద్వార్‌లో కాల్పులు..ఇద్దరికి తీవ్ర గాయాలు)
Comments
Please login to add a commentAdd a comment