exempt
-
ఆదాయపన్ను కట్టని ఏకైక భారత రాష్ట్రం
ఏటా బడ్జెట్ వస్తుందంటే చాలు.. తమకు ఏమైనా ఊరట లభిస్తుందేమోననే ఆశ వేతన జీవుల్లో కనిపిస్తుంది. ఆదాయపన్నులో ఏమైనా రాయితీలు కల్పించారా అనే లెక్కల్లో మునిగిపోతారు. మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా ఉండే మనదేశంలో పన్ను చెల్లించే ఉద్యోగుల నుంచి కార్పొరేట్ కంపెనీల వరకు బడ్జెట్ రోజున ఐటీ శ్లాబ్(IT Slabs)ల గురించి ఆరా తీస్తారు. అయితే, దేశం మొత్తం ఈ లెక్కలతో బిజీగా ఉన్నా.. ఒక్క రాష్ట్రంలోని ప్రజలు మాత్రం తమకేం సంబంధం లేనట్టుగా ఉంటారు. ఎందుకంటే వారు ఆదాయపన్ను అనేదే కట్టరు. అదేంటి పన్ను కట్టకుంటే కేంద్ర ప్రభుత్వం ఊరుకుంటుందా అనే డౌట్ వస్తుందా? అవును ఆ వెసులుబాటు ఇచ్చిందే కేంద్రం. ఇంతకీ ఆ రాష్ట్రం ఏంటో తెలుసా?.. సిక్కిం. 330 ఏళ్లకుపైగా రాచరిక రాజ్యంగా స్వతంత్రంగా ఉన్న సిక్కిం(Sikkim).. 1975లో 22వ రాష్ట్రంగా భారత్‌లో విలీనమైంది. అయితే ఆ సమయంలో సిక్కిం ఓ షరతు పెట్టింది. తాము భారత్‌లో విలీనమైనా.. తాము అంతకుముందు తమ పాలనలో ప్రజలకు పన్నులు విధించలేదని, ఇప్పుడు కూడా ఆ విధానాన్నే అనుసరిస్తామని స్పష్టం చేసింది. దీనికి భారత ప్రభుత్వం అంగీకరించడంతో సిక్కిం ప్రజలకు ఆదాయ పన్ను కట్టే భారం తప్పింది. ఈమేరకు రాజ్యాంగంలోని ఆర్టికల్ 371ఎఫ్ ప్రకారం సిక్కింకు ప్రత్యేక హోదా ఉంటుంది.తలసరి ఆదాయంలో నంబర్‌వన్..దేశంలో సేంద్రియ రాష్ట్రంగా గుర్తింపు పొందిన సిక్కిం తలసరి ఆదాయం కూడా అదుర్స్. 2023–24 ఆర్థిక సంవత్సరంలో రూ.5,88,000 తలసరి ఆదాయంతో దేశంలోనే సిక్కిం టాప్‌లో నిలిచింది. 2023–24 ఆర్థిక సంవత్సరం జాతీయ సగటులో సిక్కిం తలసరి ఆదాయం 320 శాతంగా ఉంది. ఇది దేశంలోనే అత్యధికం. ఇక సిక్కిం తలసరి స్థూల రాష్ట్ర దేశీయ ఉత్పత్తి (జీఎస్డీపీ) దేశ తలసరి జీడీపీ కంటే మూడు రెట్లు ఎక్కువ.ఇదీ చదవండి: ఏఐను అందిపుచ్చుకుంటున్న ప్రభుత్వ విభాగాలుఎవరికి మినహాయింపు ఉంటుంది?ఇదంతా విన్న తర్వాత అర్జెంటుగా సిక్కిం వెళ్లిపోతే ఈ ఐటీ బాధలేమీ ఉండవు అనుకుంటున్నారా? అలాంటి పప్పులేమీ ఉడకవు.. 1975 కంటే ముందు నుంచి అక్కడ ఉన్న సిక్కిం నివాసితులకు మాత్రమే ఈ పన్ను మినహాయింపు వర్తిస్తుంది. వేరే ప్రాంతాల నుంచి అక్కడికి వలస వెళ్లినవారికి ఇది వర్తించదు. ఈ మేరకు 2008లో కేంద్ర ప్రభుత్వం ఆదాయపన్ను(Income Tax) చట్టంలో సెక్షన్ 10 (26 ఏఏఏ)ను తీసుకొచ్చింది. దీని ప్రకారం ఒక వ్యక్తి సిక్కింకి చెందిన వారు అయి ఉండి ఏ రకంగానైనా ఆదాయం సంపాదిస్తున్నట్లయితే పన్ను నుంచి మినహాయింపు ఉంటుంది. అలాగే ఆ రాష్ట్రానికి చెందిన వ్యక్తి కంపెనీ వేరే రాష్ట్రంలో ఉండి డివిడెండ్లు, సెక్యూరిటీల ద్వారా ఆదాయం వస్తే కూడా పన్ను మినహాయింపు ఉంటుంది. -
జనాభా పెరుగుదల కోసం ఆ దేశం పాట్లు.. నిబంధనను బ్రేక్ చేసి మరీ..
దక్షిణ కొరియాలో గత నెలలో దేశంలోనే అత్యల్ప సంతానోత్పత్తి రేటు నమోదయ్యింది. దీంతో అక్కడి పాలక సంప్రదాయ పీపుల్ పవర్ పార్టీ జనన రేటుని పెంచే సంప్రదాయేతర మార్గాలపై దృష్టిసారించింది. వాస్తవానికి దక్షిణ కొరియాలో 18 నుంచి 28 ఏళ్ల వయసులోపు పురుషులు తప్పనసరిగా మిలటరీ సేవ చేసేలా కఠినమైన నిబంధన ఒకటి ఉంది. ఐతే అక్కడి ప్రభుత్వం ఆ నిబంధనను సైతం బ్రేక్ చేసేందుకు రెడీ అయిపోయింది. ఈ మేరకు అక్కడ పురుషులకు 30 ఏళ్లు వచ్చేలోపు ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలు ఉంటే తప్పనిసరి అయిన మిలటరీ సేవ నుంచి మినహాయింపు ఇస్తానని చెబుతోంది. ఈ మేరకు సియోల్ ఆధారిత మిలటరీ హ్యుమన్ రైట్స్ సెంటర్ కో ఆర్డినేటర్ చో క్యు సుక్ మాట్లాడుతూ..ఈ ప్రతిపాదన యువకులు ఇష్టపడతారని, పైగా జననాలకు అడ్డంకి తొలుగుతుందని చెప్పారు. అయితే ఈ ప్రతిపాదనను సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. యుక్త వయస్కులను పిల్లలను కనమని ప్రోత్సహిస్తున్నారా అని మండిపడుతున్నారు. అయినా మిటలటరీకి వెళ్లకుండా ఉండేందుకు ముగ్గురు పిల్లలను ఎవరు కలిగి ఉంటారు, ఆ ఖర్చులను ఎలా భరిస్తారు అని విమర్శిస్తూ ట్వీట్ చేశారు. మరికొంత మంది నిపుణులు ఇది చాలా ప్రమాదకరం, హాస్యస్పదమైనది అని చెబుతున్నారు. ఈ క్రమంలో సియోల్ విశ్వవిద్యాలయంలోని పబ్లిక్ అడ్మినస్ట్రేషన్ అసోసియేట్ ప్రోఫెసర్ ఎరిక్ హై వాన్ కిమ్ మాట్లాడుతూ..జాతీయ ఆర్థిక వృద్ధి లేదా దేశ స్థిరత్వం కోసం పిల్లలను కనమని ప్రజలను అడగలేం. సంతానోత్పత్తిని అలాంటి సాధనంగా భావించకూడదు. అలాగే ముసాయిదా మినహాయింపు విధానం కూడా ప్రమాదకరమేనని ప్రొఫెసర్ జెఫ్రీ రాబర్ట్సన్ హెచ్చరించారు. దీని వల్ల ఉద్యోగం చేసే తల్లులకు ఇంటి బాధ్యతలు, పిల్లల సంరక్షణ వంటివి మరింత భారమయ్యే అవకాశం ఉంది. అలాగే ఆ ఖర్చులను భరించగలిగేలా మంచి జీతంతో కూడిన ఉద్యోగాలు పొందడం కూడా కష్టమే అని నిపుణులు చెబుతున్నారు. కాగా, దక్షిణ కొరియా ఇంకా ఈ నిబంధనను ఖరారు చేయలేదని, అమలు చేయాలా? లేదా అని అంశంపై సమీక్షిస్తున్నట్లు సమాచారం. (చదవండి: అమెరికాలోని గురుద్వార్‌లో కాల్పులు..ఇద్దరికి తీవ్ర గాయాలు) -
క్రెడిట్ కార్డు వినియోగదారులకు శుభవార్త
న్యూఢిల్లీ: క్రెడిట్ కార్డు నగదు లావాదేవీపై కేంద్రం తీపి కబురు చెప్పింది. రూ.2లక్షలు అంతకన్నా మించిన నగదు లావాదేవీలపై ఉన్న నిబంధనలు క్రెడిట్‌కార్డు బిల్లు చెల్లింపుదారులకు వర్తించవని స్పష్టం చేసింది. ప్రభుత్వం, బ్యాంకింగ్ కంపెనీ, పోస్ట్ ఆఫీస్ పొదుపు బ్యాంకు లేదా కో-ఆపరేటివ్ బ్యాంకు ద్వారా రసీదులను రూ .2 లక్షల పరిమితి వర్తించదని రెవిన్యూ విభాగం విడుదల చేసిన ఒక నోటిఫికేషన్ లో తెలిపింది. బ్యాంకింగ్ రంగానికి, అలాగే గ్రామీణ ప్రాంతానికి అవసరమైన ఉపశమనం కల్పించనున్నామని నాంజియా అండ్ కో డైరెక్టర్ శైలేష్ కుమార్ తెలిపారు.బ్యాంకులు నియమించిన బిజినెస్ కరస్పాండెంట్లు, ప్రీపెయిడ్ ఉపకరణాల ద్వారా ఆయా బిల్లులను చెల్లించవచ్చని రెవెన్యూశాఖ స్పష్టం చేసింది. రూ. 2 లక్షల లేదా అంతకంటే ఎక్కువ నగదు లావాదేవీలపై పరిమితులు క్రెడిట్ కార్డు బిల్లు చెల్లింపులు, బ్యాంకులు నియమించిన వ్యాపార ప్రతినిధులు మరియు ప్రీపెయిడ్ ఇన్స్ట్రుమెంట్స్ జారీచేసేవారికి వర్తించంటూ ఆదాయపన్నుశాఖ భారీ ఊరటనిచ్చింది. తాజా నోటిఫికేషన్ ద్వారా ఆదాయపన్ను శాఖ పరిధినుంచి అయిదు అంశాలను మినహాయించింది. అయితే బ్యాంకులు, కో-ఆపరేటివ్ బ్యాంకుల తరపున పనిచేసే బిజినెస్ కరస్పాండెంట్లు, ఒకటి అంతకన్నా ఎక్కువ క్రెడిట్ బిల్లు చెల్లింపులకు కంపెనీ లేదా సంస్థ ఇచ్చే రసీదులు, ప్రీపెయిడ్ పేమెంట్ పరికరాల ద్వారా చేసే చెల్లింపులు, రిటైల్ అవుట్లెట్లు నిర్వహించే వైట్ లేబుల్ ఏటీఏంలు ఇచ్చే రసీదులు.. ఐటీ చట్టం 1961 సెక్షన్ 10 క్లాజ్ (17ఏ) ప్రకారం వ్యక్తి మొత్తం ఆదాయంలో ఇది కలవబోదని తెలిపింది. కాగా 2017 , ఏప్రిల్ 1 నుంచి అమలయ్యేలా 2017 ఆర్థిక బిల్లు ప్రకారం రూ.2లక్షలు, ఆ పైన ట్రాన్సాక్షన్స్‌పై నిబంధనలు విధించింది. అక్రమ లావాదేవీలను నివారించేందుకు, డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించేదిశగా ప్రభుత్వం ఈనిర్ణయం తీసుకుంది. ఇలాంటి లావాదేవీలపై 100 శాతం జరిమానా చెల్లించాల్సిందేనని హెచ్చరించిన సంగతి తెలిసిందే.