సియోల్: టెలికం రంగంలో 5జీ నెట్‌వర్క్ ఒక సంచలనం అని చెప్పాలి. ఇప్పటికే మన దేశంలో చాలా ప్రాంతాల్లో 5 జీ నెట్ వర్క్ అందుబాటులోకి వచ్చింది. తాజాగా దక్షిణ కొరియా ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేస్తోంది. ముఖ్యంగా అనుకున్న దానికంటే రెండు సంవత్సరాల ముందుగానే అందు బాటులోకి తేనున్నామని, దక్షిణ కొరియా సైన్స్, ఐసీటీ మంత్రిత్వశాఖ సోమవారం తెలిపింది.రాబోయే 6జీ నెట్‌వర్క్ పేటెంట్ పోటీలో ఈ సంఖ్యను 30 శాతం లేదా అంతకంటే ఎక్కువ పెంచనున్నట్లు దక్షిణ కొరియా ప్రభుత్వం తెలిపింది.
ఎలెక్ట్రానిక్స్, ఆటోమొబైల్స్, రోబోటిక్ నూతన సాకేంతికత, ఉత్పత్తులతో దూసుకుపోతున్న దక్షిణ కొరియా 2028లో ప్రపంచంలోనే తొలి 6జీ నెట్‌వర్క్ సేవను ప్రారంభించాలని యోచిస్తోంది. వైర్‌లెస్ రంగంలో తన ఆధిపత్యాన్ని చాటుకునేలా కే-నెట్‌వర్క్ 2030 ప్రణాళికలో భాగంగా నెక్ట్స్ జెన్ నెట్‌వర్క్ కోసం రానున్న రెండేళ్లలో మరింత వేగవంతం చేయనుంది.
బెర్నామా నివేదిక ప్రకారం ప్రపంచస్థాయి 6జీ టెక్నాలజీ ద్వారా సురక్షితమైన మొబైల్ నెట్‌వర్క్‌ను దక్షిణ కొరియా ఆవిష్కరించనుంది. కౌంటీ నెట్‌వర్క్ సరఫరా గొలుసును బలోపేతం చేయాలనే ప్రణాళికలో భాగంగా, దక్షిణ కొరియా మంత్రిత్వ శాఖ కసరత్తు చేస్తోంది. ఇందుకోసం 625.3 బిలియన్ వోన్ లేదా 481.7 బిలియన్ డాలర్ల విలువైన కోర్ 6జీ సాంకేతికతలపై పరిశోధన, అభివృద్ధి ప్రాజెక్ట్ సాధ్యాసాధ్యాల అధ్యయనం జరుగుతోందని మంత్రిత్వ శాఖ తెలిపింది. అంతేకాకుండా, దేశంలో తదుపరి తరం మొబైల్ నెట్‌వర్క్ టెక్నాలజీ ఉత్పత్తులపై దేశీయ కంపెనీలను ప్రోత్సహించాలని భావిస్తోంది. మొబైల్ పరికరానికి అనుకూలంగా ఉండే ఓపెన్ RAN లేదా ఓపెన్ రేడియో యాక్సెస్ నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం స్థానిక కంపెనీలను ప్రోత్సహించనుదని Yonhap నివేదించింది.
కాగా ఆసియాలో నాల్గవ-అతిపెద్ద ఆర్థికవ్యవస్థ గత సంవత్సరం 5జీ పేటెంట్ల సంఖ్యలో 25.9 శాతంగా ఉంది. ఈ విషయంలో మార్కెట్ లీడర్ చైనాను 26.8 శాతం మాత్రమే అనేది గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment