సాక్షి ప్రతినిధి, చెన్నై: ‘బాబోయ్..భార్యల గృహహింసను భరించలేకున్నాం..హెల్ప్‌లైన్ ఏర్పాటు చేసి రక్షించండి’..లాక్‌డౌన్ వేళ తమిళనాడులోని భర్తల గోడు ఇది. ఇళ్లకే పరిమితమైన భర్తలను భార్యల గృహహింస నుంచి కాపాడాల్సిందిగా తమిళనాడు పురుషుల రక్షణ సంఘం అధ్యక్షుడు, న్యాయవాది అరుళ్ తమిళన్ తమిళనాడు ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామికి ఒక వినతిపత్రం పంపారు. ఉత్తరంలోని వివరాలు ఇలా ఉన్నాయి. ‘కరోనావైరస్ కారణంగా ఇంటికే పరిమితమైన మగవారి పరిస్థితి దయనీయంగా మారింది.
భార్యల వల్ల ఎదుర్కొంటున్న గృహహింస భౌతికంగానే కాక మానసికంగా కూడా బాధపెడుతోంది. మహిళా సంరక్షణ, సంక్షేమ చట్టాలను చూపి భర్తలను బెదిరిస్తున్నారు. మరోవైపు గృహహింసకు పాల్పడే మగవారిని వెంటనే అరెస్ట్ చేస్తామని అదనపు డీజీపీ రవి విడుదల చేసిన ఒక ప్రకటన మగవారిని మరింత అవేదనకు గురిచేస్తోంది. మగవారి బాధలు తెలుపుకునేందుకు కనీసం ఒక హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేయాలని అరుళ్ తమిళన్ అందులో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment