ఈ పప్పు ప్రయోజనాలు తెలిస్తే.. అస్సలు మిస్‌ కారు! | Everyone Should Know Magnificent benefits of Urad Dal | Sakshi
Sakshi News home page

ఈ పప్పు ప్రయోజనాలు తెలిస్తే.. అస్సలు మిస్‌ కారు!

Published Mon, Jan 8 2024 3:15 PM | Last Updated on Mon, Jan 8 2024 3:36 PM

Everyone Should Know Magnificent benefits of Urad Dal - Sakshi

దక్షిణ భారతంలో మినపప్పు  (బ్లాక్ గ్రామ్) లేదా ఉరద్ దాల్‌ గురించి తెలియని వారుండరు. ప్రముఖ అల్పాహారాలు, ఇడ్లీలు, దోసెలు, వడలు లాంటి తయారీలో ఈ గింజ ధాన్యం  కీలక మైంది. అంతేకాదు  వంటగదిలో  ఇదిలేకుండా పోపుల పెట్టె సంపూర్ణమే కాదు. అలాగే జబ్బు పడిన వారు త్వరగా కోలుకోవాలంటే మినపగారెలు, సున్నుండలు పెట్టడం బాగా అలవాటు. ఇందులోని ఐరన్‌ కంటెంట్‌  శరీరానికి త్వరగా శక్తిని ఇస్తుందని  ఆహార నిపుణులు చెబుతారు.
 
ఇందులో రుచితోపాటు బోలెడన్ని ఆరోగ్య ప్రయజనాలు కూడా ఉంటాయి.  ప్రోటీన్లు మెండుగా ఈ పప్పులో  విటమిన్ బీ కూడా పుష్కలంగా ఉంటుంది. ఆయుర్వేదలో మాషా అని పిలుస్తారు.  ఆయుర్వేదంలో ఆర్థరైటిస్, ఆస్తమా, పక్షవాతం లాంటి జబ్బుల నివారణలో వాడతారట. అలాగే మినపప్పు తీసుకోవడం వల్ల తల నొప్పి, జ్వరం, ఇంఫ్లమేషన్ వంటి సమస్యలనుంచి దూరం కావచ్చట.

సౌందర్య పోషణలో 
మహిళల సౌందర్యపోషణలో కూడా దీని ప్రయోజనాలు తక్కువేమీ కాదు. మినరల్స్ , విటమిన్లు పుష్కలంగా ఉన్న  మినపప్పు సన్‌ టాన్స్  ను వదలగొడుతుంది. ఆరోగ్యవంతమైన, సూపర్ మెరిసే జుట్టును పెరుగుదలకు తోడ్పడుతుంది.  మొటిమల సమస్యతో బాధపడేవారు మినపప్పుని కొద్దిగా పాలల్లో వేసి మెత్తగా నూరి, ఈ మిశ్రమానికి కొద్దిగా నిమ్మరసం, తేనె కలిపి  ముఖానికి అప్లై చేసుకుని, ఆ తర్వాత చల్లని నీళ్లతో కడిగేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. అంతేకాదు పురుషుల  లైంగిక సమస్యలను తొలగించడంలో బాగా సహాయపడుతుందట.

మినపప్పు - లాభాలు
►ఫైబర్‌, మెగ్నీషియం, ఐరన్, పొటాషియం, ఫాస్పరస్ ,  కాల్షియం అధికంగా ఉన్నాయి. దీనిని తరచుగా తీసుకుంటే ఎముకలకు సంబంధించిన సమస్యలను దూరం చేసుకోవచ్చు.
►పేగు ఆరోగ్యాన్ని (గట్‌ హెల్త్‌) మెరుగుపరుస్తుంది:
►బాడీలోని ఐరన్‌ లెవల్స్‌పెరిగేందుకు తోడ్పడుతుంది
 ►గుండెను హెల్దీగా, దృడంగా ఉంచేలా చేస్తుంది.
►నాడీ వ్యవస్థను బలపరుస్తుంది, నాడీ బలహీనత, పాక్షక పక్షవాతం, ముఖ పక్షవాతం ,ఇతర రుగ్మతల నివారణకు వివిధ ఆయుర్వేద ఔషధాలలో ఉపయోగిస్తారు.
►మినపప్పు గ్లూకోజ్ స్థాయిలను  నియంత్రిస్తుంది.. సో మధుమేహం ఉన్నవారికి కూడా మంచిదే
 ►వెయిట్‌ లాస్‌లో మినప పప్పు  ఉపయోగపడుతుంది, ఎముకలను దృఢంగా ఉంచుతుంది. 
 ►కిడ్నీలను కాపాడటంలో కూడా  మినపప్పు ఉపయోగపడుతుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement