వాషింగ్టన్: ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో వైరస్‌ను నివారించేందుకు అనేక ప్రయోగాలు జరుగుతున్నాయి. కాగా వైరస్‌ను తట్టుకునేందుకు రోగనిరోధకశక్తి చాలా కీలకమని అన్ని సర్వేలు చెబుతున్నాయి. ఈ క్రమంలో పురుషుల కన్న మహిళలకే రోగనిరోధకశక్తి ఎక్కువని, అందువల్ల కరోనాను మహిళలు సులభంగా జయిస్తున్నారని యేల్ యూనివర్సిటీకి(యూఎస్ఎ) చెందిన నేచర్ జర్నల్ నివేదికలో తెలిపింది. కాగా కరోనాను ఎదుర్కొనే టీసెల్స్ మహిళలకు ఎక్కువగా ఉంటాయని నివేదిక పేర్కొంది.
అయితే మానవుల్లో టీసెల్స్ సమృద్ధిగా ఉంటే క్రిమికారక వైరస్‌లను సులభంగా ఎదుర్కొంటాయి. అయితే పురుషుల్లో టీసెల్స్ నామమంత్రంగా పనిచేస్తున్నట్లు నివేదిక తెలిపింది. కాగా 98 మంది కరోనా బాధితులను పరీక్షించి నివేదికను రూపోందించారు. మరోవైపు రోగనిరోధక శక్తికి బలం చేకూర్చే సైటోకైన్స్ వ్యవస్థ మహిళల్లో అత్యద్భుతంగా పనిచేస్తున్నట్లు నివేదిక పేర్కొంది.
చదవండి: ఈ టెక్నిక్‌తో కరోనా వైరస్‌కు చెక్!
Comments
Please login to add a commentAdd a comment