
ఆత్మకూరురూరల్ : సాయం సంధ్యా వేళ పచ్చటి పొలాలపై విహంగాల విహారం ప్రకృతి ప్రేమికులను పరవశింపజేసింది. వేసవి తాపంతో పలు రకాల పక్షిజాతులు మధ్యాహ్నం వేళ నీడపట్టున తలదాచుకుంటున్నాయి. ఉదయం, సాయంత్రం వేళల్లో మాత్రమే ఆహార అన్వేషణ చేస్తూ విహరిస్తున్నాయి. మండలంలోని కరటంపాడులో పచ్చని పంట పొలాలపై ఆదివారం సూర్యాస్తమయ వేళలో పలు రకాల విహంగాలు, గుంపులు, గుంపులుగా విహారం చేస్తూ ప్రకృతి ప్రేమికులకు కనువిందు చేశాయి.
Comments
Please login to add a commentAdd a comment