కలలో ఎక్కువగా వచ్చేది శృంగారమే!! | Sex, flying most sought-after dreams | Sakshi
Sakshi News home page

కలలో ఎక్కువగా వచ్చేది శృంగారమే!!

Published Fri, Jul 11 2014 3:27 PM | Last Updated on Mon, Jul 23 2018 8:49 PM

కలలో ఎక్కువగా వచ్చేది శృంగారమే!! - Sakshi

కలలో ఎక్కువగా వచ్చేది శృంగారమే!!

లండన్: మనకు రాత్రిపూట కలలు రావడం సహజం. నిద్రాదేవి ఒడిలోకి అలా జారుకుంటే చాలు.. ఎక్కడినుంచి వస్తాయోగానీ, కలలు అలా.. అలా.. వచ్చేస్తాయి. అయితే, ఎక్కువగా ఎలాంటి కలలు వస్తాయంటే మాత్రం చాలామంది చెప్పడానికి కాస్తంత సిగ్గు పడతారు. ఎందుకంటే, ఎక్కువగా వచ్చేది శృంగారానికి సంబంధించిన కలలేనట. ఈ విషయాన్ని మానసిక శాస్త్రవేత్తలు ఇప్పుడు తేల్చి చెబుతున్నారు. వీటితోపాటు, ఎక్కడికో ఎగిరిపోతున్నట్లు కూడా కలలు వస్తాయట. ఎగిరిపోతే ఎంత బాగుంటుందీ అనుకుంటూ కలలు కనడం మానవులకు సర్వసాధారణమని చెబుతున్నారు. ఇందుకు గాను అమెరికా శాస్త్రవేత్తలు 570 మందిని పరిశోధించారు.

 

వీరిలో అధికశాతం మంది శృంగార పరమైన కలలు, ఎగిరిపోతున్నట్లు వచ్చే కలలను మాత్రమే వారి జీవితంలో చోటు చేసుకున్నట్లు తెలిపారు. అయితే ఆ కలలు ఏ క్రమంలో వచ్చాయన్నది మాత్రం వారు వ్యక్తపరచలేకపోయారు. ఇంకా నీటిలో ఊపిరి తీసుకోవడం, జంతువులతో మాట్లాడటం వంటి కలలు కూడా  వచ్చినట్లు కొంతమంది తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement