
ఇప్పటికే ఎగిరే కార్లు వచ్చేశాయి. వాటి వరుసలోనే తాజాగా ఎగిరే ఓడలు కూడా వచ్చేశాయి. సముద్రం మీదుగా రవాణా చేయటానికి ఉపయోగించే ఓడలు, ఇప్పుడు గాలిలో ఎగురుతూ ప్రయాణం చేస్తాయి. ది ఫ్లయింగ్ షిప్ కంపెనీ వింగ్‌టిప్స్ రూపొందించిన ఈ ఎగిరే ఓడ సాధారణమైన ఓడల కంటే పదిరెట్లు వేగంగా ప్రయాణిస్తుంది.
హోవర్ ఇంజిన్లతో తయారుచేసిన ఈ ఓడ బ్యాటరీలతో పనిచేస్తుంది. ఒకేసారి మొత్తం 22 కిలోల బరువు వరకు సరుకు రవాణా చేయగలదు. ఇక దీనికున్న పది అడుగుల పొడవైన రెక్కల సాయంతో, ఈ నౌక దాదాపు సముద్రంపై నుంచి 80 కిలోమీటర్ల పరిధి మేరకు ఎగురుతుంది.
ఇది గంటకు గరిష్ఠంగా 19 నుంచి 27 మైళ్ల (సుమారు 30 కిలోమీటర్ల నుంచి 43 కిలోమీటర్ల) వేగంతో ప్రయాణిస్తుంది. దీనిని ప్రధానంగా సరుకుల రవాణా కోసం రూపొందించినట్లు కంపెనీ తెలిపింది. త్వరలోనే ఈ ఎగిరే ఓడల్లో మరో రెండు మోడల్స్‌ను విడుదల చేయనున్నట్లు సమాచారం.
ఇదీ చదవండి: వాట్సాప్‌లోనే కరెంట్ బిల్, మొబైల్ రీఛార్జ్: కొత్త ఫీచర్ వచ్చేస్తోంది
Comments
Please login to add a commentAdd a comment