![USA Parachute Flying Crash Supraja Deceased Prakasam District - Sakshi](/styles/webp/s3/article_images/2022/05/31/Parachute.jpg.webp?itok=6-76MEXr)
సాక్షి, ప్రకాశం జిల్లా: అమెరికాలో విహారయాత్రలో విషాదం చోటుచేసుకుంది. ఫ్లోరిడాలో ప్యారాచూట్ ఫ్లయింగ్ చేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలడంతో బాపట్ల జిల్లా సంతమాగులూరు మండలం మక్కేనవారిపాలెం గ్రామానికి చెందిన సుప్రజ అక్కడికక్కడే మృతి చెందింది. సుప్రజ కుమారుడు అఖిల్ స్వల్పగాయాల బారిన పడ్డాడు. భారత కాలమానం ప్రకారం మంగళవారం వేకువజామున మూడున్నర గంటలకు ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాద ఘటనతో మక్కేనవారిపాలెం గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment