సాంకేతిక అభివృద్ది, వినియోగంలో టాప్‌ప్లేస్ లో దూసుకుపోతున్న దుబాయ్ మరోఘనతను సాధించింది. ప్రపంచంలోనే మొట్టమొదటి డ్రైవర్ రహిత గగన విహంగ వాహనం (ఫస్ట్ సెల్ఫ్ ప్లయింగ్ టాక్సీ) సోమవారం ప్రారంభించింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అటానమస్ ఫ్లయింగ్ ట్యాక్సీ సేవలను ప్రారంభించి ఇన్నోవేషన్ లో అరబ్ ప్రపంచాన్ని శిఖరాగ్రాన నిలిపింది.