Test Run
-
రయ్‌మని గాల్లో ఎగిరిన కారు..ధర ఎంతంటే..
కాలిఫోర్నియా:ప్రపంచంలోని అన్ని టాప్ సిటీల్లో నివసించే వారికి ఒకటే ప్రధాన సమస్య. ఉదయం ఆఫీసులకు వెళ్దామంటే రోడ్లపై కదలకుండా చేసి చిరాకు తెప్పించే ట్రాఫిక్. ఈ పద్మవ్యూహాన్ని తప్పించుకుని హాయిగా గాలిలో ఎగురుకుంటూ వెళ్లేందుకు ఎగిరే కార్లు త్వరలో అందుబాటులోకి రానున్నాయి.ఇలాంటి ఎగిరే కారును ఒకదానిని అమెరికా కాలిఫోర్నియాలోని రోడ్లపై పరీక్షించింది వాటిని తయారు చేసిన కంపెనీ అలెఫ్ ఏరోనాటిక్స్.టెస్ట్‌లో భాగంగా నలుపు రంగులో ఉన్న ఓ ఎగిరే కారు తొలుత మామూలు కారులానే రోడ్డుపై రయ్‌మని దూసుకెళ్లింది.ఇలా వెళ్లిన కొద్ది సేపటికి కారు హెలికాప్టర్లా నిట్టనిలువునా గాల్లోకి లేచి ఎగురుకుంటూ వెళ్లింది. ఈ పరీక్ష విజయవంతమైనట్లు కంపెనీ ప్రకటించింది. పరీక్ష సమయంలో రోడ్డుపై ఎవరు లేకుండా కారు ఎగిరే ప్రదేశంలో ఏవీ అడ్డు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు కంపెనీ ప్రకటించింది. అలెఫ్ ఏరోనాటిక్స్ తయారు చేసిన విద్యుత్‌తో నడిచే ఎగిరేకారు ధర ఒక్కోటి 30వేల డాలర్లు.కంపెనీకి కస్టమర్ల నుంచి 3వేల కార్లకు ఇప్పటికే ఆర్డర్లు వచ్చాయి.నలుగురు కూర్చొని వెళ్లగలిగే 200 కిలోమీటర్లు గాలిలో ఎగిరే రేంజ్, 400 కిలో మీటర్లు రోడ్డు రేంజ్ ఉన్న మోడల్ జెడ్ సెడాన్ కారు 2035కల్లా అందుబాటులోకి తీసుకురానున్నారు,. -
రోల్స్ రాయిస్ మరో నూతన ఆవిష్కరణ
ఇంగ్లండ్: బ్రిటన్‌కు చెందిన లగ్జరీ ఆటోమొబైల్స్ మేకర్ రోల్స్ రాయిస్ మరో నూతన ఆవిష్కరణతో మన ముందుకొస్తోంది. అత్యంత వేగంగా ఎగిరే విద్యుత్ విమానాన్ని రూపొందిస్తున్న ఈ సంస్థ.. అందులో వినియోగించే టెక్నాలజీని విజయవంతంగా పరీక్షించింది. ఈ విమానానికి ‘అయాన్ బర్డ్’గా నామకరణం చేసిన రోల్స్ రాయిస్ ఇంజనీర్లు.. రెప్లికా వెర్షన్ టెస్ట్ ఫలితాలతో సంతప్తి వ్యక్తం చేస్తున్నారు. 500 హార్స్ పవర్ సామర్థ్యం కలిగి ఉండడంతో ఈ విద్యుత్ విమానం రికార్డు స్థాయి వేగాన్ని క్షణాల్లో అందుకోగలదని రోల్స్ రాయిస్ డైరెక్టర్ రాబ్ వాట్సన్ వివరించారు. ఈ విమానం టెక్నాలజీని పరీక్షించేందుకు ఉపయోగించిన విద్యుత్.. 250 ఇళ్లకు వినియోగించే విద్యుత్‌తో సరిసమానమని చెప్పారు. సోషల్ డిస్టెన్స్ నిబంధనలకు అనుగుణంగానే అన్ని జాగ్రత్తలూ తీసుకుని టెస్ట్ నిర్వహించామని ఆయన చెప్పారు. టెక్నాలజీ టెస్ట్ విజయవంతంగా పూర్తవడంతో అతి త్వరలోనే అన్ని పరికరాలనూ విమానంలో అమర్చుతామని తెలిపారు. 2050 నాటికి కాలుష్య రహిత విమానాల తయారీలో తాము కీలకం కాబోతున్నామని వాట్సన్ ఆశాభావం వ్యక్తం చేశారు. -
మరోసారి సత్తా చాటిన దుబాయ్
-
మరోసారి సత్తా చాటిన దుబాయ్
దుబాయి: సాంకేతిక అభివృద్ది, వినియోగంలో టాప్ప్లేస్ లో దూసుకుపోతున్న దుబాయ్ మరోఘనతను సాధించింది. ప్రపంచంలోనే మొట్టమొదటి డ్రైవర్ రహిత గగన విహంగ వాహనం (ఫస్ట్ సెల్ఫ్ ప్లయింగ్ టాక్సీ) సోమవారం ప్రారంభించింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అటానమస్ ఫ్లయింగ్ ట్యాక్సీ సేవలను ప్రారంభించి ఇన్నోవేషన్ లో అరబ్ ప్రపంచాన్ని శిఖరాగ్రాన నిలిపింది. అటానమస్ ఎయిర్ టాక్సీని (ఏఏటీ) దుబాయ్రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ విజయవంతంగా పరీక్షించింది. అయితే ఎపుడు అందుబాటులోకి వచ్చేది ఇంకా స్పష్టం చేయలేదు. అత్యాధునిక టెక్నాలజీని, ఆనందాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడంలో తాము మరో మైలురాయిని అధిగమించామని దుబాయ్ రాజు సంతోషం వ్యక్తం చేశారు. 18 ప్రొపెల్లర్లతో జర్మన్ డ్రోన్ సంస్థ వోలోకాప్టర్ దీన్ని అభివృద్ధి చేసింది. చిన్న, రెండు-సీటర్ హెలికాప్టర్ కాబిన్తో దీన్ని రూపొందించింది. దుబాయ్ ప్రిన్స్ షేక్ హమ్దాన్ బిన్ మహ్మద్ కోసం ఏర్పాటు చేసిన వేడుకలో తొలి టెస్ట్ రన్ నిర్వహించారు. టెస్ట్ రన్లోఈ వాహనం సుమారు 200 మీటర్ల ఎత్తుకు చేరుకుంది. అలాగే విపత్కర పరిస్థితుల్లో ఆదుకునేలా బ్యాక్బ్యాటరీలు, రోటర్స్, రెండు పారాచూట్లు లాంటిరక్షణ పరికరాలు కూడా జోడించింది. డ్రైవర్ రహిత ఎగిరే ట్యాక్సీ పనితీరును, ఆపరేషన్‌ను గ్రౌండ్ నుండి మానిటర్ చేసే వ్యవస్థ ఉంటుంది. గరిష్టంగా 30 నిమిషాల పాటు ఎగురుతుంది. 2021 నాటికి ఒక మానవరహిత డ్రోన్‌ను మార్స్ మీదికి పంపాలని దుబాయ్ పథకాలు రచిస్తోంది. తద్వారా అంతరిక్షంలో తొలిసారి అడుగుపెట్టబోతోంది. నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించడం , కరెంట్ టెక్నాలజీని స్వీకరించడం దేశ అభివృద్ధికి దోహదం చేయడం మాత్రమేకాకుండా భవిష్యత్ తరానికి వంతెన వేస్తుందని దుబాయ్ రాజు షేక్ హందాన్ చెప్పారు. కాగా దుబాయ్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన బిల్డింగ్, ప్రపంచపు అతి పెద్ద మానవ నిర్మిత దీవి ఇలా అనేక రికార్డులను సాధించిన సంగతి తెలిసిందే. -
హైస్పీడ్ ట్రైన్ టెస్ట్ రన్
-
గంటకు 603 కిలో మీటర్ల స్పీడ్
-
మెట్రో రైలు టెస్ట్ రన్ దృశ్యాలు
-
మెట్రో రైలు టెస్ట్ రన్ సక్సెస్
హైదరాబాద్: భాగ్యనగరం మరో అరుదైన ఘనతను సాధించింది. జంట నగరాలలో ట్రాఫిక్ రద్దీ సమస్యను తగ్గించేందుకు ప్రారంభించిన మెట్రో రైలు ప్రాజెక్ట్ ఓ మైలు రాయిని అధిగమించింది. హైదరాబాద్‌లోని నాగోల్ స్టేషన్ నుంచి సర్వే ఆఫ్ ఇండియా వరకు మెట్రో రైలు టెస్ట్ రన్ అధికారులు నిర్వహించారు. కిలో మీటర్ పరిధి వరకు ట్రాక్, కోచ్‌ల పనితీరును అధికారులు పరిశీలించారు. ట్రాక్, కోచ్ పనితీరుపై అధికారులు సంతృప్తిని వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.