
వెంకయ్యనాయుడుకు కోపమొచ్చింది!
న్యూఢిల్లీ: పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్యనాయుడికి కోపమొచ్చింది. లోక్‌సభలో కాంగ్రెస్‌నేత మల్లిఖార్జున్ ఖర్గే వ్యాఖ్యలపై సోమవారం వెంకయ్యనాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్రంటైసెస్ సవరణ బిల్లును స్థాయీసంఘానికి పంపించాలని డిమాండ్ చేస్తున్న సందర్భంలో ఖర్గే.. ‘ఇలా ప్రతీ విషయంలో మొండిగా ముందుకెళ్తుంటే(బుల్డోజింగ్) ఇక పార్లమెంటు అవసరమే ఉండదు’ అని వ్యాఖ్యానించారు. వెంకయ్యనాయుడు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ‘మీరు పదేపదే ఆ పదాలు(బుల్డోజింగ్) వాడుతున్నారు. అలాంటి పదాలు ఉపయోగించడం మంచిది కాదు.’అన్నారు