సాక్షి, న్యూఢిల్లీ : పార్లమెంట్ శీతాకాల సమావేశాలపై ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ధ్వజమెత్తింది. ప్రధాని నరేంద్ర మోదీ ఒక బ్రహ్మ, ఒక సృష్టికర్త.. ఆయనకు మాత్రమే పార్లమెంట్ సమావేశాలు ఎప్పుడు జరుగుతాయో తెలుసంటూ.. లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష నేత మల్లిఖార్జున ఖర్గే తీవ్రంగా విమర్శించారు. ప్రధాని కావాలనే శీతాకాల సమావేశాలను నిర్వహణను ఆలస్యం చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. మోదీ హయంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని ఆయన అన్నారు. నరేంద్ర మోదీకి ప్రజాస్వామ్యం పట్ల ఏ మాత్రం గౌరవం, విశ్వాసం లేవని చెప్పారు.
’పార్లమెంట్ శీతాకాల సమావేశాల గురించి పలువురు మంత్రులను సంప్రదించాను. లోక్‌సభ ప్రధానకార్యదర్శిని అడిగాను. అయినా ఏ ఒక్కరు సమావేశాల గురించిన స్పష్టమైన ఇవ్వలేదు‘ అని ఖర్గే చెప్పారు. దేశంలో ప్రస్తుతం ఒక్క నరేంద్ర మోదీకి మాత్రమే శీతాకాల సమావేశాలు ఏప్పుడు జరుగుతాయో తెలుసని.. ఆయన మాత్రమే సృష్టికర్త అంటూ వ్యంగ్యంగా అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment