
కోపమొస్తే.. కీబోర్డుపైనే..
ఆఫీసులో బాస్ తిట్టాడు.. కోపమొచ్చింది.. చాలా మంది దాన్ని కీబోర్డుపై ప్రదర్శిస్తారు.. కొందరు అదేమైనా అయితే.. మళ్లీ మనకే బాధ అని కోపాన్ని దిగమింగేస్తారు. అలాంటోళ్ల కోసమే జర్మనీకి చెందిన బ్లెస్ అనే సంస్థ ఈ వర్కవుట్ కంప్యూటర్‌ను తెచ్చింది. ఇందులో వివిధ కీల స్థానంలో పంచ్‌బ్యాగులుంటా యి.
కోపమొస్తే.. వాటిని ఎడాపెడా బాదేయడమే.. కోపం తీర్చుకోవడంతోపాటు అదే సమయంలో మీ పని కూడా చేసుకోవచ్చు. పంచ్‌బ్యాగుల్లో ఉండే సెన్సర్లు మీరే కీ ఉన్న పంచ్‌బ్యాగును కొడితే.. అది స్క్రీన్‌పై ప్రదర్శితమయ్యేలా చేస్తాయి. అంటే.. డియర్ సార్ అని కొట్టాలంటే.. దానికి సంబంధించిన అక్షరాలు ఉన్న పంచ్‌బ్యాగులపై కొడితే.. అది స్క్రీన్‌పై ప్రింట్ అవుతుంది.
ఇది ఒక్క కోపాన్ని తీర్చుకోవడానికే కాదు.. ఈ బిజీబిజీ జీవితంలో వర్కవుట్ చేయడం సాధ్యం కాని వారికి చక్కని కసరత్తునూ అందిస్తుంది. ఇటు వర్కవుట్ చేసుకోవచ్చు.. అటు ఆఫీసు పనీ పూర్తయిపోతుంది.