న్యూఢిల్లీ: మన శరీర నిర్మాణ వ్యవస్థ సక్రమంగా పనిచేయాలంటే వేళకు నిద్రిపోవడం ఎంతో అవసరం. ఎన్ని కోట్లున్న నిద్ర కరువయితే జీవితం వ్యర్థం అనే విషయం అందరికి తెలిసిందే. ప్రస్తుత పోటీ ప్రపంచంలో నిద్ర కరువయి, చాలా మంది సతమవుతున్నారు. కాగా ప్రతి ఒక్కరికీ కనీసం ఏడు గంటల నుంచి 9గంటల సంతృప్తికరమైన, నాణ్యమైన నిద్ర అవసరం అని డాక్టర్ శ్రేయా గుప్తా చెబుతున్నారు. ఆమె నిద్ర అవసరాన్ని వివరించారు. మనం నాణ్యమైన నిద్ర పోగలితే హార్మోన్లు, గుండె, మెదడు తదితర అవయవాలలో రోగనిరోధక శక్తి పెరిగి మరుసటి రోజు ఉత్సాహంగా ఉంటామని డాక్టర్ చెబుతున్నారు.
కాగా ఏకారణంతోనైన సరియైన నిద్ర పోనప్పుడు విపరీతమైన కోపం, ఓపిక లేకపోవడం, భావోద్వేగ నియంత్రణ కోల్పోవడం తదితర చెడు సంఘటనలు జరిగే అవకాశం ఉంది. నిద్ర సరిగ్గా లేకపోతే మెదడులో కీలకంగా ఉన్న ‘అమిగ్‌డాలా’ అనే రసాయన పనితనం మందగిస్తుందని ఇటీవలే జర్నల్ ఆఫ్ రీసెర్చ్ తెలిపింది. కోపానికి, నిద్రకు సంబంధం ఉన్నట్లు ఆధారాలతో నిరూపించింది. నిద్ర సమస్యలను అధిగమించాలంటే పౌష్టికాహారం, వ్యాయాయం, మానసిక ప్రశాంతత మూడు కచ్చితంగా పాటించాలని డాక్టర్ ప్రజలకు సూచిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment