జమ్మికుంట : జమ్మికుంట పత్తి మార్కెట్లో అధికారులు అన్నదాతతో ఆడుకుంటున్నారు. ఆరుగాలం కష్టపడి పత్తిని అమ్ముకునేందుకు మార్కెట్ కొస్తే గాలికి వదిలేస్తున్నారు. సకాలంలోని ఇంటికెళ్లాల్సిన వారిని మార్కెట్లోనే జాగారం చేయూల్సిన పరిస్థితిని తీసుకొస్తున్నారు. పొదం్దతా కొనుగోళ్ల కోసం ఎదురుచూసినా పత్తిబస్తాల వైపు కన్నెత్తి చూడకపోవడంతో రైతుల కోపం కట్టలు తెంచుకుంది. దీంతో మార్కెట్‌ను ముట్టడించి లోనికి చొచ్చుకెళ్లడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వెంటనే పోలీసులు గొడవ జరగకుండా అడ్డుకున్నారు.
జమ్మికుంట మార్కెట్‌కు వివిధ ప్రాంతాల నుంచి రైతులు సోమవారం నాలుగువేల బస్తాల్లో పత్తిని అమ్మకానికి తీసుకొచ్చారు. మూడువేల క్వింటాళ్ల లూజ్ పత్తి వచ్చింది. సీసీఐ అధికారులు మొదట లూజ్ పత్తిని కొనుగోలు చేశారు. ఎడ్లబండి కార్మికుల ఆందోళన మూడుగంటల అనంతరం సమస్య సద్దుమణిగింది. అయితే రైతులు తీసుకొచ్చిన పత్తి బస్తాలను కొనుగోలు చేసేందుకు అటు సీసీఐ అధికారులు, ఇటు వ్యాపారులు ముందుకురాలేదు.
పొద్దంతా ఎదురుచూసిన రైతులు కొనుగోళ్లు చేపట్టకపోవడంతో ఆగ్రహంతో మార్కెట్ కార్యాలయాన్ని ముట్టడించారు. దీంతో కార్యాలయంలో ఉన్న ఇన్‌చార్జి కార్యదర్శి అశోక్, సీసీఐ అధికారులు, అడ్తిదారులు బయటకు వచ్చి సీసీఐ పత్తిని కొనుగోళ్లు చేస్తుందని నచ్చచెప్పేందుకు ప్రయత్నించారు. ‘మాతో ఆడుకుంటున్నారా... పొద్దుగాల వస్తే ఇప్పటి వరకు ధరలు, కొనుగోళ్లు ఉండవా..’ అంటూ రైతులు ప్రశ్నించారు. రైతులు లోనికి ప్రవేశించడంతో ఒక్కసారిగా ఉద్రిక్తత వాతావారణం ఏర్పడింది.
కరీంనగర్‌కు చెందిన ఏఆర్ పోలీసులు కార్యాలయానికి చేరుకుని రైతులను నిలువరించారు. తిండి ఠికానా లేకుండా యార్డులో ఎప్పటి వరకు ఉండాలంటూ అధికారులతో వాగ్వాదానికి దిగారు. మద్దతు ధరలతో ప్రతీ రైతు సరుకును కొంటామని సీసీఐ అధికారులు హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు.అయితే అప్పటికే చీక టి పడడం, కార్మికులు వెళ్లిపోవడంతో రాత్రంతా రైతులు మార్కెట్లో జాగారం చేయూల్సి వచ్చింది.
అన్నదాతతో ఆడుకున్నారు...
Published Tue, Nov 18 2014 4:02 AM | Last Updated on Mon, Oct 1 2018 2:03 PM
Advertisement
Advertisement