వేలంపాటకు మంగళం
► వ్యాపారులు,అడ్తిదారులదే రాజ్యం
► గాడితప్పుతున్న పత్తి కొనుగోళ్లు
► జమ్మికుంటలో దగాపడుతున్న రైతులు
జమ్మికుంట : జమ్మికుంట వ్యవసాయ పత్తి మార్కెట్‌లో కొనుగోళ్లు రోజురోజుకు గాడితప్పుతున్నారుు. వందలాది వాహనాల్లో వచ్చిన పత్తికి వేలం వేలంపాట పాడకుండానే ఇష్టానుసారంగా ధరలు నిర్ణరుుస్తూ మిల్లులకు తరలిస్తున్నారు. పోటీ లేక పోవడంతో సేటు చెప్పిన ధరకే పత్తిని అమ్ముకునే దుస్థితి నెలకొందని పలువురు రైతులు వాపోతున్నారు. మార్కెట్‌కు వచ్చే ప్రతి లూజ్ పత్తికి వేలంపాట ద్వారానే ధర నిర్ణరుుంచి కొనుగోళ్లు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
అంతా వారి ఇష్టారాజ్యమే..
జమ్మికుంట మార్కెట్‌కు ప్రతి రోజు దాదాపు 150 నుంచి 250 వాహనాల వరకు లూజ్ పత్తి వస్తుంది. గతంలో మొదటి వాహనం నుంచి మొదలుకొని చివరి వాహనం వరకు వ్యాపారులతో వేలంపాట నిర్వహించి అడ్తిదారులు అమ్మకాలు సాగించేవారు. దీంతో వ్యాపారుల పోటీ నెలకొని పత్తికి మంచి ధరలు పలికేవి. ఇటీవల అడ్తిదారులు ఈ విధానానికి స్వస్తి పలికారు. గతకొద్ది రోజులుగా మార్కెట్‌లో ఇరవై ముప్పై వాహనాలకే వేలంపాడుతూ మిగతా పత్తికి ఇష్టారాజ్యంగా ధరలు నిర్ణరుుస్తున్నారు. ఇద్దరి మధ్య ఏం జరుగుతుందో కాని సేటు చెప్పిన ధరకు అడ్తిదారు సై అంటూ చిట్టిపై రాసి మిల్లులకు తరలిస్తున్నారు. వేలం పాడిన పత్తికి ఎక్కువ ధర పలుకుతుండగా.. మిగతా పత్తికి తక్కువ ధర చెల్లిస్తూ రైతులను దోచుకుంటున్నారు. మంగళవారం మార్కెట్‌కు 230 వాహనాల్లో లూజ్ పత్తి రాగా... 200 వాహనాలకు వేలం పాటనే లేదు. లూజ్ పత్తికి రూ.5110 వేలంపాటలో గరిష్ట ధర పాడిన వ్యాపారులు నేరుగా కొనుగోళ్లు చేసిన పత్తికి క్వింటాల్‌కు రూ.4750 నుంచి రూ.5000 వేల వరకు చెల్లించినట్లు రైతులు తెలిపారు.
వేలంపాటను కొనసాగించాలి..
మార్కెట్‌కు వాహనాల్లో వచ్చే పత్తికి వేలంపాట ద్వారా ధరలు నిర్ణరుుంచి కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు. వేలం పాట లేక పోవడం వల్ల ధరల్లో భారీగా వ్యత్యాసాలు వస్తూ తాము నష్టపోతున్నామని సైదాపూర్‌కు చెందిన రవీందర్‌రెడ్డి అవేదన వ్యక్తం చేశారు. నేరుగా ధరలు నిర్ణరుుంచడంతో తొందరగా ఇంటికి వెళ్లొచ్చని అనుకుంటే క్వింటాల్ పత్తికి రూ.100 నుంచి రూ.150 వరకు ధరలు తక్కువ వేస్తున్నారని హుజూరాబాద్ మండలం నర్సింగపూర్‌కు చెందిన తిరుపతిరెడ్డి వాపోయాడు. మార్కెట్‌లో ప్రతి వాహనానికి వేలంపాట పెట్టాలని పలువురు రైతులు డిమాండ్ చేశారు. ఉదయం 9.30 గంటలకు వేలంపాట మొదలైన గంట వరకే మార్కెట్‌లో ఒక్క వాహనం లేకపోవడం పరిస్థితికి అద్దం పడుతోందని రైతులు పేర్కొంటున్నారు.