సంగారెడ్డి: అప్పులు చెల్లించకపోతే భూములు జప్తు చేస్తామంటూ మెదక్ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు(డీసీసీబీ) ప్రకటించింది. ఈ మేరకు గ్రామల్లో కరపత్రాలను బ్యాంకు పంపిణీ చేసింది. మొత్తం 2,000 మంది జిల్లాకు చెందిన రైతులు డీసీసీబీ నుంచి లోన్లు తీసుకోగా వీరిలో 800 మందికి చెందిన భూములను జప్తు చేయనున్నట్లు బ్యాంకు తెలిపింది.గడువులోగా అప్పులు చెల్లించని రైతుల భూములను వేలం వేస్తామని కర పత్రాల్లో ప్రచురించింది.
ఏపీసీఎస్ చట్టం సెక్షన్ 70, సబ్-సెక్షన్ 2 ప్రకారం అప్పులు చెల్లించకపోతే ఆస్తులను జప్తు చేసే హక్కు బ్యాంకులకు ఉంది. ఈ మేరకు డీసీసీబీ బ్యాంకు సేల్స్ అధికారి ప్రవీణ పేరుతో గ్రామాల్లో కరపత్రాలు పంపిణీ అయ్యాయి. గతంలో రంగంపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నుంచి రుణ బకాయిలు తీసుకుని చెల్లించని అయిదుగురు రైతుల భూములను ఈ నెల 20న వేలం వేయనున్నారు. ఈ నేపథ్యంలో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
చెల్లించకపోతే వేలం తప్పదు!
Published Thu, May 19 2016 1:07 PM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM
Advertisement
Advertisement