హైదరాబాద్: మంత్రి శ్రీనివాస్ గౌడ్ కేసుపై ప్రజా ప్రతినిధుల కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్నికల అఫిడవిట్ ట్యాంపరింగ్‌కు సంబంధించిన కేసులో శ్రీనివాస్ గౌడ్‌తోపాటు మిగిలిన అధికారులపై కేసు నమోదు చేయకపోవడంపై అసహనం వ్యక్తం చేసింది. ఎన్నికల అఫిడమిట్ ట్యాంపరింగ్ సందర్భంగా మొత్తం పదిమందిపై కేసు నమోదు చేయాలని ఇటీవల ప్రజాప్రతినిధుల కోర్టు తీర్పు ఇచ్చింది. కోర్టు ఆదేశాలు ఇచ్చినా కూడా కేసు నమోదు చేయలేదని రాఘవేందర్ రాజు అఫిడవిట్ దాఖలు చేశారు. దీనిపై ప్రజాప్రతినిధులు కోర్టు నేడు విచారణ జరిగింది.
ఈ అంశంపై కేసు నమోదు చేశారో లేదో ఈ రోజు 4 గంటల లోపు చెప్పాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ కేసు నమోదు చేయని పక్షంలో కోర్టు ధిక్కరణ నేరం కింద పరిగణిస్తామని వాఖ్యానించింది. కేసు నమోదు చేసి ఉంటే ఎఫ్ఐఆర్ కాపీని అందించాలని ఆదేశించింది.
ఇదీ చదవండి: Telangan Floods: 'ఇదేం నివేదిక..?' వరదలపై ప్రభుత్వానికి హైకోర్టు మొట్టికాయలు..
Comments
Please login to add a commentAdd a comment