minister Srinivas
-
మంత్రి శ్రీనివాస్ గౌడ్ కేసుపై ప్రజా ప్రతినిధుల కోర్టు ఆగ్రహం..
హైదరాబాద్: మంత్రి శ్రీనివాస్ గౌడ్ కేసుపై ప్రజా ప్రతినిధుల కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్నికల అఫిడవిట్ ట్యాంపరింగ్‌కు సంబంధించిన కేసులో శ్రీనివాస్ గౌడ్‌తోపాటు మిగిలిన అధికారులపై కేసు నమోదు చేయకపోవడంపై అసహనం వ్యక్తం చేసింది. ఎన్నికల అఫిడమిట్ ట్యాంపరింగ్ సందర్భంగా మొత్తం పదిమందిపై కేసు నమోదు చేయాలని ఇటీవల ప్రజాప్రతినిధుల కోర్టు తీర్పు ఇచ్చింది. కోర్టు ఆదేశాలు ఇచ్చినా కూడా కేసు నమోదు చేయలేదని రాఘవేందర్ రాజు అఫిడవిట్ దాఖలు చేశారు. దీనిపై ప్రజాప్రతినిధులు కోర్టు నేడు విచారణ జరిగింది. ఈ అంశంపై కేసు నమోదు చేశారో లేదో ఈ రోజు 4 గంటల లోపు చెప్పాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ కేసు నమోదు చేయని పక్షంలో కోర్టు ధిక్కరణ నేరం కింద పరిగణిస్తామని వాఖ్యానించింది. కేసు నమోదు చేసి ఉంటే ఎఫ్ఐఆర్ కాపీని అందించాలని ఆదేశించింది. ఇదీ చదవండి: Telangan Floods: 'ఇదేం నివేదిక..?' వరదలపై ప్రభుత్వానికి హైకోర్టు మొట్టికాయలు.. -
బాలీవుడ్లో పాగా వేసిన తెలంగాణ నటుడు పైడి జైరాజ్: మంత్రి
‘‘తెలంగాణ ప్రాంతం నుంచి ముంబయ్ వెళ్లి, బాలీవుడ్ తొలి తరం హీరోల్లో ఒకరిగా నిలిచి ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసిన మహానటుడు పైడి జైరాజ్. ఆయన జీవితం నేటితరాలకు స్ఫూర్తి’’ అని తెలంగాణ పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మంగళవారం దివంగత నటుడు పైడి జైరాజ్ 112వ జయంతి వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి హాజరైన శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ– ‘‘కష్టపడి రియల్ హీరోగా ఎదిగిన జైరాజ్‌లాంటి మహనీయుని గురించి తెలుగు పరిశ్రమలో ఎక్కువగా తెలియకపోవడం ఆశ్చర్యంగా ఉంది. ఫిలింనగర్ ప్రాంతంలో ముఖ్యంగా ఫిలిం ఛాంబర్ పరిధిలో ఆయన విగ్రహం ఏర్పాటు చేయాలి’’ అన్నారు. ‘‘పైడి జైరాజ్‌గారి జయంతి వేడుకలను 2010 నుంచి నిర్వహిస్తున్నాను’’ అన్నారు నటుడు జైహింద్ గౌడ్. -
మంత్రి శ్రీనివాస్‌గౌడ్, అతని సోదరుడు వేధిస్తున్నారు..
సాక్షి, నాంపల్లి(మహబూబ్‌నగర్): రాష్ట్ర మంత్రి శ్రీనివాస్‌గౌడ్, అతని సోదరుడు శ్రీకాంత్ గౌడ్ల నుంచి తమకు ప్రాణహాని ఉందని మహబూబ్‌నగర్‌కు చెందిన విశ్వనాథరావు, పుష్పలత దంపతులు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌లో ఫిర్యాదు చేశారు. 2018 ఎన్నికల సమయంలో ఓ కేసు విషయంలో సాక్షిగా ఉన్న తమను కక్ష కట్టి మంత్రి, అతని సోదరుడు మాపై అక్రమ కేసులు పెట్టి తీవ్ర వేధింపులకు గురిచేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. స్థానిక రూరల్ ఇన్స్పెక్టర్ మహేశ్వర్‌తో అర్థరాత్రి ఇంటిపై దాడులు చేయిస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ఓ ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్న తమ ఇద్దరి ఉద్యోగాలను కూడా మంత్రి తీసి వేయించి తమ కుటుంబాన్ని రోడ్డుపాలు చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. -
చివరి ఆయకట్టునూ రక్షిస్తాం
⇒ ప్రాజెక్టుల్లో 9.10 టీఎంసీల నీరు ⇒ జిల్లాలో రూ. వెయ్యి కోట్ల సాగు ⇒ నీటిని సద్వినియోగం చేసుకోవాలి ⇒ ఆన్ ఆఫ్ పద్ధతిలో నీటి విడుదల ⇒ డిస్ట్రిబ్యూటరీల వద్ద వీఆర్వో, వీఆర్ఏలను కాపలా ఉంచాలి ⇒ వాహనంలో పర్యవేక్షిస్తా ⇒ సమీక్షలో మంత్రి శ్రీనివాస్‌రెడ్డి ఇందూరు (నిజామాబాద్ అర్బన్) : ‘జిల్లాలో దాదాపు రూ. వెయ్యి కోట్ల వరి పంట ఉంది.. ఇది ఆషామాషీ విషయం కాదు.. పంట వేసిన రైతుకు జీవన్మరణ సమస్య... అధికారులు సమష్టి బాధ్యత తీసుకుని చివరి ఆయకట్టు వరకు నీరందించాలి. వేసిన పంటలను కాపాడాలి’ అంటూ వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని ప్రగతిభవన్‌లో నీటి పారుదల అధికారులు, తహసీల్దార్లతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రాజెక్టుల్లో 9.10 టీఎంసీల నీరు అందుబాటులో ఉందన్నారు. నిజాంసాగర్, అలీసాగర్, గుత్ప ప్రాజెక్టుల ఆయకట్టు కింద 2 లక్షల 10 వేల ఎకరాల పంట సాగవుతోందన్నారు. ప్రస్తుతం మూడు విడతలుగా ప్రాజెక్టుల నుంచి నీటిని విడుదల చేయగా, ఇంకా మూడు విడతల నీటిని ప్రాజెక్టుల నుంచి ఆన్అఫ్ పద్ధతిలో విడుదల చేస్తున్నట్లు తెలిపారు. వేసవిలో రబీ పంటలకు విడుదల చేసే నీటిని సక్రమంగా వాడుకోకపోతే నీరంతా వృథా అవుతుందన్నారు. నిజాంసాగర్ ఆయకట్టు కింద 82 డిస్ట్రిబ్యూటరీలు ఉన్నాయని, చివరి ఆయకట్టు వరకు నీరు అందిస్తామన్నారు. జిల్లాలో వివిధ ప్రాజెక్టులకు కలిపి 766 డిస్ట్రిబ్యూటరీలు, 218 సబ్ డిస్ట్రి బ్యూటరీలు ఉన్నాయన్నారు. ప్రతి డిస్ట్రిబ్యూటరీ వద్ద ఒక వీఆర్వో, ప్రతి సబ్ డిస్ట్రిబూట్యరీ వద్ద వీఆర్ఏలను కాపాల ఉంచాలన్నారు. వీరికి షిప్టుల వారిగా డే అండ్ నైట్ డ్యూటీలు వేసే బాధ్యత తహసీల్దార్లపై ఉందన్నారు. ఎవరెవరు డిస్ట్రిబ్యూటరీల వద్ద ఉంటున్నారో వారి పేర్లతో సహా వివరాలు అందించాలని, తాను పది రోజుల పాటు కెనాల్‌పైనే వాహనంలో పర్యవేక్షణ చేస్తానని మంత్రి స్పష్టం చేశారు. మూడు విడతల నీటిలో 850–1000 క్యూసెక్కు నీటిని విడుదల చేస్తామన్నారు. రైతులు నీటిని వృథా చేయడకుండా అవగాహన కల్పిం చాలని అధికారులను ఆదేశించారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో 4.9 టీఎంసీల నీరు నిలువ ఉండగా, అందులోంచి 2.9 టీఎంసీల నీటిని వినియోగించగా, ఇంకా 2 టీఎంసీల నీరు అందుబాటులో ఉందన్నారు. కాలువను బంద్ చేసే సమయంలో ఇరిగేషన్ అధికారులు చివరి ఆయకట్టు వరకు నీరు అందిందో లేదో తెలుసుకున్న తరువాతే బంద్ చేయాలన్నారు. లేదంటే చివరి ఆయకట్టు పంట లకు నష్టం జరుగుతుందన్నారు. సమావేశంలో మిషన్ భగీరథ వైస్ చైర్మన్ ప్రశాంత్ రెడ్డి, జడ్పీ చైర్మన్ దఫేదారు రాజు, నిజామాబాద్, కామారెడ్డి కలెక్టర్లు యోగితా రాణా, సత్య నారాయణ, జేసీ రవీందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, షకీల్, గణేశ్ గుప్తా, జీవన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.