మంత్రి శ్రీనివాస్‌గౌడ్, అతని సోదరుడు వేధిస్తున్నారు.. | Aligation On Telangana Minister Srinivas Goud In Mahabubnagar | Sakshi
Sakshi News home page

మంత్రి శ్రీనివాస్‌గౌడ్, అతని సోదరుడు వేధిస్తున్నారు..

Published Thu, Jul 29 2021 8:44 AM | Last Updated on Thu, Jul 29 2021 8:44 AM

Aligation On Telangana Minister Srinivas Goud In Mahabubnagar - Sakshi

సాక్షి, నాంపల్లి(మహబూబ్‌నగర్‌): రాష్ట్ర మంత్రి శ్రీనివాస్‌గౌడ్, అతని సోదరుడు శ్రీకాంత్‌ గౌడ్‌ల నుంచి తమకు ప్రాణహాని ఉందని మహబూబ్‌నగర్‌కు చెందిన విశ్వనాథరావు, పుష్పలత దంపతులు  రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌లో ఫిర్యాదు చేశారు. 2018 ఎన్నికల సమయంలో ఓ కేసు విషయంలో సాక్షిగా ఉన్న తమను కక్ష కట్టి మంత్రి, అతని సోదరుడు మాపై అక్రమ కేసులు పెట్టి తీవ్ర వేధింపులకు గురిచేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

స్థానిక రూరల్‌ ఇన్‌స్పెక్టర్‌ మహేశ్వర్‌తో అర్థరాత్రి ఇంటిపై దాడులు చేయిస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ఓ ప్రైవేట్‌ సంస్థలో పనిచేస్తున్న తమ ఇద్దరి ఉద్యోగాలను కూడా మంత్రి తీసి వేయించి తమ కుటుంబాన్ని రోడ్డుపాలు చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement