
తెలంగాణ ప్రాంతం నుంచి ముంబయ్ వెళ్లి, బాలీవుడ్ తొలి తరం హీరోల్లో ఒకరిగా నిలిచి ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసిన మహానటుడు పైడి జైరాజ్..
‘‘తెలంగాణ ప్రాంతం నుంచి ముంబయ్ వెళ్లి, బాలీవుడ్ తొలి తరం హీరోల్లో ఒకరిగా నిలిచి ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసిన మహానటుడు పైడి జైరాజ్. ఆయన జీవితం నేటితరాలకు స్ఫూర్తి’’ అని తెలంగాణ పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మంగళవారం దివంగత నటుడు పైడి జైరాజ్ 112వ జయంతి వేడుకలు జరిగాయి.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి హాజరైన శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ– ‘‘కష్టపడి రియల్ హీరోగా ఎదిగిన జైరాజ్‌లాంటి మహనీయుని గురించి తెలుగు పరిశ్రమలో ఎక్కువగా తెలియకపోవడం ఆశ్చర్యంగా ఉంది. ఫిలింనగర్ ప్రాంతంలో ముఖ్యంగా ఫిలిం ఛాంబర్ పరిధిలో ఆయన విగ్రహం ఏర్పాటు చేయాలి’’ అన్నారు. ‘‘పైడి జైరాజ్‌గారి జయంతి వేడుకలను 2010 నుంచి నిర్వహిస్తున్నాను’’ అన్నారు నటుడు జైహింద్ గౌడ్.