శబ్దకాలుష్యంపై హైకోర్టు ఆగ్రహం
ముంబై: నగరంలో నానాటికీ అధికమవుతోన్న శబ్దకాలుష్యాన్ని నివారించేవిషయంలో నిర్లక్ష్య వైఖరి కనబరుస్తున్నారంటూ మహారష్ట్ర ప్రభుత్వంపై బాంబే హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
శబ్ధకాలుష్య నియంత్రణకు గతంలో తాను ఇచ్చిన ఆదేశాలు అమలు కావడంలేదని అసహనం వ్యక్తం చేసిన జస్టిస్ అభయ్ ఓకా.. ఇందుకు సంబంధిచి బాధ్యులైన అధికారులను గుర్తించి జులై 3లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు.