పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్‌లో ఆ దేశ సైన్యంపై నిరసనకారులు తిరగబడ్డారు. పాక్ సైన్యం కొనసాగిస్తున్న అరాచకాలను వ్యతిరేకిస్తూ బలూచిస్తాన్‌లోని ఆందోళనకారులు దాడులకు దిగారు. ప్రావిన్స్‌లోని గ్వాదర్ జిల్లాలో జాతీయవాద బలూచ్ ఉద్యమంలో ఘర్షణలు చోటుచేసుకున్నాయి.
బలూచ్ యక్జేతి సమితికి చెందిన నిరసనకారులు ర్యాలీలో పాక్ భద్రతా దళాలతో ఘర్షణకు దిగారు. ఈ ఘటనలో పాక్ ఆర్మీ జవాన్ ఒకరు మృతి చెందగా, ఓ అధికారితో సహా 16 మంది గాయపడ్డారు. అక్రమంగా నిర్బంధించిన తమ కమిటీ సభ్యులను వెంటనే విడుదల చేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు. తమ సభ్యులను విడుదల చేసే వరకు నిరసన కొనసాగుతుందని కమిటీ నాయకుడు మెహ్రంగ్ బలోచ్ తెలిపారు.
నిరసనకారుల ధైర్యాన్ని ప్రశంసిస్తూ మెహ్రాంగ్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు ‘ఈ రోజు మీరంతా పాకిస్తాన్‌కు మాత్రమే కాకుండా ప్రపంచం అంతటికీ సందేశం ఇచ్చారు. మీ ఆందోళనల ముందు తుపాకులు, అధికారం విలువలేనివని అన్నారు. కాగా పాకిస్తాన్ భద్రతా దళాలు బలూచిస్తాన్ విశ్వవిద్యాలయం ముందు నిరసనకారులపై దాడి చేసి, 12 మంది మహిళలు, 50 మందికి పైగా పురుషులను తమతో పాటు తీసుకుపోయి నిర్బంధించాయి.
Comments
Please login to add a commentAdd a comment