మాధురి తన ఫేస్‌బుక్ ఖాతాలో షేర్ చేసిన ఫొటో
సాక్షి, బెంగళూరు: ముస్లిం యువకుడితో కలిసి దిగిన ఫొటోను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసిందనే కారణంగా ఎస్‌ఎఫ్‌ఐ మహిళా కార్యకర్తను బెదిరించిన ఘటనలో ఆదివారం మంగళూరు పోలీసులు ఓ యువకుడిని అరెస్ట్ చేశారు. దక్షిణ కన్నడ జిల్లాకు చెందిన ఎస్‌ఎఫ్‌ఐ కార్యరకర్త మాధురి.. ముస్లిం మతానికి చెందిన స్నేహితుడితో కలిసి దిగిన సెల్ఫీని తన ఫేస్‌బుక్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఇది గమనించిన బెళ్తంగడి తాలూకా కక్కిరిచి ప్రాంతానికి చెందిన హరీశ్ దేవాడిగ అనే యువకుడు మాధురిని బెదిరిస్తూ ఆమె ఫేస్‌బుక్ ఖాతాలో సందేశాలు పంపాడు. యువతి ఫిర్యాదు మేరకు పాండేశ్వర పోలీసులు యువకుడు హరీశ్‌ను అరెస్ట్ చేశారు. అతడి సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. చట్టప్రకారం నిందితుడిపై చర్య తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
‘ఐ లవ్ ముస్లిమ్స్’ అని వాట్సాప్‌లో మెసేజ్ చేసినందుకు 20 ఏళ్ల అమ్మాయిని వేధించి ఆత్మహత్యకు పాల్పడేలా చేసిన ఘటన చిక్‌మంగుళూరులో ఇటీవల వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. నేపథ్యంలో మాధురి కేసుపై పోలీసులు వెంటనే స్పందించి నిందితుడిని అరెస్ట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment