![WhatsApp chat Triggers Anxiety In Mangaluru Airport - Sakshi](/styles/webp/s3/article_images/2022/08/15/flight.jpg.webp?itok=WR5PAqTV)
సాక్షి, బెంగళూరు: మంగుళూరు విమానాశ్రయంలో ప్రయాణికురాలు మొబైల్ ఫోన్‌లో మాట్లాడడంతో గందరగోళం ఏర్పడి విమానం ఆలస్యమైంది. విమానాన్ని నిలిపివేసి తనిఖీలు చేశారు. మంగుళూరుకు చెందిన ఓ యువతి ఆదివారం మధ్యాహ్నం బెంగళూరుకు వెళ్లే విమానం ఎక్కారు.
ముంబైలో ఉన్న తన స్నేహితుడికి ఫోన్ చేసి మంగుళూరు విమానాశ్రయంలో ఉన్న భద్రత లోపాలను తమాషాగా చెబుతూ ఉంది. దీనిని గమనించిన పక్క సీటులోని ప్రయాణికుడు అనుమానంతో విమాన సిబ్బందికి సమాచారమిచ్చాడు. దీంతో ఆ విమానంలోని ప్రయాణికులను బయటకు పంపించి, విమానంలో తనిఖీలు చేసి అనంతరం ప్రయాణానికి అనుమతించారు.
Comments
Please login to add a commentAdd a comment