'ఇంటి ముందు కాపుకాసి హత్య చేశారు' | RTI Activist Vinayak Baliga hacked to death in Mangaluru | Sakshi
Sakshi News home page

'ఇంటి ముందు కాపుకాసి హత్య చేశారు'

Published Thu, Mar 24 2016 11:06 AM | Last Updated on Sun, Sep 3 2017 8:29 PM

'ఇంటి ముందు కాపుకాసి హత్య చేశారు'

'ఇంటి ముందు కాపుకాసి హత్య చేశారు'

మంగళూరు(కర్ణాటక): సమాచార కార్యకర్త వినాయక బాలిగ(51) హత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. హంతకులను పట్టుకునేందుకు మూడు బృందాలు ఏర్పాటు, కొన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని మంగళూరు పోలీసు కమిషనర్ ఎం. చంద్రశేఖర్ తెలిపారు. మంగళూరులోని పీవీఎస్ కళాకుంజ్ రోడ్డులో సోమవారం వినాయక బాలిగ హత్యకు గురయ్యారు. దుండగులు ఆయనను కత్తులతో నరికి చంపారు.

ఈ నెల 21న ఉదయం 5.30 గంటల ప్రాంతంలో గుడి వెళ్లేందుకు తన ఇంటి నుంచి వినాయక బాలిగ బయలుదేరారని, అదే సమయంలో దుండగులు పదునైన ఆయుధాలతో దాడి చేశారని కమిషనర్ చెప్పారు. ఆయన ఇంటి ముందు కాపుకాసి ఈ కిరాతకానికి పాల్పడ్డారని తెలిపారు. తీవ్రగాయాలపాలైన ఆయనను ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయారని వెల్లడించారు. వినాయక బాలిగ హత్యకు కారణమైన వారిని చట్టం ముందు నిలబెడతామని ప్రకటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement