![Karnataka businessman missing damaged car found near bridge](/styles/webp/s3/article_images/2024/10/6/bmw-car_2.jpg.webp?itok=MSLEA4aZ)
బెంగళూరు: కర్నాటకలో ఓ వ్యాపారవేత్త అదృశ్యం కలకలం రేపుతోంది. ఆ వ్యాపారికి సంబంధించి ప్రమాదానికి గురైన బీఎండబ్ల్యూ కారును మంగళూరులోని ఓ బిడ్జ్ వద్ద ఆదివారం పోలీసులు గుర్తించారు. కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే మొహియుద్దీన్ బావా సోదరుడు వ్యాపారవేత్త ముంతాజ్ అలీ ఆదివారం ఉదయం నుంచి కనిపించకుండా పోయారు. ఆయన కుమార్తె పోలీసులు ఇచ్చిన ఫిర్యాదు ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. రంగంలోకి దిగిన పోలీసులు ఆయన కోసం సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం తెల్లవారుజామున 3 గంటలకు వ్యాపారవేత్త ముంతాజ్ అలీ తన ఇంటి నుంచి బయలుదేరి కారులో మంగళూరు నగరం చుట్టూ తిరిగారు. 5 గంటల సమయంలో మంగళూరులోని కులూరు వంతెన దగ్గర ఆయన కారు ఆపారు. కారులో ప్రమాదానికి సంబంధించిన కొన్ని గుర్తులు ఉన్నాయని తెలిపారు. తన తండ్రి అదృశ్యానికి సంబంధించి ముంతాజ్ అలీ కుమార్తె స్థానిక పోలీసులకు సమాచారం అందించటంతో ఈ విషయం వెలుగులోకి వచ్చిందని మంగళూరు పోలీస్ కమిషనర్ అనుపమ్ అగర్వాల్ వెల్లడించారు.
ముంతాజ్ అలీ కోసం పోలీసులు గాలింపు చర్యలు ప్రారంభించారు. అయితే.. ఆయన వంతెనపై నుంచి దూకి ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నదిలో గాలించడానికి స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, కోస్ట్ గార్డ్‌లను మోహరించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment