
ప్రముఖ జర్నలిస్టు టీవీఆర్ షెనాయ్ (ఫైల్ ఫోటో)
మంగళూరు : ప్రముఖ జర్నలిస్టు టీవీఆర్ షెనాయ్ నిన్న (మంగళవారం) కన్నుముశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళూరులోని మణిపాల్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. కేరళలోని ఎర్నాకుళంలో జనించిన ఆయన ఐదు దశాబ్దాల పాటు పాత్రికేయ రంగంలో విశిష్ట సేవలు అందించారు. జర్నలిజంలో షెనాయ్ సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2003లో ఆయనను పద్మభూషణ్‌తో సత్కరించింది.
షెనాయ్ మృతి పట్ల కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ సంతాపం తెలియజేశారు. వృత్తిలో భాగంగా ఎక్కువ కాలం ఢిల్లీలోనే గడిపిన షెనాయ్ కేరళకు ఢిల్లీలో ప్రతినిధిగా వ్యవహరించారని విజయన్ అన్నారు. కాగా షెనాయ్ కుమార్తె సుజాత యూఎస్‌లో జర్నలిస్టుగా కొనసాగుతున్నారు.