Veteran journalist
-
సీనియర్ జర్నలిస్టు కన్నుమూత : సంతాప సందేశాల వెల్లువ
సాక్షి,న్యూఢిల్లీ: సుప్రసిద్ధ జర్నలిస్ట్, ఎడిటర్, రచయిత అనిల్ ధార్కర్ కన్నుమూశారు. గుండెజబ్బుతో బాధ పడుతున్న ఆయన శుక్రవారం ఉదయం తుది శ్వాస విడిచారు. ధార్కర్ మృతిపై పలువురు జర్నలిస్టు ప్రముఖులు, ఇతర ముఖ్యలు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో ఆర్ఐపీ అనిల్ ధార్కర్ అంటూ సంతాప సందేశాలు వెల్లువెత్తాయి. పత్రికా,సాహిత్య ప్రపంచానికి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ నివాళులర్పిస్తున్నారు. ముంబై ఇంటర్నేషనల్ లిటరేచర్ ఫెస్టివల్ అండ్ లిటరేచర్ లైవ్ వ్యవస్థాపకుడు అనిల్ ధార్కర్. ఐదు దశాబ్దాలకుపైగా సుదీర్ఘ కరియర్లో కాలమిస్ట్‌గా, రచయితగా, ఫిల్మ్ సెన్సార్ బోర్డు సలహా కమిటీ సభ్యుడిగా ఇలా అనేక బాధ్యతల్లో పనిచేశారు. మిడ్-డే, ది ఇండిపెండెంట్‌తో సహా పలు పత్రికలకు ఆయన సంపాదకుడిగా పనిచేశారు. అలాగే దక్షిణ ముంబైలోని ఆకాశవాణి ఆడిటోరియంను ఆర్ట్ మూవీ థియేటర్‌గా రూపుదిద్దడంలో కీలక పాత్ర పోషించారు. ది రొమాన్స్ ఆఫ్ సాల్ట్ రచయిత అయిన ధార్కర్ రచనలు దేశ విదేశాల్లో ప్రాచుర్యం పొందాయి. Sad to hear that Anil Dharker is no more. RIP. https://t.co/8ieBjHds1R — Nirmal Ghosh (@karmanomad) March 26, 2021 RIP Anil Dharker. Your contribution to the world of literature is priceless & unforgettable! Above all, your warm demeanour and tall presence at all literary events will be missed! Will always remember you as the person who made me meet @sachin_rt#RIPAnilDharker@anildharker pic.twitter.com/9XKWP9rQIp — Mangalam Maloo (@blitzkreigm) March 26, 2021 I am extremely saddened to hear about the passing away of a lovely human being, always in his immaculate bespoke churidaar-Kurta :Anil Dharker. The ultimate intellectual liberal who made Tata Literature Live event a global brand and loved books. He loved life. We will miss him. — Sanjay Jha (@JhaSanjay) March 26, 2021 I am extremely saddened to hear about the passing away of a lovely human being, always in his immaculate bespoke churidaar-Kurta :Anil Dharker. The ultimate intellectual liberal who made Tata Literature Live event a global brand and loved books. He loved life. We will miss him. — Sanjay Jha (@JhaSanjay) March 26, 2021 Sad news coming in of @anildharker passing away. Was my editor at Mud-Day & The Independent. Man of delectable prose and varied interests. Sports buff. Compassionate and caring. Freethinker and fiercely democratic. RIP — Cricketwallah (@cricketwallah) March 26, 2021 -
ప్రముఖ జర్నలిస్టు టీవీఆర్ కన్నుమూత
మంగళూరు : ప్రముఖ జర్నలిస్టు టీవీఆర్ షెనాయ్ నిన్న (మంగళవారం) కన్నుముశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళూరులోని మణిపాల్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. కేరళలోని ఎర్నాకుళంలో జనించిన ఆయన ఐదు దశాబ్దాల పాటు పాత్రికేయ రంగంలో విశిష్ట సేవలు అందించారు. జర్నలిజంలో షెనాయ్ సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2003లో ఆయనను పద్మభూషణ్‌తో సత్కరించింది. షెనాయ్ మృతి పట్ల కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ సంతాపం తెలియజేశారు. వృత్తిలో భాగంగా ఎక్కువ కాలం ఢిల్లీలోనే గడిపిన షెనాయ్ కేరళకు ఢిల్లీలో ప్రతినిధిగా వ్యవహరించారని విజయన్ అన్నారు. కాగా షెనాయ్ కుమార్తె సుజాత యూఎస్‌లో జర్నలిస్టుగా కొనసాగుతున్నారు. -
సీనియర్ జర్నలిస్టు కన్నుమూత
పుణే : ప్రముఖ ఎడిటర్, సీనియర్ జర్నలిస్టు దిలీప్ పద్గోంకర్ (72) ఇక లేరు. పుణేలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన శుక్రవారం ఉదయం కన్నుమూశారు. కొంతకాలంలో కిడ్నీ సంబంధ వ్యాధితో బాధపడుతున్న ఆయన తుదిశ్వాస విడిచారు. టైమ్స్ ఆఫ్ ఇండియాకు మాజి ఎడిటర్ గా పనిచేసిన ఆయన తనదైన శైలిలో పాఠకులను ఆకట్టుకున్నారు. 1968లో జర్నలిస్టుగా కరియర్ ప్రారంభించిన దిలీప్ దాదాపు ఆరేళ్లపాటు ఎటిటర్ గా పనిచేశారు. జమ్మూ-కాశ్మీర్ లో శాంతి, సుస్థిరతలు నెల కొల్పే ఉద్దేశంతో కేంద్రం ఏర్పాటు చేసిన మధ్యవర్తులు బృందంలో దిలీప్ పద్గోంకర్ ఒకరు. 2010లో యూపీఏ ప్రభుత్వం నియమించిన కమిటీలో ప్రముఖ విద్యావేత్త రాధాకుమార్, మాజీ కేంద్ర సమాచార కమిషనర్ ఎం.ఎం. అన్సారీ లతోపాటు దిలీప్ పద్గోంకర్ సభ్యులుగా ఉన్నారు. అటు దిలీప్ పద్గోంకర్ మరణంపై పలువురు సీనియర్ జర్నలిస్టులు, రాజకీయవేత్తలు సంతాపం తెలిపారు. My first editor Dileep Padgaonkar, a man of culture and intellect, someone who encouraged young talent, has passed away. RIP — Rajdeep Sardesai (@sardesairajdeep) November 25, 2016 -
ప్రఖ్యాత జర్నలిస్టు మృతి
శ్రీనగర్: కశ్మీర్ కు చెందిన ప్రముఖ జర్నలిస్టు వేద్ భాసిన్ సాహెబ్ (86) గురువారం కన్నుమూశారు. 'గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇంగ్లీషు జర్నలిజం' గా పేరొందిన భాసిన్ గత కొన్ని నెలలుగా బ్రెయిన్ కు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నారు. ఆయన గురువారం రాత్రి తుది శ్వాస విడిచారు. భాసిన్ మరణంపై రాష్ట్రం వ్యాప్తంగా సంతాపం వ్యక్తమవుతోంది. దాదాపు ఆరు దశాబ్దాలపాటు పత్రికారంగానికి ఆయన విశిష్ట సేవలు అందించారు. కశ్మీర్ టైమ్స్ పత్రికకు సుదీర్ఘకాలం ఎడిటర్ గా పనిచేసిన భాసిన్ పాకిస్తాన్, భారత మైత్రికోసం కృషి చేశారు. ఆయన మృతిపై రాష్ట్ర ముఖ్యమంత్రి ఓమర్ అబ్దుల్లా తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. భాసిన్ మరణం అటు ప్రతికా రంగానికి, ఇటు ప్రభుత్వానికి తీరని లోటన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని సీఎం ఆకాంక్షించారు. దేశంలోని అణగారిన వర్గాల ప్రయోజనాలకోసం, ప్రజాస్వామ్య విలువలకోసం రాజీలేని పోరాటం చేశారని పలువురు భాసిన్ కు నివాళులర్పిస్తున్నారు. His passing is a great loss to the state in general & the press fraternity in particular. May Ved Bhasin Sb's soul rest in peace. — Omar Abdullah (@abdullah_omar) November 6, 2015