ప్రఖ్యాత జర్నలిస్టు మృతి
శ్రీనగర్: కశ్మీర్ కు చెందిన ప్రముఖ జర్నలిస్టు వేద్ భాసిన్ సాహెబ్ (86) గురువారం కన్నుమూశారు. 'గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇంగ్లీషు జర్నలిజం' గా పేరొందిన భాసిన్ గత కొన్ని నెలలుగా బ్రెయిన్ కు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నారు. ఆయన గురువారం రాత్రి తుది శ్వాస విడిచారు.
భాసిన్ మరణంపై రాష్ట్రం వ్యాప్తంగా సంతాపం వ్యక్తమవుతోంది. దాదాపు ఆరు దశాబ్దాలపాటు పత్రికారంగానికి ఆయన విశిష్ట సేవలు అందించారు. కశ్మీర్ టైమ్స్ పత్రికకు సుదీర్ఘకాలం ఎడిటర్ గా పనిచేసిన భాసిన్ పాకిస్తాన్, భారత మైత్రికోసం కృషి చేశారు. ఆయన మృతిపై రాష్ట్ర ముఖ్యమంత్రి ఓమర్ అబ్దుల్లా తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. భాసిన్ మరణం అటు ప్రతికా రంగానికి, ఇటు ప్రభుత్వానికి తీరని లోటన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని సీఎం ఆకాంక్షించారు. దేశంలోని అణగారిన వర్గాల ప్రయోజనాలకోసం, ప్రజాస్వామ్య విలువలకోసం రాజీలేని పోరాటం చేశారని పలువురు భాసిన్ కు నివాళులర్పిస్తున్నారు.
His passing is a great loss to the state in general & the press fraternity in particular. May Ved Bhasin Sb's soul rest in peace.
— Omar Abdullah (@abdullah_omar) November 6, 2015