jaggi vasudev
-
సోషల్ ఇన్ ఫ్లుయెన్సర్ కీ రోల్
సాక్షి, హైదరాబాద్ : కొత్త టెక్నాలజీ సర్వత్రా వ్యాప్తి చెందుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ‘సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు’ (social influencers) వివిధ అంశాల్లో కీలక భూమిక పోషిస్తున్నారు. ప్రతిరోజూ ఒక కొత్త ఆవిష్కరణలు, కొత్త వస్తువులు మార్కెట్‌ను ముంచెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో తమ ఉత్పత్తుల విక్రయాలు పెంచుకునేందుకు ఉత్పత్తి, మార్కెటింగ్ సంస్థలు కొత్త కొత్త మార్గాలు అన్వేషిస్తున్నాయి. కొత్త ఉత్పత్తులు కొనుగోలు చేసేలా వినియోగదారుల దృష్టిని ఆకర్షించేందుకు నూతన పంథాను అనుసరిస్తున్నాయి. ప్రస్తుతం సోషల్, డిజిటల్ మీడియా (Digital Media) ఇతర మాధ్యమాల ప్రభావం విపరీతంగా పెరిగిపోయింది. వాట్సాప్, ఫేస్బుక్, ఇన్‌స్ట్రాగామ్, (Instagram) ఎక్స్ (ట్విట్టర్).. ఇలా వివిధ రకాల ప్లాట్‌ఫామ్స్‌పై యువతరంతోపాటు వివిధ వయసుల వారు అధిక సమయమే గడుపుతున్నారు. ఈ నేపథ్యంలో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, వారి కొనుగోలు చేస్తున్న వస్తువులు, వివిధ కంపెనీల వస్తువులకు వారు చేస్తున్న ‘ఎండార్స్మెంట్స్’కు ఎక్కడ లేని ప్రాధాన్యం ఏర్పడింది. కొందరైతే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్నే తమ వృత్తిగానూ ఎంచుకొని ముందుకు సాగుతున్నారు. నేటి ఆధునిక సమాజంలో మారుతున్న ప్రజల అభిరుచులకు అనుగుణంగా...కంపెనీలు కూడా మార్కెటింగ్ వ్యూహాలను మార్చేస్తున్నాయి. గతంలో ఏదైనా ఒక యాడ్ ఏజెన్సీ ద్వారానో, మరో రూపంలోనో తమ ఉత్పత్తులను ప్రచారం చేసి ప్రజల దృష్టిని ఆకర్షించే ప్రయత్నాలు చేసేవి. ఎవరెంత...?మెగా ఇన్ఫ్లుయెన్సర్లు : సోషల్ మీడియా, ఇతర మాధ్యమాల్లో 10 లక్షలు.. ఆపై ఫాలోవర్లు కలిగి ఉన్నవారుమాక్రో ఇన్ఫ్లుయెన్సర్లు : సామాజిక మాధ్యమాల్లో 5 లక్షలు.. ఆపై ఫాలోవర్లు కలిగిన వారుమిడ్టైర్–ఇన్ఫ్లుయెన్సర్లు : 50 వేల నుంచి 5లక్షల దాకా ఫాలోవర్లు ఉన్నవారుమైక్రో ఇన్ఫ్లుయెన్సర్లు : 10 వేల నుంచి 50 వేల వరకు ఫాలోవర్లు కలిగి ఉన్నవారునానో–ఇన్ఫ్లుయెన్సర్లు : 10 వేల వరకు ఫాలోవర్లు కలిగిన వారువేగంగా విస్తరిస్తున్న ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్గతానికి పూర్తి భిన్నంగా ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో ప్రముఖుల ద్వారా వినూత్న పద్ధతుల్లో ప్రచారానికి దిగుతున్నాయి. ప్రజాసంబంధాల వ్యవస్థకు కొత్త భాష్యం చెప్పేలా ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ అనేది వేగంగా విస్తరిస్తోంది. వివిధ బ్రాండ్లకు సంబంధించి టార్గెట్ వినియోగదారులను చేరుకునేందుకు ఇన్ఫ్లుయెన్సర్ల ద్వారా కంపెనీలు తమ ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నాయి. డిజిటల్, సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ, లక్షలాది మంది ఫాలోవర్లు కలిగిన వివిధ రంగాలకు చెందిన సెలబ్రిటీలు, ప్రముఖుల ద్వారా వివిధ కస్టమర్లను చేరుకునే ప్రయత్నాలను ఇప్పుడు తీవ్రతరం చేశాయి. సామాజిక మాధ్యమాల్లో డిజిటల్ పర్సనాలిటీలుగా పేరుగాంచిన వ్యక్తుల ద్వారా వినియోగదారులకు ఆకర్షించడం ద్వారా పబ్లిక్ రిలేషన్స్ క్యాంపెయిన్‌ను ఉధృతం చేస్తున్నాయి. వివిధ ప్రముఖ బ్రాండ్ల వస్తువులను ఈ సెలబ్రిటీలు ప్రచారం చేస్తున్నారనే భావన వారి ఫాలోవర్లలో కలగని విధంగా చాప కింద నీరులా తమ లక్ష్యాన్ని సాధించేస్తున్నాయి. వివిధ రంగాల ప్రముఖులు ఇచ్చే ప్రకటనలు, ఆయా సందర్భాల్లో ఇచ్చే సందేశాల ద్వారా ఆయా వస్తువుల కొనుగోలుకు సంబంధించి ‘బ్రాండ్ మేసేజ్’లను ఇచ్చేస్తున్నారు. ఈ ఇన్ఫ్లుయెన్సర్లు నేరుగా ఆయా ఉత్పత్తులను ఎండార్స్ చేయడం ఒక పద్ధతి కాగా, వాటి ప్రస్తావన లేకుండా ఏదైనా ఒక సామాజిక అంశం, ప్రాధాన్యం సంతరించుకున్న పరిణామం లేదా ఇతర అంశాలపై తమ అభిప్రాయాలను వెలిబుచ్చడం ద్వారా వారు తమ ఫాలోవర్లను ప్రభావితం చేస్తున్నారు. ఇలా ప్రత్యక్ష, పరోక్ష పద్ధతుల్లో ఆయా వస్తువులకు సంబంధించిన ప్రచారం చేయడం ద్వారా...వాటిని కొనుగోలు చేస్తే మంచిదని, ఫలానా వస్తువును సెలబ్రిటీ వాడుతున్నాడు కాబట్టి అది నాణ్యమైనది, మిగతా వాటి కంటే మెరుగైనదనే భావన కస్టమర్లలో ఏర్పడేలా వారి ఉవాచలు, వ్యాఖ్యలు, ప్రకటనలు వంటివి ఉపయోగపడుతున్నాయి. వివిధ రూపాల్లో ప్రచారం, ఆయా వస్తువుల గురించి ప్రస్తావన వంటి ద్వారా ప్రజాభిప్రాయం రూపుదిద్దుకునేలా ఇన్ఫ్లుయెన్సర్లు చేయగలుగుతున్నారు.భారత్‌లోనే ఎక్కువభారత్‌లో మధ్యతరగతి జనాభా అధికంగా ఉండడంతోపాటు ఈ తరగతి ప్రజలు ఎక్కువగా డిజిటలైజేషన్ వైపు మొగ్గు చూపుతుండడంతో ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్‌కు అవకాశాలు గణనీయంగా పెరుగుతున్నాయి. ఇండియన్ రిటైల్ మార్కెట్ అనేది అనేక రెట్లు పెరుగుతుండడంతో పాటు ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలు, పట్టణాలకు వేగంగా విస్తరించింది. ఈ పరిస్థితుల్లో ఆయా ప్రాంతాల్లోని వినియోగదారులను చేరుకునేందుకు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ అనేవి అందివచ్చిన అవకాశాలుగా కలిసొస్తున్నాయి. ఈ కస్టమర్లను చేరుకొని, ఆయా వస్తువులు కొనుగోలు చేసేలా ఆకర్షించేందుకు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లతోపాటు స్థానిక మైక్రో ఇన్ఫ్లుయెన్సర్లు కూడా తమ వంతు పాత్రను చురుగ్గా పోషిస్తున్నారు.వార్తలకు సంబంధించిన సమాచారాన్ని విశ్లేషించే తీరు, అందుకు అనుగుణంగా వీడియో ఫుటేజీ, సోషియో–పొలిటికల్ డేటా విశ్లేషణ వంటి వాటితో ప్రజలకు దగ్గర అయ్యారు. యువతను నేరుగా చేరుకునేలా చేసే వ్యాఖ్యానాలు, ఆయా అంశాలపై విషయ పరిజ్ఞానం ఆకట్టుకుంటోంది. తన పనితీరుతో తన మెయిన్ చానల్‌కు లక్షలాది మంది ఫాలోవర్లతోపాటుపెద్దసంఖ్యలో యూజర్లతో రికార్డు సృష్టించాడు. లోక్‌సభ ఎన్నికల సందర్భంగా 6 నెలల కాలంలోనే 60 లక్షల ఫాలోవర్లు పెరిగారు. రాఠీ వైరల్ వీడియోలను తమిళం, తెలుగు, బెంగాలి, కన్నడ, మరాఠీలోకి కూడా డబ్ చేస్తున్నారు – ధృవ్ రాఠీ (యూట్యూబర్, ఎడ్యుకేటర్)పర్యావరణం, నదులు, మన నేల వంటివాటిపై ప్రజల్లో చైతన్యం పెంచేలా ప్రయత్నిస్తున్నారు. ‘సేవ్ ద సాయిల్’పేరిట ప్రజా ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. ఆయన నిర్వహించే టాక్‌షోలు లక్షలాది మందిని చేరుకుంటున్నాయి. సంస్కృతి పేరిట సంప్రదాయక కళలు, సంగీత రీతులను జనసామాన్యం చెంతకు చేర్చే ప్రయత్నం చేస్తున్నారు. – సద్గురు జగ్గీవాసుదేవ్ (ఇషా హెడ్)ఓ ప్రముఖ జాతీయ న్యూస్‌చానల్‌లో పనిచేసి బయటకు వచ్చిన ఈయనకు లెక్కకు మించి అభిమానులున్నారు. ఆయన నిర్వహిస్తున్న యూట్యూబ్ చానళ్లు బాగా పాపులర్ అయ్యాయి. ప్రస్తుతం వాటికి 11 లక్షల సబ్స్క్రైబర్లు ఉన్నారు. తన చానల్ ద్వారా నిజాలను వెల్లడించడంతోపాటు, అధికారంలో ఉన్న వారి పనితీరుపైనా విమర్శల వర్షం కురిపించడం ఫాలోవర్లను ఆకట్టుకుంటోంది.– రవీశ్‌కుమార్ (జర్నలిస్ట్)తాను నిర్వహిస్తున్న పాడ్కాస్ట్ల ద్వారా ఫాలోవర్లకు, ముఖ్యంగా యువతకు చేరువయ్యారు. రన్వీర్ షో అకా టీఆర్ఎస్ పేరిట నిర్వహించిన షోలకు ఆర్నాల్డ్ షావర్జనిగ్గర్,. ఇస్రో చైర్మన్ డా. సోమ్‌నాథ్, ఆధ్యాత్మిక గురువు గౌర్ గోపాల్‌దాస్, మహారాష్ట్ర మాజీ సీఎం ఏక్నాథ్ షిండే వంటి వారు హాజరయ్యారు. తాను నిర్వహిస్తున్న 9 యూట్యూబ్ చానళ్ల ద్వారా 2.2కోట్ల మందిని చేరుకుంటున్నట్టుగా ఆయనే చెబుతుంటారు. ఇన్ఫ్లుయెన్సర్ సంస్కృతిని బాగా ప్రచారంలోకి తెచ్చేందుకు దోహదపడుతున్నారు. మాంక్ ఎంటర్టైన్మెంట్ కోఫౌండర్‌గా ఓ కొత్త మీడియా కంపెనీని ప్రారంభించి, ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్‌ను కొత్త పుంతలు తొక్కిస్తున్నారు.– రన్వీర్ అల్లాబాడియా అలియాస్ బీఆర్బైసెప్స్ (యూట్యూబర్) భారత్‌లోనే అత్యధికంగా పేరుగాంచిన కమేడియన్లలో ఒకడిగా నిలిచారు. తన హ్యుమర్‌తో కథలు చెప్పే విధానం, కవిత్వంతో కలగలిపి వివిధ అంశాలను వివరించడం, పూర్తి ప్రామాణికంగా వ్యవహరించడం ఆయన్ను అభిమానులకు దగ్గర చేసింది. ఇప్పటిదాకా వెయ్యికి పైగా షోలు చేశారు. లండన్ రాయల్ అల్బర్ట్ హాల్లో షో నిర్వహించిన ఆసియాకు చెందిన కమేడియన్‌గా పేరు సాధించారు. న్యూయార్క్‌లోని మాడిసన్ స్కేర్ గార్డెన్‌లోనూ షో నిర్వహించారు. చాచా విదాయక్ హై హమారే...వెబ్ సిరిస్‌ను అమెజాన్ ప్రైమ్ కోసం రూపొందించారు. – జకీర్‌ఖాన్ (బాద్షా ఆఫ్ కామెడీ) -
ఆధ్యాత్మికత ముసుగులో చిన్నారులపై లైంగిక వేధింపులు
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన ఈషా ఫౌండేషన్ ఆధ్యాత్మికత ముసుగులో చిన్నారులపై లైంగిక వేధింపులకు పాల్పడే వారికి కేంద్రంగా మారిందని ఈషా ఫౌండేషన్ పాఠశాల మాజీ ఉపాధ్యాయురాలు యామిని రాగాని, ఆమె భర్త సత్య ఎన్ రాగాని ఆరోపించారు. తమ కుమారుడిని తమిళనాడు కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్‌కు చెందిన పాఠశాలలో చదివించామని, ఆ సమయంలో అతడిపై తోటి విద్యార్థి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని వెల్లడించారు. ఇటీవల అక్కడి ఈషా హోమ్స్కూల్లోనూ విద్యార్థులపై ఈ తరహా ఉదంతాలు కొనసాగుతున్నాయని చెప్పారు. అలాగే ఈషా యోగా కేంద్రంలో విద్యా కార్య క్రమాల పేరుతో ఈషా సంస్కృతికి చెందిన బాలికలతో అర్ధనగ్నంగా ఆధ్యాత్మిక దీక్షలు చేయిస్తున్నారని ఆరోపించారు. ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు జగ్గీ వాసుదేవ్ (సద్గురు)కు అన్ని విషయాలు తెలిసినా ఎందుకు పట్టించుకోవడం లేదని వారు ప్రశ్నించారు. రాజమండ్రికి చెందిన ఈ దంపతులు కొంతకాలంగా హైదరాబాద్‌లో నివసిస్తున్నారు. గురువారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈషా ఫౌండేషన్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు.ఎన్నో దురాగతాలుయామిని రాగాణి మాట్లాడుతూ.. ఈషా ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పాఠశాలలు ఈషా విద్య, ఈషా సంస్కృతి, ఈషా హెూమ్ స్కూళ్లలో 8 వేల మందికి పైగా విద్యార్థులు విద్యనభ్యసిస్తు న్నట్లు తెలిపారు. ఈషా పాఠశాలలో 8 ఏళ్ల బాలికపై పలుమార్లు అత్యాచారం జరిగిన విషయాన్ని బయటికి రానివ్వలేదన్నారు. అదేవిధంగా 13 ఏళ్ల బాలుడిని 3 సంవత్సరాల పాటు వేధించినట్టు ఆరోపణలు వచ్చాయని, యాజమాన్యం నిర్లక్ష్యంతో 12వ తరగతి విద్యార్థి ఒకరు ఈ ఏడాది జూన్ 21న మృతి చెందాడని చెప్పారు. ఇలా వరుస ఘటనలు చోటు చేసుకోవడం, తమ కుమారుడు సైతం లైంగిక వేధింపులకు గురికావడంతో కలత చెందిన తాము ధైర్యం చేసి మీడియా ముందుకు వచ్చామని వెల్లడించారు.సద్గురుపై ఉన్న భక్తి, విశ్వాసంతో తాము కూడా తమ కుమారుడిని ఈషా పాఠశాలలో చదివించామని వివరించారు. లైంగిక వేధింపుల విషయం యాజమాన్యం దృష్టికి, తద్వారా జగ్గీ వాసుదేవ్ దృష్టికి తీసుకెళ్లినా నిర్లక్ష్యంగా వ్యవహరించారని చెప్పారు. అంతర్గతంగా ఈ పాఠశాలల్లో జరుగుతున్న విషయాలు వెలుగులోకి తెచ్చేందుకు తాను వలంటీర్ టీచర్‌గా ఫౌండేషన్‌లో రెండేళ్లు పనిచేసినట్టు యామిని రాగాని తెలిపారు. విద్యార్థులను బూతులు తిట్టడం, మానసికంగా, శారీరకంగా హింసించడం తాను ప్రత్యక్షంగా చూసి నట్టు చెప్పారు. తమ తప్పులు కప్పిపుచ్చుకునేందుకు హిందుత్వం అనే పదాన్ని వాడుతున్నారని ఆరోపించారు.బాధితులను నిర్వాహకులు బెదిరిస్తున్నారు‘తెల్లవారుజామున యోగా పేరిట బాలికలను సైతం అర్ధనగ్నంగా కూర్చోబెడుతున్నారు. ఈ విషయం గురించి ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు జగ్గీ వాసుదేవ్, మరో ఇద్దరు ముఖ్యుల మధ్య ఈమెయిల్స్ నడిచాయి..’ అని యామిని, సత్య వెల్లడించారు. దీనిపై త్వరలోనే పోలీసులకు ఫిర్యాదు చేస్తామన్నారు. ఇప్పటివరకు ఏడు బాధిత కుటుంబాలు తమ వెంట వచ్చాయని, మిగిలిన బాధితులతో కూడా కలిసి ముందుకు వెళతామన్నారు. అయితే ఫౌండేషన్ నిర్వాహకులు బాధితుల ను బెదిరిస్తున్నారని, స్థానిక పోలీసులను మేనేజ్ చేస్తున్నారని ఆరోపించారు. వీటిపై ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని, జగ్గీ వాసుదేవ్ వ్యవహారాలన్నింటిపైనా సమగ్ర దర్యాప్తు చేయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.మాకు ప్రాణహాని ఉందిఈషా పాఠశాలలో చదువుతున్న తన ఏడేళ్ల కూతురుపై ఆ పాఠశాలలో పీఈటీ రెండేళ్ల పా టు అత్యాచారానికి పాల్పడ్డాడని సదరు బాలిక తల్లి ఫోన్‌కాల్‌లో మీడియాకు తెలిపారు. ‘మేం ఎంతో మనోవేదన అనుభవించాం. ఈషా ఫౌండేషన్‌లో దుర్మార్గాలు బయట పెట్టాలంటే భయంగా ఉంది. మాకు ప్రాణహాని ఉంది. అందుకే నా వివరాలు చెప్పలేకపోతున్నాను. కానీ త్వరలోనే నేను కూడా మీడియా ముందుకు వస్తా..’ అని పేరు, వివరాలు చెప్పడానికి ఇష్టపడని ఆ బాధిత మహిళ వెల్లడించారు. -
కోర్టు ఆదేశాలు.. ఈశా ఫౌండేషన్‌లో పోలీసుల సోదాలు
చెన్నై: ప్రముఖ ఆధ్యాత్మిక గురువు జగ్గీవాసుదేవ్‌కు చెందిన ఈశా ఫౌండేషన్‌పై మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తన సొంత కూతురికి పెళ్లి చేసి సంప్రదాయబద్ధంగా స్థిరపడేలా ఏర్పాటు చేసిన వాసుదేవ్.. యువతులను ప్రాపంచిక వృత్తిని త్యజించమని, తల దువ్వుకుని, తన యోగా కేంద్రాల్లో సన్యాసులుగా జీవించమని ఎందుకు ప్రోత్సహిస్తున్నారని ప్రశ్నించింది.సోమవారం హెబియస్ కార్పస్ పిటిషన్‌పై హైకోర్టు ఎస్ఎం సుబ్రమణ్యం, వి.శివజ్ఞానం ఎదుట విచారణ విచారణకు వచ్చింది. విచారణ జరిగే సమయంలో కీలక కామెంట్స్ చేసింది. ఈశా పౌండేషన్‌కు సంబంధించి సమగ్ర నివేదికను సెప్టెంబర్ 4 (శుక్రవారం) లోపు కోర్టుకు అందించాలని తమిళనాడు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. కేసు పూర్వాపరాలను పరిశీలిస్తే..తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరు జిల్లాలోని తమిళనాడు అగ్రికల్చరల్ యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ ఎస్.కామరాజ్ (69)హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్లో తన ఇద్దరు కుమార్తెల్లో శక్తి సామర్ధ్యాలను తగ్గేలా మందులు ఇచ్చారని, జుత్తు కత్తిరించుకుని తన యోగా కేంద్రాల్లో సన్యాసులుగా జీవించమని ప్రోత్సహించినట్లు ఆరోపించారు. ఈశా ఫౌండేషన్‌లో చేరితన పెద్ద కుమార్తె ..ప్రతిష్టాత్మక యూకే యూనివర్శిటీ నుంచి మెకాట్రానిక్స్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ పూర్తిచేసింది. 2008లో విడాకులకు ముందు అత్యధిక వేతనంతో ఉద్యోగం కూడా చేసింది. వైవాహిక జీవితంలో సమస్యలు రావడంతో ఆమె తన భర్త నుంచి విడిపోయారని, ఆ తర్వాత ఆధ్యాత్మిక బాట పట్టినట్లు కామరాజ్ పిటిషన్లో పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఆమె ఈశా ఫౌండేషన్‌లో యోగా తరగతులకు హాజరుకావడం ప్రారంభించింది. కొంత కాలానికి ఐటీ ఉద్యోగం చేసిన నా చిన్న కుమార్తె సైతం ఈశా ఫౌండేషన్‌లో చేరింది. చివరికి శాశ్వతంగా ఆశ్రమంలోనే నివసించాలని నిర్ణయించుకున్నారు.న్యాయం చేయండిఇప్పుడు ఇంటికి రావడం లేదని, తన కుమార్తెల జీవితాన్ని జగ్గీ వాసుదేవ్ నాశనం చేశారని పిటిషనర్ కామరాజ్ తెలిపారు. కుమార్తెల జీవితం నాశనం అవ్వడంతో తన భార్య అనారోగ్యానికి గురయ్యారని, తనకు న్యాయం చేయాలని కోరారు. తన కుమార్తెలతో పాటు ఎందరో తల్లిదండ్రులకు దూరంగా ఈశా ఫౌండేషన్‌లో చేరి వారి జీవితాల్ని నాశనం చేసుకున్నట్లు చెప్పారు.క్రిమినల్ కేసులు నమోదుఇప్పటికే ఈశా ఫౌండేషన్‌లో పనిచేస్తున్న వైద్యులపై క్రిమినల్ కేసులు నమోదైన విషయాన్ని పిటిషనర్ పిటిషన్లో ప్రస్తావించారు. ఇటీవల అదే సంస్థలో పనిచేస్తున్న ఓ వైద్యుడు ఆదివాసీ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 12 మంది బాలికలను వేధించాడని,ఆయనపై పోక్సో కింద క్రిమినల్ కేసు నమోదయ్యాయని, అందుకు గల ఆధారాల్ని కోర్టుకు అందించారు. హెబియస్ కార్పస్ పిటిషన్‌పై విచారణరిటైర్డ్ ప్రొఫెసర్ ఎస్ కామరాజ్ దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్‌పై ప్రతిస్పందనగా విచారణ మొదలైంది. తన ఇద్దరు కుమార్తెలను కేంద్రంలో వారి ఇష్టానికి వ్యతిరేకంగా ఉంచారని కామరాజ్ పేర్కొన్నారు. ఇషా ఫౌండేషన్ వ్యక్తుల బ్రెయిన్‌వాష్ చేసి, వారిని సన్యాసులుగా మారుస్తోందని, వారి కుటుంబాలతో సంబంధాలు కొనసాగించకుండా అడ్డుకుంటున్నదని కామరాజ్ ఆరోపించారు.ప్రతి స్పందనగా ఇషా ఫౌండేషన్ తరపు న్యాయవాది కె.రాజేంద్ర కుమార్, ఫౌండేషన్‌ను సమర్థించారు. ఆధ్యాత్మిక మార్గాన్ని స్వీకరించడంతోపాటు వారి జీవితాల గురించి వారి సొంత ఎంపికలు చేసుకునే హక్కు పెద్దలకు ఉందని నొక్కి చెప్పారు. ఈశా ఫౌండేషన్‌లోకి అక్రమంగా ప్రవేశించేందుకు కామరాజ్ ప్రయత్నించారని, తమ సంస్థపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని వాదించారు. ఇరు పక్షాల వాదనలు హైకోర్టు ఎస్ఎం సుబ్రమణ్యం,వి.శివజ్ఞానం న్యాయమూర్తులు ఈశా ఫౌండేషన్‌లోని పద్ధతులపై ప్రశ్నలను లేవనెత్తారు. జగ్గీ వాసుదేవ్ తన కుమార్తెకు వివాహం చేసి స్థిరపడేలా చేశారని, కానీ యువతులను సన్యాసులుగా జీవించమని ఎందుకు ప్రోత్సహించారని ప్రశ్నించారు. కోర్టు ఆదేశాలు.. ఈశా ఫౌండేషన్‌లో సోదాలుఅనంతరం, జగ్గీ వాసుదేవ్‌కు చెందిన ఈశా ఫౌండేషన్‌పై నమోదైన అన్ని క్రిమినల్ కేసుల వివరాలను సమర్పించాలని తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది. కేసు విచారణను అక్టోబర్ 4వ తేదీకి వాయిదా వేసింది కోర్టు.మద్రాస్ హైకోర్టు ఆదేశాలతో కోయంబత్తూర్ రూరల్ డిస్ట్రిక్ అసిస్టెంట్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కే. కార్తికేయన్ నేతృత్వంలో ముగ్గురు డిప్యూటీ సూపరింటెండెంట్లు, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ, చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్, జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ అధికారులు 150 మంది పోలీసు అధికారుల బృందం కోయంబత్తూరులోని తొండముత్తూర్లోని మంగళవారం వెల్లియంగిరి పాదాల వద్ద ఉన్న ఈశా ఫౌండేషన్ ఆశ్రమంలో విచారణ చేపట్టారు.ఈ సోదాలపై ఈశా యోగా సెంటర్ ప్రతినిధులు అధికారికంగా స్పందించారు. ‘కోర్టు ఆదేశాల మేరకు..ఎస్పీలు ఇషా యోగా సెంటర్లో సాదారణంగా తనిఖీలు నిర్వహించారు. యోగా సెంటర్లో ఉండే వారిని, వాలంటీర్లను వారి జీవన విధానం ఎలా ఉంటుంది? ఎక్కడ నుంచి వచ్చారు? ఇక్కడ ఎలా ఉంటున్నారు?’ అని ప్రశ్నలు వేసినట్లు చెప్పారు. -
బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదు: సద్గురు
సాక్షి, చెన్నై: పలుమార్లు తనకు బెదిరింపులు వచ్చాయని, అయితే వాటికి తాను భయపడే ప్రసక్తే లేదని ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు జగ్గీ వాసుదేవ్ ఓ ఆంగ్ల మీడియాతో మాట్లాడుతూ పేర్కొన్నారు. మంగళూరు కుక్కర్ బాంబు పేలుడు కేసు నిందితుడు సారిక్ తన మొబైల్ డీపీగా ఈషా యోగా కేంద్రంలోని ఆది యోగి విగ్రహం ఫొటోను కలిగి ఉన్నట్లు బయటపడిన విషయం తెలిసిందే. ఇతడు ఈషాయోగా కేంద్రాన్ని సందర్శించి రెక్కీ నిర్వహించినట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై ఓవైపు మంగళూరు పోలీసులు, మరోవైపు తమిళ పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. కోయంబత్తూరు, మదురై, కన్యాకుమారి జిల్లా నాగర్ కోయిల్ కేంద్రంగా ఈ విచారణ జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో ఆంగ్ల మీడియాతో జగ్గీ వాసుదేవ్ మాట్లాడారు. వాట్సాప్ డీపీగా సారిక్ ఆదియోగి విగ్రహాన్ని భక్తితో పెట్టుకున్నాడో లేదా.. తన మతాన్ని దాచిపెట్టే ప్రయత్నం చేశాడో స్పష్టంగా తెలియ లేదన్నారు. బెదిరింపులు తనకు కొత్త కాదని, ప్రాణానికి హాని కల్గిస్తామనే బెదిరింపులు ఎన్నోసార్లు వచ్చాయన్నారు. అయినా తాను ఇంకా జీవించే ఉన్నానని చమత్కరించారు. చదవండి: జయలలితకు సరైన చికిత్స అందలేదు.. ఆర్ముగ స్వామి సంచలన వ్యాఖ్యలు -
లండన్ నుంచి కావేరి వరకూ 30 వేల కిలోమీటర్ల బైక్‌యాత్ర
‘మట్టిని రక్షించు’ ఉద్యమంలో ప్రపంచవ్యాప్తంగా 27 దేశాలు తిరిగాను. మన దేశంలో గుజరాత్ నుంచి ఏపీ వరకూ వచ్చాను. తొమ్మిది దేశాలు, ఆరు రాష్ట్రాలతో ఒప్పందాలు చేసుకున్నాం. ఏపీ ప్రభుత్వం మట్టి రక్షణకు కట్టుబడి ఉంది. సీఎం వైఎస్ జగన్ దీనిపై స్పష్టమైన వైఖరితో ఉన్నారు. దావోస్‌లో నేను ఆయనతో చర్చించాను. ఆయన పూర్తి సహకారం అందిస్తామన్నారు. ప్రభుత్వంతో కలిసి ఏపీలో మట్టిరక్షణకు ముందడుగు వేస్తున్నాం. దీనికి అవసరమైన నిధులను వెచ్చించడానికి సిద్ధం’.. అని సద్గురు జగ్గీ వాసుదేవ్ అన్నారు. ‘మట్టిని రక్షించు’ ఉద్యమంలో భాగంగా లండన్ నుంచి కావేరి ప్రాంతం వరకూ 30 వేల కిలోమీటర్లు బైక్‌యాత్రను చేస్తున్న సద్గురు కర్నూలుకు విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన ‘సాక్షి’కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ వివరాలు.. – సాక్షి ప్రతినిధి, కర్నూలు సాక్షి : ‘సేవ్ సాయిల్’ యాత్రకు ఎలాంటి స్పందన వస్తోంది? సద్గురు : ఇప్పటిదాకా ప్రతీ దేశం నుండి అద్భుత స్పందన వస్తోంది. నాలుగు నెలల కిందట వరకూ మట్టిపై ప్రస్తావనే లేదు. కానీ, ఇప్పుడు ప్రతీచోట ‘సాయిల్’ అనే పదం ప్రతిధ్వనిస్తోంది. తొమ్మిది దేశాలు మట్టిని రక్షించే ఉద్యమంలో అవగాహన ఒప్పందాలు చేశాయి. ఇప్పటికే 74 దేశాలు మట్టిని రక్షించేందుకు కట్టుబడి ఉంటామన్నారు. సాక్షి : ఏపీ ప్రభుత్వానికి ఎలాంటి సహకారం అందించబోతున్నారు? ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారాన్ని ఆశిస్తున్నారు? సద్గురు : ఒక ఉన్నతస్థాయి కమిటీని నియమించాం. ఇప్పటికే మా ప్రధాన సలహాదారు మాజీ యూఎన్ఈపీ డైరెక్టర్ ఎరిక్సోల్హైమ్ ఏపీ ప్రభుత్వంతో చర్చలు జరిపారు. సీఎంతో నేను మాట్లాడాను. ఆయన సుముఖంగా ఉన్నారు. ఏపీ ప్రభుత్వం ప్రకృతి వ్యవసాయానికి చాలా చర్యలు తీసుకోవడం మంచి విషయం. ఇది మరింత వేగంగా జరిగేందుకు ప్రోత్సాహకాలు అందించాలి. సాక్షి : ఏపీలో మాదిరిగా వ్యవసాయాభివృద్ధికి ప్రత్యేక చర్యలపై దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వాలను చైతన్యంచేస్తే బాగుంటుంది కదా? సద్గురు : ఏపీ ప్రభుత్వం చర్యలను తెలుసుకున్నా. సీఎం వైఎస్ జగన్‌తో దావోస్‌లో భేటీ అయ్యా. ఈషా ఫౌండేషన్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. సాధారణ వ్యవసాయ భూముల్లో సేంద్రియ పదార్థం కనీసం 3–6శాతం మధ్య ఉండాలి. ప్రపంచంలోని చాలా ప్రాంతాల్లో అది 1 శాతం కంటే తక్కువగా ఉంది. కచ్చితంగా 3–6 శాతం ఉండేలా ప్రభుత్వ పాలసీలలో పొందుపరచాలి. సాక్షి : భావితరాలకు వ్యవసాయంపై ఆసక్తిలేదు. వ్యవసాయ భూములను విక్రయించి ఇతర ఉపాధి మార్గాలు అన్వేషిస్తున్నారు. దీంతో వ్యవసాయ భూమి ‘రియల్ ఎస్టేట్’ ఉచ్చులో విలవిలలాడిపోతోంది? పరిష్కారం ఏంటంటారు? సద్గురు : మనం వ్యవసాయాన్ని లాభసాటిగా చేసి తీరాలి. అందుకు ప్రోత్సాహకాలు అందించాలి. లేకపోతే తీవ్ర ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటాం. ప్రోత్సాహకాలతో రాబోయే 6–8 ఏళ్లలో మట్టిలో కనీసం 3 శాతం సేంద్రియ పదార్థం పెంపొందే దిశగా మనం అడుగులు వేయొచ్చు. సాక్షి : మీ 30వేల కిలోమీటర్ల ప్రయాణంలో మట్టిని రక్షించే చర్యలు ఏ దేశంలో సంతృప్తికరంగా ఉన్నాయి? మన దేశంలో ఏ రాష్ట్రంలో పరిస్థితి? సద్గురు : 2015లో ఫ్రాన్సు ‘4 ఫర్ 1000’ అనే కార్యాన్ని నిర్వహించింది. ఇది ‘మట్టిని రక్షించు’ పాలసీలా ఉంది. కానీ, వాళ్లు మట్టిని ఇతర సమస్యలతో ముడిపెట్టారు. దాంతో ఏడేళ్లు గడిచినా వారు దాన్ని అమలుచేయలేకపోయారు. (క్లిక్: మట్టి ప్రమాదంలో పడింది.. కాపాడుదాం!) సాక్షి : ‘సేవ్ సాయిల్’ ఉద్యమం భవిష్యత్‌లో ఎలా ఉండబోతోంది? సద్గురు : ఈ ఉద్యమం ప్రజలు స్పందించడం కోసమే. మేం 25–30 శాస్త్రవేత్తల బృందాన్ని ఏర్పాటుచేస్తున్నాం. వీరు మట్టి పునరుద్ధరణపై సహకారం అందిస్తారు. సాక్షి : ఈ ఉద్యమంలో ప్రభుత్వాలు, ప్రజల బాధ్యత ఏంటి? సద్గురు : మట్టి అనేది భూమి మీది జీవనానికి ఆయువుపట్టు. దురదృష్టవశాత్తు అదిప్పుడు చేజారిపోతోంది. అందరూ మట్టిపై మాట్లాడాలి. స్వచ్ఛమైన నీటికి, స్వచ్ఛమైన గాలికి, మన జీవితాలకి ఆధారం ఆ మట్టే! మట్టి నాణ్యతను సంరక్షించడమే మన పిల్లలకు మనం అందించే గొప్ప వారసత్వం. (క్లిక్: కర్నూలులో జగ్గీ వాసుదేవ్.. ఫొటోగ్యాలరీ) -
Save Soil: మట్టి ప్రమాదంలో పడింది.. కాపాడుదాం!
మనిషి ఆకాశానికి నిచ్చెనలు వేశాడు. చంద్రమండలం మీద అడుగుపెట్టాడు. గ్రహాలన్నింటినీ అధ్యయనం చేస్తున్నాడు. ఆ గ్రహాల మీద నీరు... మట్టి కోసం అన్వేషిస్తున్నాడు. ప్రాణికోణి నివసించే అవకాశం ఉందా అని పరిశోధిస్తున్నాడు. భూమికి ఆవల ఏముందో తెలుసుకునే ప్రయత్నమిది. అయితే... భూమి ఏమవుతుందోననే స్పృహను కోల్పోతున్నాడు. మన కాళ్ల కింద నేల ఉంది... ఆ నేల మట్టితో నిండినది. ఆ మట్టిని కాపాడుకున్నప్పుడే మనకు మనుగడ. ‘మట్టి ప్రమాదంలో పడింది... మట్టి ఆరోగ్యాన్ని కాపాడుదాం’... ... అని నినదిస్తున్నారు సేవ్ సాయిల్ యాక్టివిస్ట్ ప్రొఫెసర్ జయలేఖ. కేరళలో పుట్టి తెలుగు నేల మీద పెరిగిన ప్రొఫెసర్ జయలేఖ కెరీర్ అంతా హైదరాబాద్‌తోనే ముడివడింది. తండ్రి రైల్వే ఉద్యోగి కావడంతో ఆమె బాల్యం సికింద్రాబాద్‌లో గడిచింది. హైదరాబాద్ లోని రాజేంద్రనగర్‌లోని కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ లో జెనెటిక్స్ అండ్ ప్లాంట్ బ్రీడింగ్ కోర్సు చేశారు. తొలి ఉద్యోగం ఇక్రిశాట్లో. ఆ తర్వాత బేయర్ మల్టీనేషనల్ కంపెనీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విభాగంలో పనిచేశారామె. పెర్ల్ మిల్లెట్ బ్రీడర్‌గా రిటైర్ అయిన తర్వాత ఆమె పూర్తి స్థాయి సామాజిక కార్యకర్తగా సేవలందిస్తున్నారు. ఆమె చదువు, ఉద్యోగం, అభిరుచి, అభిలాష అంతా నేలతో మమైకమై ఉండడంతో ఆమె ఉద్యమం కూడా నేలతో ముడివడి సాగుతోంది. మట్టికోసం సాగుతున్న ‘సేవ్ సాయిల్ గ్లోబల్ మూవ్మెంట్’లో చురుకైన కార్యకర్త జయలేఖ. ఆమె సాక్షితో మాట్లాడుతూ... ‘నేలను కాపాడుకోవాల్సిన సమయం ఆసన్నమైంద’న్నారు. ‘ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఆఫ్ ద యునైటెడ్ నేషన్స్’ ప్రపంచాన్ని నిద్రలేపుతోంది. మట్టి ప్రమాదంలో పడిందని హెచ్చరిస్తోంది. వ్యవసాయ నేలల్లో 52 శాతం నిస్సారమైపోయాయని గణాంకాలు చెప్పింది. ఇప్పుడు కూడా మేల్కొనకపోతే 2050 నాటికి 90 శాతం నేల నిస్సారమవుతుందని, ప్రపంచం ఆకలి కేకలకు దగ్గరవుతుందని ‘యూఎన్‌సీసీడీ’ ఆందోళన చెందుతోంది. ఇప్పటికే వ్యవసాయ ఉత్పత్తులు 30 శాతం పడిపోయాయి. ఇప్పుడు కూడా ఉద్యమించకపోతే... నిర్లిప్తంగా ఉండిపోతే... ఇది నా సమస్య కాదు... ఇందులో నేను చేయాల్సింది ఏమీ లేదు... అని నిమ్మకు నీరెత్తినట్లు ఉంటే... వందేళ్లు మూల్యం చెల్లించాల్సి వస్తోందని కూడా చెప్తోంది. సేవ్ సాయిల్ సామాజికోద్యమం అలా పుట్టిందే’ అని వివరించారు జయలేఖ. చైతన్య యాత్ర పిచ్చుక అంతర్థానమైన తర్వాత పర్యావరణం గురించి ఆలోచించాం. కానీ మట్టి విషయంలో చేతులు కాలిన తర్వాత చేయగలిగిందేమీ ఉండదు. అందుకే ముందుగానే అప్రమత్తం కావాలి. మట్టి ప్రమాదంలో పడిందని ఇప్పటి వరకు తెలిసింది మేధావులకు మాత్రమే. ఈ వాస్తవం సామాన్యుడికి కూడా తెలియాలి. సామాన్యుల్లో చైతన్యం రావాలి. అందుకే ‘మట్టిని రక్షించు’ అని యాత్ర మొదలైంది. కాన్షియస్ ప్లానెట్ చొరవతో మొదలైన సేవ్ సాయిల్ థీమ్ ఇది. ఈశా ఫౌండేషన్, సద్గురు జగ్గీవాసుదేవ్ చేపట్టిన వంద రోజుల బైక్ యాత్ర మార్చి 21న లండన్‌లో మొదలైంది. మే నెల 29 నాటికి మనదేశంలోకి వచ్చిన సేవ్ సాయిల్ యాత్ర... ఐదు రాష్ట్రాలను చుట్టి ‘మట్టిని రక్షించు’ నినాదంతో ఈరోజు హైదరాబాద్‌కు చేరనుంది. ప్రజల్లో అవగాహన కల్పిస్తే ప్రభుత్వాల మీద ఒత్తిడి వస్తుంది. అప్పుడే ప్రభుత్వాలు తమ దేశంలో వాతావరణానికి, నేలతీరుకు అనుగుణంగా పాలసీలను రూపొందించడానికి ముందుకు వస్తాయి. అప్పుడే ఈ బృహత్తర కార్యక్రమం సఫలమవుతుంది. ఆ ఫలితం కోసమే మా ప్రయత్నం’’ అన్నారు జయలేఖ. – వాకా మంజులారెడ్డి మట్టికి ఆక్సిజన్ అందాలి మట్టి చచ్చిపోతోంది... చెట్టు ఎండిపోతోంది. మనిషి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడాల్సిన స్థితి. మట్టి సారం కోల్పోతే సంభవించే పరిణామాలు ఎంత తీవ్రంగా ఉంటాయంటే... ఆహార కొరత, నీటి కొరత, జీవ వైవిధ్యత నశించడం, వాతావరణంలో పెనుమార్పులు, జీవన భద్రత కోల్పోవడం, పొట్ట చేత పట్టుకుని వలసలు పోవడం వంటివన్నీ భవిష్యత్తు మానవుడికి సవాళ్లవుతాయి. ఎంత తెలుసుకున్నప్పటికీ చేయగలిగిందేమిటనే ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది. జీవం కోల్పోతున్న మట్టికి జవజీవాలనందివ్వాలి. వ్యవసాయ నేలలో ఏటా తప్పనిసరిగా యానిమల్ వేస్ట్, ప్లాంట్ డెబ్రిస్ ఇంకిపోవాలి. నేలను బీడు పెట్టకూడదు. చెట్టు పచ్చగా ఉంటే నేల చల్లగా ఉంటుంది. నేల సారవంతంగా ఉంటే చెట్టు ఏపుగా పెరుగుతుంది. ఈ రెండూ గాడిలో ఉన్నప్పుడే మనిషి విశ్వాన్ని జయించగలిగేది. (క్లిక్: మీరూ మీ ఇల్లూ వానలకు రెడీయేనా?) మట్టికి ఏమైంది? మట్టిలో ఉండాల్సిన మైక్రో ఆర్గానిజమ్స్ నశించిపోతున్నాయి. అంటే మట్టిలో ఉండాల్సిన జీవం నిర్జీవం అవుతోంది. దాంతో మట్టిలోని సారం నిస్సారమవుంది. ఈ ఉపద్రవంలో కూడా అగ్రరాజ్యం అమెరికా పాత్ర తొలిస్థానంలో ఉంది. ప్రమాదం ఎంత తీవ్రస్థాయిలో ఉందనేది మనకు తెలియడం లేదు. కానీ ఇది భూగోళానికి మొదటి ప్రమాద హెచ్చరిక వంటిది. నేలలో సేంద్రియ పదార్థాల స్థాయి మూడు నుంచి ఆరుశాతం ఉండాలి. అలాంటిది యూరోపియన్ దేశాల్లో రెండు శాతానికి పడిపోయింది. మన దేశంలో అయితే 0.5 శాతమే ఉంది. ఆఫ్రికాదేశాల్లో మరీ అధ్వాన్నంగా 0.3 శాతం ఉంది. ఇలాంటి గణాంకాలు, నివేదికలు తెలిసిన వెంటనే ఇందుకు రసాయన ఎరువుల వాడకమే కారణం అంటూ... రైతును నిందిస్తుంటారు. అది పూర్తిగా తప్పు. వరదల కారణంగా భూమి కోతకు గురికావడం, అవగాహన లేక పంటలను మార్చకుండా ఒకే పంటను మళ్లీ మళ్లీ వేయడం... భూమిని బీడుగా వదిలేయడం వంటి అనేక కారణాల్లో రసాయన ఎరువులు ఒక కారణం మాత్రమే. అలాగే ఊరికి ఒకరో ఇద్దరో రైతులు ముందడుగు వేస్తే సరిపోదు. ప్రభుత్వాలు ముందుకు వచ్చి పాలసీలు రూపొందించాలి. – ప్రొఫెసర్ ఎ.కె. జయలేఖ, పర్యావరణ పరిరక్షణ ఉద్యమకారిణి, savesoil.org -
సీఏఏపై బీజేపీ ప్రచారం
న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టాని(సీఏఏ)కి మద్దతు కూడగట్టేందుకు బీజేపీ సోమవారం సోషల్ మీడియా వేదికగా ‘ఇండియా సపోర్ట్ సీఏఏ’పేరుతో సరికొత్త ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా ఆ«ధ్యాత్మిక గురువు జగ్గీ వాసుదేవ్ సీఏఏకు అనుకూలంగా మాట్లాడిన వీడియో క్లిప్పింగ్‌ను ప్రధాని మోదీ పోస్ట్ చేశారు. శరణార్థులకు పౌరసత్వం ఇవ్వడం కోసమే సీఏఏ తప్ప ఎవరి పౌరసత్వాన్నీ తొలగించేది కాదంటూ మోదీ వ్యక్తిగత ట్విట్టర్ ఖాతాలో ట్వీట్‌చేశారు. ‘ఇండియా సపోర్ట్ సీఏఏ’హ్యాష్‌ట్యాగ్ తో ఈ మెసేజ్‌ను పోస్ట్ చేశారు. అలాగే, సీఏఏ అనుకూల ప్రజాస్పందనను ప్రతిబింబించే వివిధ అంశాలనూ, వీడియోలనూ, గ్రాఫిక్స్‌నూ ప్రధానమంత్రి నమో యాప్‌లో పెట్టాలని ప్రజలను కోరారు. సీఏఏ భారత పౌరులకు ఎలాంటి నష్టం చేకూర్చదని, మతపర వివక్ష ఈ చట్టంలో లేదని, అందుకే సమర్థిస్తున్నామంటూ బీజేపీ ఉపాధ్యక్షుడు వై జయంత్ జే పాండా ట్వీట్ చేశారు. -
‘పరుల సేవలో తరించడమే ఈశ్వర తత్వం’
చెన్నై : అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన ఈషా యోగా కేంద్రంలో నిర్వహించిన మహా శివరాత్రి వేడుకలకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సోమవారం సాయంత్రం కోయంబత్తూరులోని ఈషా యోగా కేంద్రానికి విచ్చేసిన కోవింద్.. ఆదియోగి విగ్రహం వద్ద ‘ఆదియోగి దివ్య దర్శనం’ పేరిట ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సౌండ్-లైట్ షోను ప్రారంభించారు. దీంతో వెల్లంగిరి కొండలు ఆధ్యాత్మిక శోభతో వెలిగిపోయాయి. అనంతరం ‘జ్ఞానం - ధ్యానం - ఆనందం’ పేరిట నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు కోవింద్. తర్వాత ధ్యాన లింగం, లింగ భైరవి దేవిలను దర్శించుకున్నారు. అనంతరం భక్తులను ఉద్దేశించి ప్రసంగించారు కోవింద్. ‘పరుల సేవలో తరించే జీవితమే అత్యుత్తమ జీవితం. ఇదే ఆ పరమేశ్వరుని సందేశం. మనిషి ముక్తి సాధించడానికి 112 మార్గాలున్నాయి. దాన్ని సూచిస్తూ నెలకొల్పిన ఈ 112 అడుగుల ఆదియోగి విగ్రహం ఏదుట ఈ రోజు మీ అందరిని కలవడం చాలా సంతోషంగా ఉందన్నా’రు. అంతేకాక యువత యోగా పట్ల ఆకర్షితులవ్వడం చాలా సంతోషకరమైన పరిణామంగా చెప్పుకొచ్చారు. ఈశా ఫౌండేషన్ 1994 మార్చి నుంచి ప్రత్యేకంగా మహాశివరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తోంది. ఈ ఏడాదితో 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ ఏడాది మరింత ఘనంగా శివరాత్రి వేడుకలును నిర్వహించారు. సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు స్టార్లు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. అమిత్ త్రివేది, హరిహరన్, కార్తీక్ తదితరులు సంగీత కార్యక్రమాలను నిర్వహించారు. జాగరణ సందర్భంగా రాత్రంతా సంగీతం, ఫోక్ ఆర్ట్, ధ్యానం, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ వేడుకలకు దేశవిదేశాలకు చెందిన భక్తులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. -
శివరాత్రి వేడుకలు.. కాజల్ డ్యాన్స్ వీడియో వైరల్
చెన్నై : ప్రముఖ ఆధ్యాత్మిక గురువు సద్గుగురు జగ్గీ వాసుదేవ్ శివరాత్రి పర్వదినం సందర్భంగా కోయింబత్తూరులోని ఈషా యోగా సెంటర్లో సోమవారం రాత్రి ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వేడుకలకు సౌత్ ఇండస్ట్రీ టాప్ హీరోయిన్లు కాజల్ అగర్వాల్, తమన్నా, అదితిరావు హైదరిలతో పాటు రానా కూడా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో వాసుదేవ్ మహాశివరాత్రి విశిష్టత గురించి ప్రసంగించారు. అనంతరం శివరాత్రి జాగరణలో భాగంగా రాత్రంతా ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ వేడుకల్లో కాజల్, ఆమె సోదరి నిషా అగర్వాల్, తమన్నా, వాసుదేవ్ కలిసి డ్యాన్స్ చేశారు. వారంతా డ్యాన్స్ చేస్తున్న వీడియోను కాజల్ అభిమానులు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం ఇది తెగ వైరల్ అవుతోంది. ప్రముఖ గాయకుడు కార్తిక్ తన పాటలతో ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. కార్యక్రమానికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కూడా హాజరయ్యారు. కొద్దిసేపు వాసుదేవ్‌తో మాట్లాడి ఆయన వెళ్లిపోయారు. View this post on Instagram 😍😍😍😃😃 #KajalAggarwal #Kajal #Kajalism #ishafoundation #Sadhguru A post shared by MEGAANGELKAJAL (@megaangelkajal) on Mar 4, 2019 at 10:12am PST -
సమానత్వం, రక్షణతోనే కులరహిత సమాజం
సాక్షి, హైదరాబాద్: దేశంలో ఆర్థిక సమానత్వం, సామాజిక రక్షణ సాకారమైనప్పుడే కులవ్యవస్థ రూపుమాసిపోతుందని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జగ్గీవాసుదేవ్ అన్నారు. దేశంలోని యువత శక్తిమంతానికి ఈశా ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన యూత్ అండ్ ట్రూత్ (యువతా సత్యాన్ని తెలుసుకో) కార్యక్రమం గురించి వివరించేందుకు ఆయన ఆదివారం హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. ‘‘దేశంలోని పలు ప్రతిష్టాత్మక ఐఐటీ, ఐఐఎం కాలేజీలు, విశ్వవిద్యాలయాల్లో, మరోవైపు ఆన్లైన్లో ఇప్పటికే ఈ ప్రచారం ప్రారంభమైంది. మనదేశంలో 90 శాతంమంది యువత సరైన మార్గనిర్దేశనం, ప్రోత్సాహం లేక లక్ష్యం వైపు వెళ్లలేకపోతున్నారు. ఇలాంటి వారి సందేహాలు నివృత్తి చేసి, సంకల్పబలం నింపి వారి ని లక్ష్యానికి చేరువ చేసే కార్యక్రమాన్ని చేపట్టాం’అని జగ్గీ వివరించారు. కుటుంబంలో పర్యవేక్షణ కొరవడటం వల్లే కుటుంబంలో సరైన పర్యవేక్షణ కొరవడటం, సామాజిక పరిస్థితులను పిల్లలతో చర్చించకపోవడం వల్లే యువత మాదకద్రవ్యాలు, మానభంగాలు, ఇతర నేరప్రవృత్తికి అలవాటు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 300 ఏళ్ల క్రితం ప్రపంచంలోని ప్రతీ అన్వేషకుడు భారత్ చేరడం లక్ష్యంగా సముద్రయానం చేశారని, ప్రస్తుతం మన యువత దేశాలు దాటిపోతోందని ఆవేదన చెందారు. విద్యార్థులు వ్యవసాయ రంగంపైనా అవగాహన పెంచుకోవాలన్నారు. చేనేత పరిశ్రమను ప్రోత్సహించాలనీ, వారంలో ఒకరోజు ఖాదీ వస్త్రాలు ధరించాలన్నారు. స్కూలు పిల్లలకు ఖాదీ వస్త్రాలనే యూనిఫారంలుగా వాడాలన్నారు. కేరళ ఇప్పటికే ఈ విధానాన్ని అమలు చేస్తోందని, మిగిలిన రాష్ట్రాలూ ఆ బాటలో నడవాలని హితవుపలికారు. చేనేత పరిరక్షణకు త్వరలోనే తాము అమెరికా, యూరోప్‌లో ప్రచారం చేస్తామన్నారు. సోమవారం పోచంపల్లిలో పర్యటించనున్నానని వెల్లడించారు. దేశంలో యువత ఆత్మహత్యలపై జగ్గీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గతేడాది 8,600 మంది యువత ఆత్మహత్యకు పాల్పడగా, అందులో 7వేలకుపైగా 15 ఏళ్లలోపు వారు ఉండటం ఆందోళన కలిగించిందన్నారు. తల్లిదండ్రులు పిల్లలతో స్నేహితులుగా ఉండాలన్నారు. తమ ఆశలను తీర్చేయంత్రాలుగా చూడకూడదని స్పష్టంచేశారు. ‘యువతా, సత్యాన్ని తెలుసుకో’కార్యక్రమాన్ని (ఇన్–హౌస్ ఈవెంట్) సెప్టెంబర్ 18న నల్సార్ ఆడిటోరియంలో నిర్వహించనున్నామన్నారు. ఆ తరువాత విద్యార్థులతో ‘‘వన్ నేషన్ – వన్ పోల్’’అనే అంశంపై చర్చ జరుపుతామన్నారు. -
పల్లెల్లో సౌకర్యాలు లేవు
సాక్షి, అమరావతి: గ్రామాల్లో సౌకర్యాలు లేవని, గ్రామాలు, పట్టణాల మధ్య సౌకర్యాల్లో అంతరం తగ్గితేనే ప్రజల్లో ఆనందకరమైన వాతావరణం ఏర్పడుతుందని ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు సద్గురు జగ్గీ వాసుదేవ్ అన్నారు. మంగళగిరి సమీపంలోని సీకే కన్వెన్షన్ హాలులో సీఆర్డీఏ ఆధ్వర్యంలో మూడురోజుల పాటు జరిగే హ్యాపీ సిటీస్ సమ్మిట్ (ఆనంద నగరాల సదస్సు) ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబుతో ప్రత్యేకంగా సంభాషించారు. సౌకర్యాలన్నీ పట్టణాల్లోనే కేంద్రీకృతమవుతుండటంతో పల్లెల నుంచి జనం పట్టణాలకు తరలివస్తున్నారని, దీనివల్ల పట్టణ జనాభా పెరిగి సౌకర్యాలు తగ్గిపోతున్నాయని చెప్పారు. పల్లెల్లోనూ ఆహ్లాద, వినోద కార్యకలాపాలు పెరిగితే పట్టణాల్లో జనసమ్మర్థం తగ్గుతుందన్నారు. ఆనందం అనేది మానవులకే కాదని, అది అన్ని జీవరాశులకు ఉండాలన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభోపన్యాసం చేస్తూ అమరావతిని ఆనందనగరంగా తీర్చిదిద్దుతున్నామన్నారు. ప్రపంచ సంతోష నగరాల సదస్సును దేశంలో తొలిసారిగా అమరావతిలో నిర్వహిస్తున్నామని చెప్పారు. ఐజీబీసీ–2018 గ్రీన్‌సిటీ ప్లాటినమ్ రేటింగ్ అవార్డుకు అమరావతి నగరం ఎంపికైందని సదస్సులో ప్రకటించిన ఆ సంస్థ చైర్మన్ ప్రేమ్ జైన్ దాన్ని సీఎం చంద్రబాబుకు అందించారు. అమరావతిని ఆనంద నగరంగా తీర్చిదిద్దే మాస్టర్‌ప్లాన్‌ను జగ్గీవాసుదేవ్ ఆవిష్కరించారు. -
సహజ బలంతోనే ఎదుగుదల
హైదరాబాద్: నేచురల్ ఎవల్యూషన్ (సహజ పరిణామ క్రమంలో ఎదుగుదల) అనే అంశాన్ని తాము విశ్వసిస్తామని ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీవాసుదేవ్ అన్నారు. మహిళలకు 33 శాతం ప్రత్యేక రిజర్వేషన్ల కల్పన వల్ల పెద్దగా ఒరిగేదేమీ ఉండదని అభిప్రాయపడ్డారు. ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఎల్వో) ఆధ్వర్యంలో నగరంలోని పార్క్ హోటల్లో సోమవారం నిర్వహించిన ‘ఇన్ కన్వర్సేషన్ విత్ సద్గురు’ పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యురాలు కల్వకుంట్ల కవిత ఆయనతో చర్చాగోష్టి నిర్వహించారు. ఆమె అడిగిన పలు ప్రశ్నలకు చమత్కారంగా, సూటిగా సమాధానాలు ఇచ్చి ఆహూతులను అలరించారు. ఆడ, మగ అనే తేడా లేకుండా ప్రకృతి అందరికి అవకాశాలు ఇస్తుందని, ప్రతిఒక్కరూ తమ సహజ బలం గుర్తించి సహజ పరిణామక్రమంలో ఎదిగినప్పుడే అభివృద్ధి సాధ్యమన్నారు. ప్రతి ఒక్కరిలో ప్రత్యేక మ్యాజిక్ మీలో ఏమి మిస్టిక్, మ్యాజిక్ ఉంది అని ఆమె అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ ‘నేను నా జేబులో నుంచి పావురాలు, ఉంగరాలు తీసి చూపితేనే మ్యాజిక్ ఉన్నట్లు కాదు.. ప్రతి ఒక్కరిలో ప్రత్యేక మ్యాజిక్ ఉంటుంది. విత్తనం మొక్కగా మారడం, పిండం శిశువుగా మారడం సహా ఈ సృష్టే పెద్ద మ్యాజిక్ ’అని అన్నారు. మనదేశంలో పురుష గురువులే కనిపిస్తారు. మహిళలు కనిపించరు ఎందుకన్న ప్రశ్నకు బదులిస్తూ మనం పిల్లలు పుట్టినప్పటి నుంచే లింగ భేదాలు నూరిపోస్తూ వివక్షా పూరితంగా తయారు చేస్తున్నామన్నారు. మనం ఆడవాళ్లం కాబట్టి అవకాశాలు రావడం లేదనే భావన విడనాడాలని, ఇషా ఫౌండేషన్‌లో దాదాపు 70శాతం మహిళా వలంటీర్స్ పనిచేస్తారన్నారు. కార్యక్రమంలో ఎఫ్ఎల్వో చైర్పర్సన్ కామిని షరాఫ్, సంగీతారెడ్డి సహా పెద్ద సంఖ్యలో సభ్యులు పాల్గొన్నారు. పురుషుల్లోనూ అసూయ.. మహిళలకు మహిళలే శత్రువు అనే భావనపై ఏమంటారు అని అడిగిన కవితకు జగ్గీ వాసుదేవ్ సమాధానం ఇస్తూ అసూయలు, ఈర‡్ష్యలు సహజమని, ఇది కేవలం మహిళలకే పరిమితం కాదన్నారు. సమాజం డబ్బే లోకం అన్న రీతిలో తయారు కావడంతోనే అన్ని సమస్యలు వస్తున్నాయన్నారు. ఆధ్యాత్మిక గురువులకు రాజకీయాలెందుకన్న ప్రశ్నకు వారూ రహదారి మీదే నడుస్తారని, ట్రాఫిక్ ఇతర సమస్యలపై ప్రశ్నిస్తే తప్పెలా అవుతుందని బదులిచ్చారు. -
నదీ గర్భంలో నివాసం.. ఇదేనా పరిరక్షణ?
► కృష్ణా నదిలో అక్రమ నిర్మాణం.. అందులో సీఎం చంద్రబాబు నివాసం ► 21 అక్రమ కట్టడాలను తొలగిస్తామని.. ఆ ఊసే ఎత్తని వైనం ► ముఖ్యమంత్రి నివాసం ఎదురుగా రూ.4.12 కోట్లతో నిర్మాణంలో మరో అక్రమ కట్టడం ► నదీ పరిరక్షణ, పర్యావరణ చట్టాలను తుంగలో తొక్కడంపై విమర్శలు ► సీఎం చంద్రబాబు తీరును ఆదిలోనే ఎండగట్టిన మేధాపాట్కర్, రాజేంద్రసింగ్ సాక్షి, అమరావతి: నదీ పరిరక్షణ చట్టానికి విరుద్ధంగా కృష్ణా నది గర్భంలో నివాసం ఉంటోన్న సీఎం చంద్రబాబు నాయుడు నదులను పరిరక్షిస్తా నంటూ సుదీర్ఘ ఉపన్యాసాలు చేస్తోండటంపై పర్యావరణవేత్తలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. వాటర్ మ్యాన్ రాజేంద్రసింగ్‌తో కలసి 1995 నుంచి నదీ పరిరక్షణకు ఉద్యమాలు చేశానని చెప్పడం పట్ల ఆశ్చర్యపోతున్నారు. ‘కృష్ణా నదీ పరిరక్షణ యాత్ర’లో పాల్గొనేందుకు ఆగస్టు 3న ఆంధ్రప్రదేశ్ రాజధానిలో పర్యటించిన రాజేంద్ర సింగ్ పట్ల చంద్రబాబు వ్యవహరించిన తీరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తక్షణమే సీఎం తన అక్రమ నివాసాన్ని ఖాళీ చేయాలంటూ డిమాండ్ చేసిన రాజేంద్రసింగ్‌పై నాడు టీడీపీ కార్యకర్తలను ఉసిగొలిపి.. ఇప్పుడు నదుల పరిరక్షణ కోసం దేశంలో తానే మొట్టమొదటగా ఒక విధానాన్ని రూపొందించానంటూ ముఖ్య మంత్రి గొప్పలు పోవడం గమనార్హం. ఈషా ఫౌండేషన్ జగ్గీ వాసుదేవ్ నేతృత్వంలో చేపట్టిన ర్యాలీ ఫర్ రివర్స్ కార్యక్రమంలో బుధవారం పాల్గొన్న సీఎం.. ప్రజల నీటి అవసరాలు తీర్చేందుకు నదుల అనుసంధానం తాత్కాలికం అని, నదుల పరిరక్షణ శాశ్వత చర్య అని పేర్కొన్నారు. ఈ క్రమంలో నదీ పరిరక్షణ చట్టాన్ని సాక్షాత్తూ ఆయనే ఉల్లంఘిస్తూ.. తనకేమీ తెలియనట్లు నీతులు వల్లించడం గమనార్హం. నదీ పరిరక్షణ చట్టం 1884 ప్రకారం నదుల తీరాన.. గర్భంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదు. చివరకు పెద్ద చెట్లు కూడా పెంచకూడదు. పర్యావరణ చట్టాల ప్రకారం నదుల్లో యంత్రాలతో ఇసుక తవ్వకూడదు. అయితే రాష్ట్రంలో 2014 జూన్ 8న ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించాక నదీ పరిరక్షణ చట్టాన్ని, పర్యావరణ చట్టాన్ని తుంగలో తొక్కుతూ వచ్చారు. ఇసుక అక్రమ తవ్వకాలకు తెరలేపి నదుల స్వరూపాన్ని మార్చి వేశారు. తొలగిస్తామని తిష్ట వేశారు.. కృష్ణా నదిలో 2014 డిసెంబర్ 31న ప్రత్యేక లాంచిలో పర్యటించిన జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరావు.. నెల రోజుల్లోగా అక్రమ నిర్మాణాలను తొలగిస్తామని ప్రకటించారు. కృష్ణా నది గర్భంలో ప్రకాశం బ్యారేజీకి ఎగువన 21 అక్రమ నిర్మాణాలు ఉన్నట్లు వెల్లడించారు. అయితే అక్రమ నిర్మాణాలను కూల్చి వేయకపోగా.. అందులో లింగమనేని అతిథి గృహాన్ని సీఎం చంద్రబాబునాయుడు తన అధికారిక నివాసంగా ఏర్పాటు చేసుకోవడం గమనార్హం. పైగా అక్కడే రక్షణ సిబ్బందికి ప్రత్యేకంగా గదులు, ప్రహరీని అనుమతి లేకుండానే నిర్మించారు. నదీ గర్భాన్ని కబ్జా చేసి.. సీఎం నివాసంలోకి రహదారి నిర్మించారు. తాజాగా ఎలాంటి అనుమతి లేకుండానే సందర్శకుల కోసం రూ.4.12 కోట్లతో ప్రత్యేక భవనాన్ని నిర్మిస్తున్నారు. ఇందుకోసం సీఎం నివాసం ఉంటున్న అక్రమ కట్టడానికి కూత వేటు దూరంలో కృష్ణా నదీ గర్భాన్ని అడ్డంగా తవ్వేస్తూ ఇసుకను తరలిస్తున్నారు. ఎత్తిచూపితే ఎదురు దాడే నర్మదా బచావో ఆందోళన నాయకురాలు మేథాపాట్కర్ క్షేత్ర స్థాయిలో పర్యటించి కృష్ణా నదిని అడ్డంగా తవ్వేస్తున్న ఇసుకాసురుల తీరును ఎండగట్టారు. సీఎం నివాస గృహం పక్కనే అక్రమ తవ్వకాలను ఆమె ఎత్తిచూపారు. పర్యావరణ చట్టాన్ని అమలు చేయాల్సిన ముఖ్యమంత్రి వాటిని తుంగలో తొక్కుతున్న తీరును దుయ్యబట్టిన ఆమెపై చంద్రబాబు తన మంత్రులను ఎదురుదాడికి ఉసిగొలిపారు. దుర్భిక్ష అనంతపురం జిల్లాలో వేదవతి(హగరి) నది పునరుజ్జీవం కోసం 1999లో అప్పటి సీఎం చంద్రబాబునాయుడుకు తాను నివేదిక ఇచ్చినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని వాటర్ మ్యాన్ రాజేంద్రసింగ్ అప్పట్లో ప్రకటించారు. నది జీవనదిగా ఉండాలంటే నదికి ఇరు వైపులా కనీసం రెండు కిలోమీటర్ల వెడల్పుతో మొక్కలు పెంచి పచ్చదనం పెంపొందించాలని జగ్గి వాసుదేవ్, రాజేంద్రసింగ్ చెబుతూనే వస్తున్నారు. ఇదే అంశాన్ని రాజేంద్రసింగ్ బుధవారం మరోసారి చాటి చెప్పి.. సీఎం చంద్రబాబు నిర్వాకాన్ని పరోక్షంగా ఎండగట్టడం గమనార్హం. -
‘ర్యాలీ ఫర్ రివర్స్’కు అందరూ సహకరించాలి
-
‘ర్యాలీ ఫర్ రివర్స్’కు అందరూ సహకరించాలి
విజయవాడ : ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు జగ్గీ వాసుదేవ్ నేతృత్వంలో బుధవారం ఉదయం విజయవాడలో ‘ర్యాలీ ఫర్ రివర్స్’ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రులు పాల్గొన్నారు. నదులను పరిరక్షించాలన్న లక్ష్యంతో చేపట్టిన ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా కొనసాగుతోంది. ఇప్పటికే 16 రాష్ట్రాలు ఈ కార్యక్రమంలో భాగమయ్యాయి. కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, కర్ణాటక రాష్ట్రాలతో ఈషా ఫౌండేషన్ ఒప్పందాలు చేసుకుంది. కార్యక్రమంలో పాల్గొన్న జగ్గీ వాసుదేవ్ మాట్లాడుతూ ర్యాలీ ఫర్ రివర్స్‌లో అందరూ భాగస్వాములు కావాలని కోరారు. నదులు అంతరించిపోతే విపత్తులు సంభవిస్తాయని హెచ్చరించారు. 25 ఏళ్లుగా దేశవ్యాప్తంగా నదులు స్వరూపం కోల్పోతున్నాయని.. నదులు శుష్కించిపోవడానికి కారణం మనమేనని పేర్కొన్నారు. నదుల పరిరక్షణకు అందరూ నడుంబిగించాలని పిలుపునిచ్చారు. -
‘కరకట్ట’ ఇంటిని బాబు ఖాళీ చేయాలి
విజయవాడ: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తక్షణమే తన నివాసాన్ని ఖాళీ చేయాలని వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా, మెగసెసె అవార్డ్ గ్రహీత రాజేంద్రసింగ్ డిమాండ్ చేశారు. అమరావతి నది పరివాహక ప్రాంతంలో అక్రమ కట్టడాలు కట్టారని, సీఎం చంద్రబాబు కూడా నది పరివాహక ప్రాంతంలో నివసిస్తున్నారన్నారు. కృష్ణానది బచావో పేరిట...కృష్ణానది పరిరక్షణ యాత్ర బుధవారం ఉదయం ప్రకాశం బ్యారేజీ నుంచి ప్రారంభమైంది. ఈ యాత్రలో వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేంద్ర సింగ్, పర్యావరణవేత్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజేంద్ర సింగ్ మాట్లాడుతూ...‘చంద్రబాబు మా మాటలు వినడం లేదు...జగ్గీ వాసుదేవ్ చెబితే వింటారేమో. ఆయన సింగపూర్ మాటలనే ఇష్టపడుతున్నారు. వాళ్లు గాలిలో ఎగురుతారు. మనం భూమి మీద నడుస్తాం.’ అని అన్నారు. కృష్ణానదీ బచావో పాదయాత్ర దేశ వ్యాప్త ఉద్యమం అవుతుందని, ఇది స్థానిక ఉద్యమం కాదని, దేశంలోని అన్ని రాజకీయ పక్ష నేతలను కలుపుకొని కృష్ణానది పరిరక్షణకు చేసే యాత్ర అని అన్నారు. నదుల పరిరక్షణకు ప్రభుత్వాలు కృషి చేయాలని రాజేంద్ర సింగ్ కోరారు. ప్రొఫెసర్ విక్రమ్ సోనీ మాట్లాడుతూ.. నదులు ప్రకృతి సిద్ధంగా ఏర్పడ్డాయని, వాటిని నాశనం చేస్తే మానవ మనుగడే కష్టమని ఆందోళన వ్యక్తం చేశారు. నదీ పరివాహక ప్రాంతాల్లో అక్రమ కట్టడాలను తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. కాగా కృష్ణానది పరిరక్షణ యాత్ర ఈ నెల 6వ తేదీ వరకూ కొనసాగనుంది. మద్దురు, పాపవినాశనం, హంసలదీవి, పెనుముడి, కొల్లూరు మీదగా బీజాపూర్ వరకు పాదయాత్ర నిర్వహించనున్నారు. -
ఏఆర్ రెహ్మాన్ నిరాహార దీక్ష!
-
ఏఆర్ రెహ్మాన్ నిరాహార దీక్ష!
జల్లికట్టుకు అనుమతి ఇవ్వాలంటూ తమిళనాడులో నిరసనలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. ఇప్పటికి నాలుగో రోజు కూడా చెన్నై మెరీనాబీచ్‌లో నిరసనకారులు అలాగే ఉన్నారు. అర్ధరాత్రి సమయంలోనూ అక్కడినుంచి కదల్లేదు. మరోవైపు జల్లికట్టుకు మద్దతుగా ప్రముఖులు కూడా రంగంలోకి దిగుతున్నారు. ఆస్కార్ అవార్డు విజేత ఏఆర్ రెహ్మాన్ నిరాహార దీక్ష చేస్తున్నారు. ఈ విషయాన్ని ఆయన తన అధికారిక ట్విట్టర్ అకౌంట్ ద్వారా ప్రకటించారు. విద్యార్థులు మొదలుపెట్టిన ఈ నిరసన కాస్తా ఉద్యమ రూపాన్ని సంతరించుకుంది. లాయర్లు, నటులు, కళాకారులు, ఐటీ ఉద్యోగులు.. ఇలా అన్ని వర్గాల వాళ్లు వీటిలో పాల్గొంటున్నారు. జల్లికట్టును నిషేధిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను తాము ధిక్కరించలేమని, ఇప్పుడు ప్రత్యేకంగా ఆర్డినెన్సు ఇవ్వలేమని కేంద్రం స్పష్టం చేయడంతో నిరసనలు మరింత తీవ్రతరమయ్యాయి. రెహ్మాన్ ఇప్పటికే తన నిరాహార దీక్ష విషయాన్ని ప్రస్తావించగా.. సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా తన అభిమానులకు పిలుపునిస్తారని ఆశిస్తున్నారు. ఆయనతో పాటు కమల్‌హాసన్ కూడా వ్యక్తిగతంగా జల్లికట్టు ఉండాల్సిందేనని ఇప్పటికే చెప్పిన విషయం తెలిసిందే. మరోవైపు ఆధ్యాత్మిక గురువులు ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవిశంకర్, జగ్గీ వాసుదేవ్ లాంటి వాళ్లు కూడా నిషేధాన్ని ఉపసంహరించాలని కోరారు. జల్లికట్టు అనేది తమిళ సంస్కృతిలో భాగమని, అది సంక్రాంతి పండుగ సంబరాల్లో అంతర్భాగమని అన్నారు. జల్లికట్టుకు తాను మద్దతిస్తున్నానని, నిరసనలు శాంతియుతంగా జరగాలని కోరుకుంటున్నానని రవిశంకర్ ట్వీట్ చేశారు. సుప్రీంకోర్టులో సరైన వాస్తవాలతో మరో తాజా అప్పీలు దాఖలు చేద్దామన్నారు. జంతువులకు పండుగను అంకితం చేసే ఉత్సవం లాంటిదే జల్లికట్టు అని, ప్రజల సాంస్కృతిక బలాన్ని తీసేసుకుంటామంటే కుదరదని, ముఖ్యంగా పల్లెల్లో ఇవి చాలా ముఖ్యమని జగ్గీ వాసుదేవ్ అన్నారు. దారిలోనే ఉంది.. రెడీగా ఉండండి అయితే, ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిసి వచ్చిన తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం మాత్రం జల్లికట్టుకు అందరూ సిద్ధంగా ఉండాలని ట్వీట్ చేశారు. 'బిగ్ డే' దారిలోనే ఉందని అందులో చెప్పారు. మరి అది ఎలా సాధ్యం అవుతుందో మాత్రం తెలియట్లేదు. ఎందుకంటే, జల్లికట్టు మంచి సంప్రదాయమే అయినా అది సుప్రీంకోర్టులో విచారణలో ఉన్నందున దాని గురించి ఏమీ మాట్లాడలేమని ప్రధానమంత్రి స్వయంగా చెప్పారు. మరి పన్నీర్‌కు ఏరకమైన సూచన వచ్చిందో, జల్లికట్టు గురించి ఎలాంటి ప్రకటనలు వస్తాయో చూడాల్సి ఉంది. I'm fasting tomorrow to support the spirit of Tamilnadu! — A.R.Rahman (@arrahman) 19 January 2017 The way the #jallikattu protests are being held in peace is a lesson for the whole world. May everyone continue to maintain peace. — Mohammad Kaif (@MohammadKaif) 20 January 2017 Get ready for #Jallikattu The big day is on the way. — O. Pannerselvam (@CMOTamilNadu) 19 January 2017 The Tamilnadu Govt can itself issue an Ordinance to legalise #Jallikattu. @CMOTamilNadu should not bother about the Central Govt. RT pic.twitter.com/Spfm6nARpH — Markandey Katju (@mkatju) 19 January 2017 -
బాధ లేకుండా ఏ పని జరుగుతోంది?
-
రేపు బాబుతో జగ్గీ వాసుదేవన్ భేటీ
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు జగ్గీ వాసుదేవన్ ఆదివారం భేటీ కానున్నారు. మదీనగూడలోని చంద్రబాబు ఫాంహౌస్‌లో ఆయన కలుస్తారు. ఈ భేటీలో చంద్రబాబు కుటుంబసభ్యులు కూడా పాల్గొంటారు. జగ్గీ వాసుదేవ్ గతంలో ఏపీ మంత్రులు, అధికారులకు యోగాలో శిక్షణనిచ్చారు. ఆ తర్వాత ఆయన సంస్థలు ఏర్పాటు చేసేందుకు కృష్ణా జిల్లాలో 400 ఎకరాల భూమిని ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించింది. దీనిపై అప్పట్లో రాజకీయ పార్టీలు అభ్యంతరం తెలపడంతో ప్రభుత్వం వెనక్కితగ్గిన విషయం తెలిసిందే. -
'జగ్గీ వాసుదేవ్‌కు భూ పందేరంపై వెనక్కితగ్గం'
ఇబ్రహీంపట్నం(కృష్ణా) : ఈషా ఫౌండేషన్ అధినేత, యోగా గురువు జగ్గీ వాసుదేవ్‌కు ప్రభుత్వం కట్టబెట్టజూస్తున్న మూలపాడు అటవీ భూములను ఆయనకు దక్కనీయబోమని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ తెలిపారు. ఇందుకోసం తమ ప్రాణాలు పోయినా పోరాటం ఆపబోమని ఆయన స్పష్టం చేశారు. శనివారం స్థానిక సీపీఐ నాయకులతో కలసి మూలపాడు అటవీ భూములను ఆయన పరిశీలించారు. అక్కడ పనిచేస్తున్న వనసంరక్షణ సమితి సభ్యులు, స్థానిక కూలీల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అడవిలో వన సంరక్షణ, అటవీ ఫలసాయంతో ఇంతకాలం జీవనం సాగిస్తున్నామని, తమ పశుసంపద కూడా అడవులపైనే ఆధారపడి ఉందని వ్యవసాయ కూలీలు గోడు వెళ్లబోసుకున్నారు. వేలకోట్ల రూపాయల విలువైన ఈ అటవీ భూముల్లోకి బాబాలు, చంద్రబాబు కాదుకదా వారి జేజమ్మలు దిగొచ్చినా అడుగుపెట్టనీయబోమన్నారు. తుళ్లూరు రాజధాని ప్రాంత రైతులకు అనుకూలంగా హైకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ, సీఎం చంద్రబాబుకు మొట్టికాయలు వేసినప్పటికీ ఆయన తీరు మారలేదని విమర్శించారు. -
బాబుకు భూముల పిచ్చి పట్టుకుంది
సాక్షి, విజయవాడ బ్యూరో/ఇబ్రహీంపట్నం: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు అధికారం దక్కగానే భూముల పిచ్చి పట్టుకుందని, దానికి రైతులను బలిచేయడమే కాకుండా ప్రభుత్వ భూములను సైతం ధారాదత్తం చేస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విమర్శించారు. ఇబ్రహీంపట్నం మండలం త్రిలోచనాపురంలో ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు జగ్గీవాసుదేవ్‌కు ప్రభుత్వం ఇవ్వాలనుకుంటున్న భూములను రామకృష్ణ నేతృత్వంలోని సీపీఐ ప్రతినిధి బృందం బుధవారం పరిశీలించింది. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ వాసుదేవ్ కోసం 400 ఎకరాలు సేకరించేందుకు బాబు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారన్నారు. -
అటవీ భూముల నజరానా
జగ్గీ వాసుదేవ్‌కు కట్టబెట్టేందుకు సర్కారు సిద్ధం వాటి విలువ సుమారు రూ.వెయ్యికోట్లు సాక్షి, విజయవాడ బ్యూరో: నూతన రాజధాని అమరావతికి అత్యంత సమీపంలో కోట్లాది రూపాయల విలువైన అటవీ భూముల్ని ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు జగ్గీ వాసుదేవ్‌కు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధపడటంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలం త్రిలోచనపురం ప్రాంతంలోని 400-500 ఎకరాల అటవీ భూమిని ఇందుకు ఎంపిక చేయడం వెనుక మతలబేంటన్న విషయంపైనే ఇప్పుడు చర్చ సాగుతోంది. మానవ వనరులశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు స్వయంగా జగ్గీ వాసుదేవ్‌ను తీసుకొచ్చి ఈ భూములను చూపించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అత్యంత విలువైన భూములు.. ఈ ప్రాంతంలో ఎకరం పొలం విలువ నాలుగు నెలల క్రితం వరకూ రూ.50 నుంచి రూ.60 లక్షలు ఉండేది. తుళ్లూరు రాజధాని ప్రకటన తర్వాత దాదాపు రూ.కోటి నుంచి కొన్నిచోట్ల రెండు కోట్లకూ చేరింది. ఆ ప్రకారం.. ఈషా ఫౌండేషన్‌కు కట్టబెట్టే భూముల విలువ రూ.వెయ్యి కోట్లకు పైమాటే. ఈ ప్రాంతంలో మొత్తం ఆరువేల ఎకరాల అటవీ భూములుండగా అందులో 1,500 ఎకరాల్లో వనసంరక్షణ సమితిలున్నాయి.మూలపాడు, త్రిలోచనపురం, కేతనకొండ, జూపూడి, దొనకొండ గ్రామాలకు చెందిన పేదలు వెదురు, జామాయిల్‌ను ఈ భూముల్లో పెంచి జీవనం సాగిస్తున్నారు. ఈ భూములు జగ్గీవాసుదేవ్ చేతిలోకి వెళితే వారందరి ఉపాధికి గండి పడినట్లే. కేంద్రం అనుమతితో ఈ భూముల్ని డీనోటిఫై చేయాల్సివుంది. కేంద్రంతో దీనిపై సంప్రదించకుండానే జగ్గీవాసుదేవ్‌కు భూములిచ్చేందుకు రాష్ట్రప్రభుత్వం అంగీకరించడం గమనార్హం. అడవిపైనే ఆధారపడ్డాం.. 20 సంవత్సరాల నుంచి అడవినే నమ్ముకుని జీవిస్తున్నాం. గతంలో భూములు బాగు చేసుకుని సాగు చేసుకోమన్నారు. వాటిని తీసేసుకున్నారు. ఇప్పుడు ఇక్కడ భూముల్ని బాగు చేసుకుని వెదురు, జామాయిల్ వేశాం. వీటిని తీసేసుకుంటే మేమెక్కడికి వెళ్లాలి. - అనసూర్య, త్రిలోచనపు -
మూడు రోజులకే వెయ్యి కోట్లిస్తే నెల రోజులకు ...
విజయవాడ: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు అధికారం దక్కగానే భూముల పిచ్చి పట్టుకుందని, దానికి రైతులను బలిచేయడమే కాకుండా ప్రభుత్వ భూములను సైతం ధారాదత్తం చేస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ఆరోపించారు. యోగా గురువు జగ్గీ వాసుదేవ్‌కు చంద్రబాబు కట్టబెట్టనున్న కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నం మండలం త్రిలోచనాపురం అటవీ భూములను పార్టీ శ్రేణులతో కలిసి రామకృష్ణ బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగ్గీ వాసుదేవ్ మూడురోజుల పాటు యోగా పాఠాలు నేర్పినందుకు సుమారు రూ.1,000 కోట్ల విలువైన భూమిని కట్టబెట్టటానికి చంద్రబాబు సిద్ధమయ్యారని, అదే నెల రోజులు యోగా నేర్పితే విజయవాడ కూడా రాసిస్తారని ఎద్దేవా చేశారు. భూముల పిచ్చితో ల్యాండ్‌బ్యాంక్ ఏర్పాటుకు 10 లక్షల ఎకరాలు సేకరించడానికి చంద్రబాబు పూనుకున్నట్లు విమర్శించారు. అటవీ భూముల్ని కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టే ప్రయత్నాలను ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రత్యక్ష ఆందోళనకు దిగుతామని చంద్రబాబు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రామకృష్ణ వెంట మాజీ ఎమ్మెల్సీ జెల్లి విల్సన్, రాష్ట్ర రైతుసంఘం ప్రధాన కార్యదర్శి ఆర్.వెంకయ్య, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు హరినాథ్‌రెడ్డి తదితరులున్నారు. -
చంద్రబాబుకు భూముల పిచ్చి పట్టింది: రామకృష్ణ
ఇబ్రహీంపట్నం (కృష్ణా జిల్లా): ఏపీ సీఎం చంద్రబాబుకు భూముల పిచ్చి పట్టిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలం త్రిలోచనాపురంలో యోగా శిక్షకుడు జగ్గీ వాసుదేవ్‌కు 400 ఎకరాలకు పైగా భూములను కేటాయిచాలన్న ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రామకృష్ణ బుధవారం ఉదయం ప్రతిపాదిత ప్రాంతాన్ని సందర్శించారు. ఆయన వెంట పార్టీ జిల్లా, స్థానిక నేతలు సుమారు 200 మంది ఉన్నారు. త్రిలోచనాపురంలోని అటవీ భూములను పరిశీలించిన అనంతరం రామకృష్ణ మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు రాజధాని పేరుతో గుంటూరు జిల్లా తుళ్లూరు పరిసర ప్రాంతాల్లో 33వేల ఎకరాలు సేకరించాడని... విజయనగరం జిల్లా భోగాపురంలో 1500 ఎకరాలు సేకరించాలని తలపెట్టాడన్నారు. బాబుకు భూపిచ్చి పట్టుకుందని, కార్పొరేట్లకు కట్టబెట్టేందుకే ఇలా చేస్తున్నాడని ఆరోపించారు. దీన్ని సీపీఐ తరఫున తీవ్రంగా ప్రతిఘటిస్తామన్నారు. త్రిలోచనాపురంలో జగ్గీ వాసుదేవ్‌కు ఐదు, పది ఎకరాలు కేటాయిస్తే సరిపోతుందన్నారు. ఇక్కడ వన సంరక్షణ సమితి ద్వారా అటవీ భూములపై వందలాది మంది కూలీలు ఆధారపడి జీవిస్తున్నారని.. ఆ భూములను ప్రభుత్వం వారికే కేటాయించేలా తాము పోరాడతామని రామకృష్ణ చెప్పారు. -
జగ్గీ వాసుదేవ్‌కు భారీగా భూపందేరం
-
ఓ రోజు యోగా నేర్పినందుకు గురుదక్షణ?
విజయవాడ: యోగా గురువు జగ్గీవాసుదేవ్‌కు చంద్రబాబు ప్రభుత్వం 400 ఎకరాలను కేటాయించడంపై కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. శుక్రవారం విజయవాడలో ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ.... ఓ రోజూ సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలకు యోగా నేర్పినందుకు గురుదక్షణగా 400 ఎకరాలను వాసుదేవ్‌కు కేటాయించారా? అని ఆయన చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. జగ్గీవాసుదేవ్‌కు ఏ హోదా ఉందని సీఎం, మంత్రులు, అధికారులు రెడ్ కార్పెట్ పర్చుతున్నారని ఆయన ఆగ్రహాం వ్యక్తం చేశారు. ఏకంగా 400 ఎకరాల అటవీ భూమిని యోగా స్కూల్‌కు కేటాయించటం సరికాదని ఆయన చంద్రబాబు ప్రభుత్వానికి హితవు పలికారు. జగ్గీవాసుదేవ్‌కు భూమిని ఇవ్వడానికి వీలులేదని మల్లాది విష్ణు అన్నారు. -
‘ఉపయోగా’ అంటే ఏమిటి? అసలు అది ఎందుకు చేయాలి?
భారతీయ భాషలలో ‘ఉపయోగా’ అనే పదము యొక్క అర్థం దురదృష్టవశాత్తూ దిగజారిపోయి ‘ఏదైతే ఉపయోగపడుతుందో అది’గా మారిపోయింది. ఉప అనే పదానికి అర్థం కింద స్థాయి అని, అందువల్ల ఉపయోగా అంటే కింద స్థాయి యోగా అని. ఐక్యమయిపోవడం కోసమే యోగా. అంటే యోగా అనేది తన పరమోన్నత స్వభావానికి చేరుకోవాలనుకునే నిబద్ధత గల సాధకుడి కొరకే. అటువంటి కోరికా, ఉద్దేశమూ లేని వారికి - తమ అస్తిత్వ మూలంతో కలిసిపోవడానికి సిద్ధంగా లేనప్పటికీ, సంసారికతలో పడి కొట్టుకుపోకూడదనుకనే వారికి అందించబడేదే ఈ సెమీ యోగా లేదా ఉపయోగా. కాలక్రమేణ, వాడుక భాషలో ‘ఉపయోగా’ అంటే ‘ఉపయోగపడే యోగా’ లేదా ‘ఉపయోగపడే చర్య’ అని అర్థం చేసుకోవడం జరిగింది. కాని దేనిని కూడా అలాంటి దృక్పథంతో చూడకూడదు. నిజానికి మనం ఒకదాన్ని దానిలోని ఉపయోగం ఏమిటనే భావనతో మాత్రమే చూడకూడదు. దానిలో అంతకు మించినదే ఉండవచ్చు. మీకు గనుక ఒక దాని పట్ల దాన్ని ఎలా ఉపయోగించుకోవాలనే దృక్పథం లేకపోతే, అప్పుడది మీకు ఎంతో ఉపయోగపడడమే కాకుండా, ‘మీరు’ అనే మీ మౌలిక భావననే సమూలంగా మార్చివేస్తుంది. ఉపయోగా అనేది లోతైన ఆధ్యాత్మిక దృక్పథం కలిగినది కాదు, ఇది మనిషి యొక్క భౌతిక, మానసిక, శక్తి పార్శ్వాల కొరకు రూపొందించబడింది. ఇది ఇంకొంచెం పరిపూర్ణమైన భౌతిక జీవనం కావాలనుకునే వారికి. నేను భౌతికత అన్నప్పుడు, అది మానసిక, భావోద్వేగ అంశాలకు కూడా వర్తిస్తుంది. మనము అర్థం చేసుకోవలసిన ఒక విషయం ఏమిటంటే యోగా ఒక రకమైన వ్యాయామం కాదు. కానీ యోగాలో ఉపయోగా వంటి శక్తివంతమైన వ్యాయామ పద్ధతులు కూడా ఉన్నాయి. వ్యాయామం కావాలనుకునే చాలా మందికి ఉపయోగా ఒక మంచి ప్రారంభం కావచ్చు. ఎందుకంటే అది దానికదే ఒక శక్తివంతమైన వ్యవస్థ. యోగాను ఒక వ్యాయామంగా చేయడం కంటే ఉపయోగాను చేయడం చాలా మంచిది. వారు దానిపట్ల ఆకర్షితులు అయినప్పుడు, వారంతట వారే యోగాలోకి వెళ్ళవచ్చు. మీరు నిద్రపోయినప్పుడు, చాలా సేపు పడుకుని కదలకుండా ఉంటారు. అలా ఉన్నప్పుడు మీ శక్తి వ్యవస్థలో కొంత జడత్వము ఏర్పడుతుంది. అప్పుడు మీ కీళ్లలో కావలసినంత లూబ్రికేషన్ ఉండదు. మీ కీళ్ళను లూబ్రికేట్ చేయకుండా కదిలిస్తే అవి ఎక్కువ రోజులు పనిచేయవు. ఒక మనిషికున్న స్వేచ్ఛంతా కూడా తనకున్నటువంటి కీళ్ళ వల్లనే. కీళ్ళు శక్తి భాండాగారాలు. కీళ్ళలోని నాడులు ఒక నిర్దిష్ట విధానంలో ప్రవర్తిస్తాయి. ఉపయోగాలోని ఒక అంశము కీళ్ళలోని కందెనను (లూబ్రికెంట్ను), శక్తి స్థానాలను ఉత్తేజపరచడమే. అందువల్ల మీ తక్కిన వ్యవస్థంతా సరిగ్గా పనిచేయడం మొదలుపెడుతుంది. ప్రేమాశీస్సులతో, సద్గురు - సద్గురు జగ్గీ వాసుదేవ్ www.sadhguru.org -
బాబూ.. నాకు కాస్త ప్రశాంతతనివ్వండీ..!
-
యోగా క్లాస్‌లో సీఎం డాన్స్
సాక్షి, హైదరాబాద్: ఇన్నర్ ఇంజనీరింగ్ ఫర్ జాయ్‌ఫుల్ లివింగ్‌లో శిక్షణ పొందుతున్న ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రులు, అధికారులు శుక్రవారం రెండో రోజు నృత్యాలు చేశారు. తమిళనాడుకు చెందిన ఈషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రముఖ ఆధ్యాత్మిక గురువు జగ్గీ వాసుదేవ్ ఈ శిక్షణ ఇస్తున్న విషయం తెలిసిందే. శిక్షణ లో భాగంగా ఆలపించే పాటలను శుక్రవారం ఇక్కడ ప్రదర్శించారు. నాలుగైదు పాటలకు అందరూ నృత్యాలు చేశారు. రెండోరోజు ఉదయం 8 గంటలకే ప్రారంభమైన శిక్షణ సాయంత్రం 6 వరకు కొనసాగింది. ఆసనాలు, క్రియాసంద్ ముద్రలతో శిక్షణ కొనసాగింది. శుక్రవారం శిక్షణకు మంత్రులు, అధికారులు మొత్తం మూడొందల మంది పాల్గొన్నారు. కలెక్టర్లు, మేయర్లు కూడా భాగస్వాములయ్యారు. సీఎం చంద్రబాబు సుమారు 5 నుంచి 10 నిమిషాల పాటు డాన్స్ చేశారు. మంత్రులు,సీఎస్ఐవైఆర్ కృష్ణారావు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు అరగంట పాటు తన్మయత్వంతో నృత్యం చేశారు. జాయ్‌ఫుల్ లివింగ్‌లో నృత్యం ఒక భాగమని జగ్గీ వివరించారు. ప్రసిద్ధి చెందిన శాంభవి ఆసనాన్ని నేర్పించారు. ఇది అంతర్గత సామర్ధ్యం పెంచేందుకు, శ్వాస సమస్యలను తగ్గించేం దుకు ఉపయోగపడుతుందన్నారు. ఎంతో దోహదం: బాబు యోగా శిక్షణ తరగతులు విధి నిర్వహణ సామర్ధ్యం పెంపునకు దోహదపడతాయని సీఎం చంద్రబాబు చెప్పారు. పచ్చదనానికి సహకరిస్తాం ‘ప్రాజెక్టు గ్రీన్ హేండ్స్’ పేరుతో ఫౌండేషన్ బృందం ఓ డాక్యుమెటరీని ప్రదర్శించింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో రానున్న ఐదేళ్లలో 33 శాతం గ్రీనరీ పెంచేందుకు తాము ముందుకొస్తామని జగ్గీ తెలిపారు. ఆర్ అండ్ బీ అధికారి రామచంద్రరాజు.. హైదరాబాద్ శివార్లలోని 50 ఎకరాల సొంత భూమిని నర్సరీలు పెంచేందుకు ఈషా ఫౌండేషన్‌కు ఉచితంగా అందజేశారు. -
చంద్రబాబు 'జాయ్ ఆఫ్ లివింగ్' క్లాస్!
-
యోగాపై పతంజలి ప్రభావం
జగ్గీ వాసుదేవ్ www.sadhguru.org యోగా సూత్రాలను సంకలనం చేసిన పతంజలి మహర్షిని ‘ఆధునిక యోగా పితామహుడి’గా భావిస్తారు. మొదటి ఆదియోగి ‘శివుడు’ యోగాలోని వివిధ అంశాలను సప్తరుషులకు అందించారు. ఇవే ఏడు ప్రాథమిక వ్యవస్థలుగా మారాయి. కానీ ఆయన ఎప్పుడూ ఏదీ లిఖిత రూపంలో ఉంచలేదు. కాలక్రమేణా అవి కొన్ని వందల వ్యవస్థలుగా ఆవిర్భవించాయి. భారతదేశంలో ఒకప్పుడు 1700 విభిన్న యోగా విధానాలు ఉండేవి. అందువల్ల పతంజలి వాటన్నిటినీ 200 సూత్రాలలో క్రోడీకరించి ‘‘మానవ అంతర్గత వ్యవస్థ గురించి చెప్పగలిగేదంతా ఇందులో ఉంది’’ అన్నారు. పతంజలి యోగాసూత్రాలు కేవలం ఒక నిర్దిష్ట స్థాయి అనుభవం కలిగినవారికి మాత్రమే అర్థం అయ్యేలా రూపొందించబడ్డాయి. సాధారణ పాఠకునికి అవి అర్థరహితమైన మాటలుగా అనిపిస్తాయి. పతంజలి జీవితం గురించి రాసిన ఈ మహత్తర గ్రంథాన్ని ఒక వింత పద్ధతిలో మొదలుపెట్టారు. మొదటి అధ్యాయం, ‘ఇక ఇప్పుడు యోగా’ అనే అర్థ వాక్యం మాత్రమే. ఆయన చెప్పదలచుకున్నదేమిటంటే కోరుకున్న ఉద్యోగం, అవసరమైన డబ్బు, నచ్చిన జీవిత భాగస్వామి ఉన్నా కూడా, మీలో ఇంకా ఏదో వెలితి ఉన్నట్లుగా మీకు అనిపిస్తూ ఉంటే... అప్పుడు మీ జీవితంలో ‘యోగా’కి సమయం ఆసన్నమైనట్లు. కొత్త ఇల్లు కట్టుకుంటేనో, లేక మరొక ఉద్యోగంలో చేరితేనో అంతా బాగుంటుంది అని మీరు ఇంకా విశ్వసిస్తున్నట్లయితే, మీ జీవితంలో ‘యోగా’కి సమయం ఇంకా రానట్లే. ఇలాంటివేమీ మీకు నిజమైన సంపూర్ణతను కలిగించవని మీకు అవగతమైనప్పుడే, మీకు యోగా చేయవలసిన సమయం ఆసన్నమైనట్లు. అందుకే పతంజలి యోగాసూత్రాలలోని మొదటి అధ్యాయం ఒకే అర్థ వాక్యం. అదే ‘ఇక ఇప్పుడు, యోగా’. వాస్తవానికి, జీవితం గురించి పతంజలి చెప్పగలిగినదంతా చెప్పేశారు. మేధస్సు పరంగా, అలాగే గణితశాస్త్రం, జ్యోతిశ్శాస్త్రం, విశ్వనిర్మాణ శాస్త్రం, సంగీతం... వంటి వాటిలో ఆయనకున్న నైపుణ్యం పరంగా చూస్తే, మనిషిగా కేవలం ఒకే ఒక వ్యక్తికి జీవితం పట్ల ఇంత విస్తారమైన అవగాహన ఉండటం అసాధ్యం. మేధస్సు పరంగా నేటి శాస్త్రవేత్తలు పతంజలి ముందు పిల్లకాయల్లాగా కనిపిస్తారు. ఎందుకంటే జీవితం గురించి చెప్పగలిగేదంతా ఆయన చెప్పేశారు. మీరు ఏది చెప్పాలని ప్రయత్నించినా, అది ఆయన ఇదివరకే చెప్పేశారు. ఆయన ఎవరికీ ఏదీ చెప్పటానికి మిగల్చలేదు. ఇది అన్యాయం! -
యోగా ఎలా మొదలైంది?
యోగా పదిహేనువేల సంవత్సరాల కింద హిమాలయాలలోని ఎగువ ప్రాంతాలలో ఒక యోగి ప్రత్యక్షమయ్యారు. ఆయన నిశ్చలంగా కూర్చుని ఉన్నారు. ఆయన ఎవరో, ఎక్కడనుంచి వచ్చారో ఎవరికీ తెలియదు. ఆయన సమక్షం చాలా అసాధారణంగా ఉండటం వల్ల చాలా మంది ప్రజలు ఆయన చుట్టూ గుమిగూడారు. ఏదో అద్భుతం జరుగుతుందన్న ఆశతో వారంతా నెలల కొద్దీ వేచి చూసారు. అప్పుడప్పుడు ఆయన కనుల నుండి వెలువడే ఆనందభాష్పాలు తప్ప, ఆయన జీవించే ఉన్నారు అన్నదానికి వేరే సంకేతాలేమి లేవు. - జగ్గీ వాసుదేవ్ అంతకు ముందుకానీ, ఆ తరువాత కానీ మానవ చేతనను పెంపొందించడానికి అంతకన్న గొప్పగా దోహదపడినవారు ఎవరూ లేరు. ఒకరు అలా నెలల తరబడి కేవలం కూర్చుని ఉన్నారంటే అతను భౌతిక విషయాలచే ఇక ఏ మాత్రం శాసించబడటం లేదని అర్థం. అదే అద్భుతం కదా! కాని అది వారు గ్రహించలేకపోయారు. అందువల్ల ఒక ఏడుగురు తప్ప అందరూ వెళ్లిపోయారు. వారు ఆయనను, ‘మీకు తెలిసింది ఏమిటో, మాకూ తెలుసుకోవాలని ఉంది!’ అంటూ అభ్యర్థించారు. ఆయన వాళ్ళను పట్టించుకోలేదు. కాని వాళ్ళు అక్కడే ఉండిపోయారు. వారి పట్టుదలను చూసిన వారికి ఆయన ఒక చిన్న ప్రక్రియను భోధించారు. ఏడుగురూ దానిని ఎంతో అభ్యాసం చేసారు. రోజులు వారాలయ్యాయి, వారాలు నెలలు అయ్యాయి, నెలలు సంవత్సరాలు అయ్యాయి. 84 ఏళ్ళ సాధన తరువాత ఆదియోగి మళ్ళీ వారిని చూడటం జరిగింది. వారు తేజోవంతులుగా, తన దగ్గర ఉన్నదాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉండడాన్ని ఆయన గమనించారు. ఇక ఆయన వారిని పట్టించుకోకుండా ఉండలేకపోయారు. తర్వాత పౌర్ణమినాడు ఆయన దక్షిణంవైపునకు తిరిగి ఆ ఏడుగురికీ గురువుగా కూర్చున్నారు. ఆ రోజు ఆదిగురువు ఆవిర్భవించారు. అంటే ఆదియోగి ఆదిగురువుగా మారారు. ఇప్పటికీ ఆ రోజుని మనం గురు పూర్ణిమగా జరుపుకుంటున్నాం. ఎందుకంటే మానవ చరిత్రలో మొట్టమొదటిసారిగా కృషితో మనిషి క్రమంగా పరిణామం చెందగలిగే అవకాశాన్ని ఆయన కల్పించారు. అంతకు ముందుకానీ, ఆ తరువాత కానీ మానవ చేతనను పెంపొందించడానికి అంతకన్న గొప్పగా దోహదపడినవారు ఎవరూ లేరు. ఆదియోగి వారికి యోగ శాస్త్రాన్ని బోధించడం ఆరంభించారు. అందులోని ఏడు విధానాలను ఏడుగురికీ బోధించారు. మానవ జీవిత నిర్మాణాన్నీ, అది పనిచేసే విధానాన్నీ బోధించారు. మానవుడు ముక్తి పొందడానికి 112 మార్గాలను, స్పష్టమైన పద్ధతులతో అందజేసారు. ఆ సప్తరుషులను మధ్య ఏషియా, దక్షిణ అమెరికా, ఉత్తర ఆఫ్రికా, ఆగ్నేయ ఏషియా, హిమాలయ దక్షిణ ప్రాంతాలను పంపారు. ఒకరు ఆయనతో ఉండిపోయారు. ఆఖరివారు దక్షిణ భారతానికి వచ్చారు. ఆయనే అగస్త్యులవారు. ఆయన దక్కను పీఠభూమికి దక్షిణంగా ఉండే ప్రతి జనావాసానికీ ఆధ్యాత్మిక ప్రక్రియను బోధన, తత్వం, మతంలా కాకుండా - ఒక జీవన విధానంలా అందేట్లు చూశారు. ఈ రోజుకు కూడా మన సంస్కృతిలో ఆయన చేసిన కృషి కనిపిస్తుంది. రిపోర్టింగ్: భువనేశ్వరి -
ఒళ్లు విల్లు మది హరివిల్లు!
యోగా అదృష్టవశాత్తూ భారతభూమి యోగాకు పుట్టినిల్లు. కాలం అత్యాధునికమైనకొద్దీ సంభవిస్తున్న జీవనశైలి రుగ్మతలకు విరుగుడు ఆ అతి ప్రాచీన విధానంలో దొరకడం ఒక విచిత్రం! ఆనందం కూడా! యోగా మనదగ్గరే ఉంది కాబట్టి. జగ్గీ వాసుదేవ్ వాణి, మంచు లక్ష్మీప్రసన్న బాణి.... ఇవీ ఇకముందు ఈ పేజీల్లో మిమ్మల్ని పలకరించబోతున్నాయి. ఈ అరుదైన కాంబినేషన్లో యోగా తరగతులు ఫన్డే పాఠకులకు ప్రత్యేకం... యోగా అనేది మన దేశం మనకిచ్చిన వరం. గత పదేళ్లుగా నేను యోగా చేస్తున్నాను. యోగా అనేది కేవలం శరీరానికి సంబంధించిన ప్రక్రియ మాత్రమే కాదు. మనసుకి చెందింది. ముందుగా యోగా ప్రభావం మన మానసిక స్థితిపై ఉంటుంది. మనసుకి, శరీరానికి మధ్య ఒక వంతెన వేసేదే యోగా. నన్ను చూసి మరో పదిమంది యోగా నేర్చుకోడానికి ముందుకి వస్తారని ఆశిస్తున్నాను. - మంచు లక్ష్మి అసలు యోగా అంటే ఏమిటి? యోగా అన్నప్పుడు చాలా మంది శరీరాన్ని అసాధ్యమైన భంగిమల్లో తిప్పడం అని అర్థం చేసుకుంటారు. యోగా అంటే శరీరాన్ని మెలికలు తిప్పటం లేక తల్లకిందులుగా ఉంచడం కాదు. యోగా అనేది ఒక వ్యాయామ పద్ధతి కాదు. అది మనిషిని తను చేరుకోగల అత్యున్నత స్థితికి చేరేవేసే ఒక సంపూర్ణ సాంకేతిక పరిజ్ఞానం. అసలు ‘యోగా’ అంటే ‘ఐక్యం’ అని అర్థం. మీరు అన్నింటితో ఐక్యం అయితే అదే యోగా! అయితే అన్నీ ఒకటి ఎలా కాగలవు? ఈరోజు ఆధునిక విజ్ఞాన శాస్త్రం మొత్తం అస్థిత్వం కూడా ఒక్కటే శక్తి అనీ, అదే లక్షల కొద్ది మార్గాలలో వ్యక్తమవుతుంది అనీ చెబుతోంది. ప్రపంచ మతాలు కూడా ‘దేవుడు అంతటా ఉన్నాడు’ అని చెబుతున్నాయి. ఒకటే సత్యాన్ని వేరే విధంగా వ్యక్తపరిచారు. ఒక శాస్త్రవేత్త దాన్ని గణితపరంగా తెలుసుకున్నాడు. ఒక ఆధ్యాత్మిక వ్యక్తి దాన్ని నమ్ముతాడు. కానీ ఈ ఇద్దరు దాన్ని అనుభవించలేదు. ఒక యోగి ఇలా గణితపరంగా తెలుసుకోవడంతో గానీ లేదా నమ్మడంతో గానీ సంతృప్తి చెందడు. అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి అనుకుంటాడు. ఇప్పుడు ఈ ప్రపంచంలో హఠయోగా అభ్యసిస్తున్న పద్ధతిని చూస్తే చాలా బాధ కలుగుతుంది. కేవలం భౌతిక అంశానికి మాత్రమే ప్రాముఖ్యత ఇస్తున్నారు. మీరు కేవలం ఆరోగ్యంగా ఉండాలి అని కోరుకుంటే ‘టెన్నిస్ ఆడండి లేదా నడవండి’ అని నేనంటాను. యోగా అనేది ఒక వ్యాయామం కాదు. దానిలో ఇతర పార్శ్వాలు ఉన్నాయి. దీనిని చాలా సున్నితంగా చేయాలి. చాలామంది సరైన యోగాని చేయకపోవడం వల్ల మానసిక సమతుల్యతను కోల్పోయారు. యోగా ప్రమాదకరమైనది కావటం వల్ల అలా జరగలేదు. కేవలం మూర్ఖత్వం వల్ల అలా జరిగింది. మూర్ఖత్వం ఎప్పుడూ ప్రమాదకరమే. మీరు దేనినైనా మూర్ఖంగా చేస్తే దాని వల్ల మీకు హాని కలుగుతుంది. హఠ యోగాని సరైన వాతావరణంలో, నమ్రతతో, మనమందరం ఒక్కటే అనే భావనతో నేర్పితే, అది మీ శరీరమనే పాత్రని దివ్యత్వాన్ని అందుకోవటానికి సిద్ధపరిచే ఒక అద్భుతమైన ప్రక్రియ అవుతుంది. హఠయోగా లోని కొన్ని పార్శ్వాలు ఇప్పుడు ప్రపంచంలో పూర్తిగా కనుమరుగైపోయాయి. నేను ఆ పార్శ్వాలను తిరిగి అందించాలనుకుంటున్నాను. ఇది చాలా శక్తివంతమైన జీవన మార్గం. ఇది ఎవరి మీదో అధికారం చలాయించే శక్తి కాదు. ఇది జీవితాన్ని తెలుసుకునే శక్తి. ప్రేమాశీస్సులతో సద్గురు రిపోర్టింగ్: భువనేశ్వరి -
వివేకం: మీ పథకం ప్రకారమే మీ జీవితం సాగాలా?
మీ పథకానికి, మీ ఆకాంక్షలకు మించి ఇంకా ఎంతో ఉన్నతంగా మీ జీవితం సాగాలని ఎప్పుడూ కలలు కనండి. పథకం అంటే ముందస్తు ఆలోచన. మన ఆలోచనలన్నీ మనకు ఇంతకు ముందుగా తెలుసున్న దాన్నుంచే వస్తాయి. అంటే గతంలోని ఓ భాగాన్ని తీసుకొని దానికి మెరుగులు దిద్దడంగా ప్రణాళికను చెప్పుకోవచ్చు. ఇది చాలా హీనమైన జీవన విధానం. వాస్తవానికి మనకు ప్రణాళిక అవసరమే. కానీ మీ ప్రణాళిక ప్రకారమే మీ జీవితం సాగుతున్నదంటే, మీరు చాలా హీనమైన జీవితాన్ని గడుపుతున్నారన్నమాట. అలా కాక, మీరు ఊహించని రీతిలో మీ జీవితం సాగించాలి. ఎవరూ ప్రణాళికలు రచించలేనంత విస్తారమైనది జీవితం. ప్రణాళిక అనేదాన్ని వేసుకోండి, అయితే దానిని అలానే ఉంచి, జీవితాన్ని మాత్రం దాని తీరులోనే సాగనివ్వండి. ఎప్పటికప్పుడు జీవితం అందించేవాటిని శోధించి చూడండి. ఏమి ఎదురౌతుందో మీరు ఊహించలేరు. మరెవరికీ ఇంతవరకూ సంభవించనిదేదో మీకు జరగవచ్చు. మీ పథకం ప్రకారమే మీ జీవితం సాగుతున్నట్టయితే, ఇంతవరకూ ఈ ప్రపంచంలో జరుగుతూ వచ్చిన పనికిమాలినవే మీ జీవితంలోనూ సంభవిస్తాయి. మీకు ఇప్పటికే తెలిసున్న గత అనుభవాలు, సమాచారాల ఆధారంగా ప్రణాళికలు రూపుదిద్దుకున్నవి కాబట్టి జీవితంలో కొత్తదనమనేదే ఉండదు. అందువల్ల ప్రణాళికా రచన ఏమేరకు జరగాలనేది మీకు కచ్చితంగా తెలిసి ఉండాలి. అసలు మీకు ఎటువంటి ప్రణాళికా లేనట్టయితే, రేపేమి చేయాలనేదానిపై మీకేమీ అవగాహన ఉండదు. అందువల్ల ఏవిధంగా ప్రణాళిక వేసుకోవాలి, ఏ మేరకు దాన్ని పక్కకు పెట్టి జీవించాలి అనేది విజ్ఞతతో, సమతుల్యతతో సాగించాల్సిన ప్రక్రియ. ఎటువంటి గొప్ప ఆలోచనలూ లేకుండానే చాలామంది ప్రణాళికలు వేస్తుంటారు. వారి ప్రణాళికలన్నీ, జీవితంలోని అనూహ్య పరిణామాలను ఎదుర్కోలేని నిస్సహాయత, భయాల నుంచి రూపుదిద్దుకొనేవే. తమ జీవితాలు ఎలా సాగాలని భావిస్తున్నారో ఆ రకంగా సాగకపోవడమే మానవాళికి ఎదురవుతున్న బాధ. ఉదయం కాగానే కాఫీ తాగాలనిపిస్తుంది. కానీ కాఫీ తయారు కాలేదు. దానివల్ల బాధ. అదే సమయంలో సూర్యోదయం అవుతుంటుంది. దాన్ని మీరు చూడరు. ఆ రకంగా ఆ అద్భుత దృశ్యాన్ని చూసే అవకాశాన్ని మీరు కోల్పోతున్నారు. మీరనుకొన్న పనికిమాలినదేదో జరగని తరుణంలో, దానికన్నా చాలా ఉత్కృష్టమైనదేదో జరిగిపోతుంటుంది. రేపు గురించి మీరు ప్రణాళికలు వేసుకోవచ్చు. కానీ ఈ విశ్వాంతరాళాల్లో, మీ చుట్టూ సాగే జీవిత నృత్యంలో మీ ప్రణాళిక చాలా అత్యల్పమైనది. అందువల్ల మీ పథకాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వద్దు. మనకు ప్రణాళికలు అవసరమే. రేపు ఉదయం చేయాల్సినదేమిటో తేల్చుకోవడానికి అవి కావాలి. కానీ, ఆ పథకం ప్రకారమే మీ జీవితం తు.చ. తప్పకుండా నడవాలని కోరుకోవద్దు. మీ ఆకాంక్షలు, మీ ఊహాపోహలు, మీ ప్రణాళికలకు అతీతంగా మీ జీవితం సాగిపోయేట్లు ఎప్పుడూ కలలు కంటూ ఉండండి. సమస్య - పరిష్కారం సంస్కృతి వేగంగా మారిపోతోంది. దీన్ని ఆపడం ఎలా? - ఎస్.భూపతి, కరీంనగర్ సంస్కృతి ఒక సామాజిక కట్టుబాటు. వాతావరణ పరిస్థితుల వల్లో, ఇతర ప్రభావాల వల్లో ఒక ప్రత్యేక రీతిలో వారు జీవిస్తారు. భారతీయ సంస్కృతి మనుషుల్ని క్రమంగా ఆధ్యాత్మిక బాట పట్టేట్లుగా మలచబడింది. ఈ పద్ధతులు, కట్టుబాట్లు మీ జీవితంలోకి ఎందుకొచ్చాయంటే, వాటివల్ల మానవ సంక్షేమానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి కనుక. కానీ ఇప్పుడు కొన్ని వ్యాపార శక్తులు తమ ప్రయోజనాల కోసం ప్రతిదాన్నీ మార్చాలనుకుంటున్నాయి. చాలా కంపెనీల్లో ఉత్పత్తి శాఖల కంటే మార్కెటింగ్ శాఖలు పెద్దవిగా ఉన్నాయి. వీటికి తోడు, మత శక్తులు సంస్కృతిని మార్చడం కోసం, ప్రచారం చేస్తున్నాయి. ఎక్కడైనా మార్పు ఆపే ప్రయత్నం జరిగినా, అది చాలా మోటు పద్ధతుల్లో జరుగుతోంది. అందుకే అందరూ దాన్ని అసహ్యించుకుంటున్నారు. మంచివాళ్లు మాట్లాడటం మొదలుపెడితే, కొంత అవగాహన తెస్తే, ఈ వీధి రౌడీలకు పని ఉండదు. - జగ్గీ వాసుదేవ్ -
వివేకం: మీకందిన మొదటి కానుక మీ శరీరం
శరీరమంటే బాధేనని చాలామంది ఓ అభిప్రాయానికి వచ్చేశారు. శరీరం బాధేమీ కాదు. శరీరంతో ఎంతో చక్కగా కూడా ఉండవచ్చు. మీరు ఎక్కడికి వెళ్లినా, ఏం చేసినా దీన్ని మోసుకుంటూ తిరగాల్సిన అవసరం లేకుండా ఇది మీతో తేలిపోతూ ఉండేలా చేసుకోవచ్చు. కేవలం ఆహారంతో, సాధనతో, మీ దృక్పథంలో కొద్ది మార్పులతో, ఈ శరీరం ఓ అద్భుతంగా మారడం మీరు చూడవచ్చు. మీరు దీన్నో యంత్రంగా చూసినా, ఇది భూమి మీద ఉన్న ఓ అత్యాధునిక యాంత్రిక వ్యవస్థ అనే సంగతి అర్థమవుతుంది. ప్రపంచంలోని అన్ని సూపర్ కంప్యూటర్లూ కూడా దీంతో సరిపోలవు. ప్రపంచంలోని కంప్యూటర్లన్నింటినీ కలిపిన దానికంటే నూరు రెట్లు ఎక్కువగా శరీరంలో ఒక కణంలోని డీఎన్ఏ పనిచేస్తుంది. మీ సృష్టికర్త ఎవరైతేనేం, ఆయన మీకు అద్భుతమైన శరీరాన్ని ఇచ్చాడు. మీకిచ్చిన మొదటి కానుక భౌతికమైంది. మీరు దీన్ని దుర్వినియోగం చేస్తున్నట్లు ఆయన గమనిస్తే, మీకు దీన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలియకపోతే, ఇక మీకు మరిన్ని కానుకలిచ్చి ఉపయోగం లేదని ఆయన అర్థం చేసుకుంటాడు. అందువల్ల మీరు ఈ శరీరాన్ని ఆనందదాయకంగా ఉంచుకోవడం అన్నిటికన్నా ప్రధానం. కొన్ని పదార్థాలు తింటే శరీరం ఆనందంగా ఉంటుంది. మరికొన్ని తింటే శరీరం మందకొడిగా తయారై, మీ నిద్రను మరికొంత పెంచుతుంది. మనం రోజుకు ఎనిమిది గంటలు నిద్రపోతామనుకోండి. అంటే మనం బతికే అరవయ్యేళ్లలో ఇరవై ఏళ్లు నిద్రలోనే గడిపేశామన్న మాట. అంటే మన జీవితంలో మూడవ వంతు కాలాన్ని నిద్రలో గడిపేశామన్న మాట. మిగిలిన జీవితంలో 30 నుంచి 40 శాతం తినడానికీ, కాలకృత్యాలు తీర్చుకోవడానికీ సరిపోతుంది. ఇక జీవితానికి మిగిలిందేమిటి? జీవితానికి సమయమే లేదన్న మాట! ఎవరూ తమ నిద్రతో ఆనందించలేరు. అసలు నిద్రలో మీరుండరు. మీరు ఆనందించగలిగింది మీ విశ్రాంతి సమయంలోనే. శరీరానికి బాగా విశ్రాంతినిస్తే మీకు ఆనందంగా ఉంటుంది. శరీరాన్ని విశ్రాంతిగా ఉంచడం ఎలా? మొదటగా, అసలు దీనికి శ్రమ ఇవ్వడం దేనికి? చాలావరకూ పని కారణంగా శరీరం అలసిపోవడం లేదు. బాగా పనిచేసేవాళ్లు బాగా చురుకుగా ఉంటారు. ఆహారం ఇందులో ప్రధానపాత్ర పోషిస్తుంది. ఆలోచనా ధోరణి కూడా కారణం కావచ్చు. కానీ, ఆహారమే ప్రధాన పాత్ర పోషిస్తుంది. మీరు కనుక చెడు పదార్థాలు తింటే, మీరు మీ శరీరాన్ని తోసుకుంటూ తిరగాలి. మీరు గనుక సరైన ఆహారం తీసుకుంటే, మీ శరీరం మీకన్నా ముందుంటుంది. శరీరం ఉండాల్సిన తీరు అదే! సమస్య- పరిష్కారం మీరెందరో స్వచ్ఛంద కార్యకర్తలను తయారుచేశారని విన్నాను. ఎలా చేయగలిగారు? - డి.గోపాల్, వరంగల్ సద్గురు: స్వచ్ఛందమంటే ఇష్టపడి చేయటం. జీవితాన్ని పూర్తిగా అంకితం చేయడం. చాలామంది తమకు అనుకూలంగా ఉంటే ‘సరే’ అంటారు. అనుకూలంగా లేకపోతే ‘లేదు’ అంటారు. దానివల్ల ఫలితముంటే సరేనంటారు. లేకపోతే కాదంటారు. స్వచ్ఛందమంటే అతను దాన్ని వదులుకున్నాడు. అది తనకు అత్యంత ప్రధానమైన ‘నాకేం లాభం’ అనే లెక్కనే వదులుకున్నాడు. ఈ ఒక్క లెక్కనీ మనిషి వదులుకోగలిగితే, ‘దీనివల్ల నాకు ఉపయోగమేమిటి?’ అనే భావనను వదులుకుంటే, అతను ఓ అద్భుతం అయిపోతాడు. నేను మొదటి నుంచీ దీన్నే జనానికి చూపిస్తున్నాను. మన లాభాపేక్షకు అతీతంగా మరేదో ఉంది. అదేమిటన్నది చాలామంది తెలుసుకోవడానికి ప్రయత్నించరు. స్వచ్ఛంద సేవకులు చిత్తశుద్ధితో పనిచేస్తారు. తమను తాము అర్పించుకోవడానికి సిద్ధపడే జనం మధ్య మనం ఉండటం నిజంగా గొప్ప అదృష్టమనే చెప్పాలి. మనిషి ఇందులో ఎంతో ఆనందం పొందుతాడు. మనిషికి ఇంతకన్నా మించిన అదృష్టం మరొకటి ఉండదు. - జగ్తీ వాసుదేవ్ -
వివేకం: కృతజ్ఞత తెచ్చిపెట్టుకునేది కాదు
కృతజ్ఞతాభావం అంటే ఏమిటి? మీ కళ్లను మీరు బాగా తెరిచి మీ చుట్టుపక్కల ఉన్న జీవితాన్ని చూస్తే, మీ జీవితం గడవడానికి మిగతా వాటి ప్రమేయం ఎంత ఉందో మీరు స్పష్టంగా చూస్తే, మీకు కృతజ్ఞతాభావం కలగకుండా మానదు. మీ ఎదురుగా పళ్లెం నిండా ఆహారం ఉందనుకుందాం. ఆ ఆహారం అక్కడకు రావడానికి ఎంతమంది పనిచేస్తుంటారో మీకు తెలుసా? విత్తనాలు నాటిన రైతు దగ్గరి నుండీ, ఆ భూమి మీద జరిగే ఎన్నో సంఘటనలు, కోత కోసేవారు, షాప్‌కు తెచ్చేవారు, దాన్ని అమ్మేవారు, దాన్ని అక్కడి నుంచి కొనేవారు, వండేవారు, వడ్డించేవారు... ఇలా దీనిలో ఎంతమంది ప్రమేయం ఉందో చూడండి. నేను దీనికి డబ్బు చెల్లించా కాబట్టి, నాకది వచ్చి తీరాల్సిందే అని కాకుండా, మీ ఊపిరి మొదలుకొని ఆహారం వరకూ మీ జీవితంలో మీరు ఆస్వాదించే అనుభూతి చెందే ప్రతి విషయాన్నీ ఈ విధంగా చూడండి. ఈ మొత్తం ప్రక్రియలో మనుషులు లేకపోయినా లేదా ఉన్నవాళ్లు చేయాల్సింది చేయకపోయినా ఏమీ జరగవు. భూగ్రహం, ఈ గ్రహానికి ఆవల ఉన్న ప్రాణులు కూడా మిమ్మల్ని ఎలా పోషిస్తున్నవో, ఎలా సాయపడుతున్నవో మీరు కళ్లు తెరిచి, చూడండి. మీరు ఇదంతా చూస్తే అప్పుడు కృతజ్ఞతాభావాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉండదు. కృతజ్ఞత అనేది తెచ్చిపెట్టుకునే ఒక గుణం కాదు. మీకు అందుతున్న వాటన్నింటినీ చూసి, మీరు తబ్బిబ్బైనప్పుడు, మీ నుంచి పెల్లుబికే భావన కృతజ్ఞత. అది తెచ్చిపెట్టుకునే గుణమైతే, ఘోరంగా ఉంటుంది. కృతజ్ఞతంటే కేవలం ‘థాంక్యూ, థాంక్యూ’ అని అనడం కాదు. ప్రస్తుతం మీరు జీవించి ఉండటానికీ, క్షేమంగా ఉండటానికీ సృష్టిలో ఉన్న అనేకం తోడ్పడుతున్నాయి. మీరు వాటిని కేవలం సంఘటనలుగా గమనించినా, ఆ మనుషుల మీద, వస్తువుల మీద కృతజ్ఞతాభావం ఉప్పొంగక మానదు. మీకు వారితో ఎటువంటి సంబంధం లేకపోయినా, తెలియకపోయినా మీ జీవితంలోని ప్రతి క్షణానికీ వారు అన్నీ ఇచ్చారు. కాబట్టి, మీరు కళ్లు తెరిచి మీ చుట్టూ ఉన్న జీవితం ఎలా జరుగుతోందో చూస్తే, మీరు కృతజ్ఞతాభావంతో ఉండకుండా ఎలా ఉంటారు? మీరు మరీ గర్వంతో జీవిస్తూ, ఈ భూమికే రాజునని అనుకుంటే, మీరు ప్రతిదీ కోల్పోతారు. మీరు పూర్తిగా మీ గురించిన ఆలోచనలతోనే నిండిపోయి ఉంటే, మీరు మొత్తం జీవన ప్రక్రియనే అనుభవించలేరు. అలా కాకుండా, మీరు పూర్తి గమనికతో ఉంటే, కృతజ్ఞతతో ఉప్పొంగిపోతారు. మీరు కృతజ్ఞతతో ఉంటేనే, మీరు ఏదైనా స్వీకరించడానికీ అర్హులుగా ఉంటారు. మీకు ఎవరిపట్లయినా కృతజ్ఞతాభావం ఉంటే, మీరు వాళ్లని గౌరవంగా చూస్తారు. మీరు దేన్నైనా గౌరవంగా చూస్తే, మీరు చాలా స్వీకారభావంతో ఉంటారు. మొత్తం యోగా ప్రక్రియ ఉద్దేశ్యమంతా మీకు కూడా తెలియని ఎన్నో రీతులలో లోతుగా, లోలోతుగా మిమ్మల్ని స్వీకారభావంతో ఉండేలా చేయడమే. అదే దాని లక్ష్యం. కాబట్టి, కృతజ్ఞతతో ఉప్పొంగిపోవడమే స్వీకార భావంతో ఉండటానికి ఒక అందమైన దారి. సమస్య - పరిష్కారం పిల్లలు వీడియో గేమ్‌లు, మొబైల్ గేమ్‌లకు అలవాటు పడిపోతున్నారు. ఇవి పుస్తకాలకు ప్రత్యామ్నాయమా? - జి.కరుణ, హైదరాబాద్ సద్గురు: పుస్తకాలు చదవడం ఒక సంస్కృతిగా ప్రోత్సహించాలి. చదవడం ఎంతో గాఢమైనది, లోతైనది. చూసేదాని కన్నా చదవటంలో ఎంతో గంభీరత ఉంది. పుస్తకాలు చదివేవారు ప్రశాంత చిత్తులూ, జీవితం గురించి మరింత లోతుగా ఆలోచించేవారూ కాగలుగుతారు. చదువులో వారు చేసేది ఒక రకమైన ధారణ. మీ మనసుని దేనిలోనో కేంద్రీకరించడమే ధారణ అంటే. అది మెదడు పనిచేసే విధానాన్ని వృద్ధి చేస్తుంది. ప్రస్తుతం ఈ ఎలక్ట్రానిక్ ఉపకరణాలు అన్నింటినీ అధిగమిస్తున్నాయి. అటువంటి పరిస్థితులలో మనం ఈ పుస్తక పఠనం మానకుండా ఉండటం ముఖ్యం. ప్రస్తుతం ప్రజలు జీవితాన్ని గాఢంగా అర్థం చేసుకోలేకపోతున్నారు. జీవితంలోని గంభీరత లోపిస్తున్నది. అందరూ పైపైనే చూస్తున్నారు. దృశ్య శ్రవణ సాధనాలే దానికి కారణం అనుకుంటాను. వాటికి నేను వ్యతిరేకం కాను, కాని అవి చదువుకి ప్రత్యామ్నాయం కావు. -
వివేకం: ఈతరం మితం ఏంటో తెలుసుకోవాలి!
మనం ప్రతిదాన్ని అతిగా చేయడం అలవాటు చేసుకున్నాం. తినడం లాంటి మామూలు ప్రక్రియలను కూడా ఎక్కడ ఆపాలో తెలియడం లేదు. ఒకటి మంచి చేస్తుందని అనుకుంటే, అదే ఎక్కువగా ఉంటే బాగుంటుందనే మూర్ఖత్వంలోకి వెళతాం. ఆక్సిజన్ కూడా మనలోకి మరీ ఎక్కువగా వెళితే అపాయమేనన్నది సాధారణ శాస్త్రీయ జ్ఞానం. ఒకసారి ఏం జరిగిందంటే, శంకరన్ పిళ్లై ఒక్కగానొక్క కొడుకు ఐటీ ప్రొఫెషనల్‌గా ఆఫ్రికా వెళ్లాడు. అక్కడ అతను అవీ ఇవీ శోధిస్తూ ఒక భూత వైద్యుణ్ని కలిశాడు. ఈ భూత వైద్యుడు ఎన్నో అద్భుతాలని చేస్తాడని అతని స్నేహితుడు చెప్పాడు. దాంతో ఇండియాలో ఉన్న తన తల్లిదండ్రులకు మంచి జరిగే విధంగా ఈ భూత వైద్యుడి దగ్గరి నుంచి ఏదైనా అతను తీసుకోవాలనుకున్నాడు. తన తండ్రి శంకరన్ పిళ్లై ఎప్పుడూ యవ్వనంతో ఉండాలని కోరుకుంటుంటాడని ఇతనికి తెలుసు. అందుకే నా తల్లిదండ్రుల వయసు తగ్గించడానికి ఏదైనా ఉందా అని అడిగాడు. భూత వైద్యుడు ఉంది అని, కొన్ని మాత్రలను ఇచ్చి, మీ నాన్నని ఒక మాత్రని తీసుకొమ్మని చెప్పు, దాంతో అతని వయసులో ఎన్నో యేళ్లు తగ్గిపోతాయి అన్నాడు. ఆ మాత్రలని కొడుకు ఇండియాకు పంపాడు. ఆరు నెలల తరువాత ప్రాజెక్ట్ అయిపోవడంతో ఇండియా తిరిగొచ్చాడు. అతను ఇంటికొచ్చేసరికి, మంచి యవ్వనంలో ఉన్న ఓ యువకుడు చేతుల్లో చిన్నబిడ్డతో అతనికి కనిపించాడు. నా తల్లిదండ్రులు ఎక్కడ అని అతనడిగాడు. యువకునిగా మారిన శంకరన్ పిళ్లై నేనే నీ తండ్రిని, నువ్వు పంపిన మాత్ర ఒకటి తీసుకోగానే నేను యువకునిగా మారాను, ఆ మాత్ర నా వయసు ఎన్నో ఏళ్లు తగ్గించింది అన్నాడు. కానీ అమ్మెక్కడ అని అతనడిగాడు. శంకరన్ పిళ్లై తన చేతుల్లో ఉన్న చంటి బిడ్డను చూపెడుతూ తను మూడు మాత్రలు తీసుకుంది అన్నాడు. ఇప్పుడు జరుగుతోంది ఇదే. మనం ఏది మొదలుపెట్టినా దానిని వినాశనానికి తీసుకెళుతున్నాం. భౌతిక శాస్త్రం మనకు అందించిన ఎన్నో అద్భుతమైన విషయాలను మానవాళి వినాశనానికి, దుఃఖానికి కారణమయ్యే పరికరాలుగా మార్చుకుంటున్నాం. మానవ కల్యాణం చేకూరుస్తుందన్న నమ్మకంతో మనం భౌతిక శాస్త్రాలని, సాంకేతిక విషయాలని అంతగా శోధించాం. అవి మనకు ఎన్నో సౌకర్యాలను అందించాయి. అయినా, మానవులు బాగున్నారని చెప్పలేం. ఎందుకంటే వారు ఎన్నో యేళ్ల క్రితం జీవించిన వారికన్నా మరింత శాంతి, ఆనందం, ప్రేమలతో లేరు. బాహ్యమైన శాస్త్ర సాంకేతికతలకు భారీ మూల్యం చెల్లించాలి. తయారుచేసేది గుండుసూదైనా, గొప్పయంత్రమైనా, అది మీరీ భూమి నుండే తవ్వి తీయాలి. ఎక్కడ ఆపాలో మనకు తెలియకపోతే, ఈ శాస్త్ర, సాంకేతికతలు కచ్చితంగా మానవాళికి మహా విపత్తుగా మారబోతున్నాయి. పూర్తిగా మానసిక పరిపక్వత లేని మానవుల చేతికి ఏదిచ్చినా ప్రమాదమే. తాము వాడే పరికరాలు శక్తిమంతంగా, సమర్థంగా అయ్యేకొద్దీ వారు మరింత ప్రమాదకరంగా మారుతారు. శాస్త్రమో లేదా సాంకేతికతో ప్రమాదకరమైనవి కాదు. మానవ మూర్ఖత్వమే భూమి మీద ప్రమాదకరమైనదిగా ఎల్లప్పుడూ ఉంటూ వస్తోంది. సమస్య - పరిష్కారం ప్రశ్న: సంసారిక జీవనంలో ఉన్న నామీద ఎంతో మంది ఆధారపడున్నప్పుడు బంధాల నుండి విముక్తమవడమెలా? - కె.జగన్నాథం, ఏలూరు సద్గురు: మీ శరీరాన్ని బంధాల నుండి విడిపించలేరేమో కానీ, మీ మనసును మాత్రం కచ్చితంగా విడిపించగలరు. ప్రస్తుతం మీరు సన్యాసాన్ని తీసుకొని, ఒక ఆశ్రమంలో జీవించలేరేమో - మీ భార్య, పిల్లలు మిమ్మల్ని అలా చేయనీయకపోవచ్చు. కానీ మీరు మానసికంగా స్వేచ్ఛగా ఉండేందుకు మిమ్మల్ని ఎవరైనా ఆపగలరా? స్వేచ్ఛగా ఉండటం కోసం మన జీవితాన్నో, మన పరిస్థితులనో పూర్తిగా తలకిందులు చేయాల్సిన అవసరం లేదు. ఒక పరిస్థితి మరొక పరిస్థితి కంటే మెరుగైనదేం కాదు. అన్నింటిలోనూ లాభ నష్టాలు ఉంటాయి. మీరు మీ అంతరంగంలో ఎలా ఉన్నారనేదే ముఖ్యమైన విషయం. మీ అంతరంగం, దివ్యత్వానికి నిచ్చెన కాగలదు. అది మిమ్మల్ని పరవశింపజేయగలదు. ఎన్నోసార్లు ఈ మనసు మిమ్మల్ని సంతోషపెట్టింది. మరెన్నోసార్లు ఇది మిమ్మల్ని దుఃఖంతో, భయంతో, ఆందోళనతో లేదా గందరగోళంతో నింపింది. ఈ రెండింటినీ అదే మనసు చేస్తోంది. ప్రస్తుతం ఈ మనసనే చిన్ని పరికరం మీ చేతుల్లో లేదు. మనసు ఏది తోస్తే అది చేస్తోంది. మీ కారు ఎక్కితే, మీరు పక్క ఊరికి చేరుకోవచ్చు లేదా నేరుగా ఒక చెట్టుకి ఢీకొట్టవచ్చు. కాబట్టి కారైనా, మనసైనా, నియంత్రణ మీ చేతిలోనే ఉంటే, మీరు ఎంతో దూరం ప్రయాణించగలుగుతారు. - జగ్గీ వాసుదేవ్ -
వివేకం: ఆడు! ఆటలాడు!!
శరీరారోగ్యానికి ముఖ్యమైనవి ఆటలు. స్కూల్లో చదువుకునే రోజుల్లో, నేను ఆడని ఆట లేదనే చెప్పాలి. తాడు పట్టుకుని పైకి పాకడం, శరీరాన్ని వంపులు తిప్పుతూ చేసే విన్యాసం, బాక్సింగ్, కబడ్డీ, బ్యాడ్మింటన్ దేన్నీ వదిలిపెట్టలేదు. నా చిన్నవయసులో ఎవరు క్రికెట్ ఆడుతున్నా వెళ్లేవాణ్ని. బ్యాటింగ్ లభించేది కాదు, ఫీల్డింగ్ దొరికేది. దాంతోనే ఎంతో సంతోషం. ఈ రోజుల్లో కూడా పిల్లలెవరైనా ఆటలాడుతుంటే, నాకు నేనే వెళ్లి వారి ఆటల్లో పాల్గొంటాను. కాలేజీలో చేరిన తర్వాత హాకీ జట్టులో చోటు దొరికింది. ఆ వయసులో మిగతా ఆటల్లో కన్నా, మోటర్‌బైక్ నడపడంలో, ఆకాశంలో ఎగరడంలో ఉత్సాహం ఉండేది. కొన్ని నిమిషాల పాటు గాలిలో ఎగరాలంటే, ఎన్నో గంటలు శిక్షణ అవసరమయ్యేది. నాకప్పుడు ఇరవై రెండేళ్ల వయసు. ఒకసారి, నీలగిరి కొండల మీద గ్లైడర్‌తో ఎగిరాను. ఎక్కడో, చాలా దూరాన దిగాను. సూర్యుణ్ని చూసి దిశను నిర్ణయించుకుని నడవడం మొదలుపెట్టాను. నడుస్తూ ఉన్నాను. రాత్రి, పగలు చూడకుండా నడుస్తూనే ఉన్నా. వెంట తెచ్చుకున్న ఒకే ఒక శాండ్విచ్ తినేశాను. ఆకలి తీరలేదు. అక్కడక్కడా ఒకటి రెండు గ్రామాలు కనిపించాయి. అక్కడి ప్రజలకు తమిళం తప్పించి మరో భాష తెలియదు. అప్పుడు నాకు తమిళం మాట్లాడ్డం రాదు. ఎలాగో, ఒక టీ కొట్టు కనిపించింది. వేడి వేడి ఇడ్లీలు కనిపించాయి. నా ఆకలికి పాతిక ఇడ్లీలు లాగించేద్దాం అనిపించింది. పర్సు చూసుకున్నాను.ఇలా ఎన్ని రోజులు పడుతుందో తెలియదు. అంత డబ్బూ ఖర్చు చేయలేక, రూపాయిన్నర ఖర్చుతో, రెండే రెండు ఇడ్లీలు తిని సరిపెట్టుకున్నాను. నా జట్టు మనుషులు, రెండున్నర రోజుల తర్వాత నన్ను కలిశారు. ఇంత జరిగినా, నాలో ఎగరాలనే ఆశ కొంచెం కూడా తగ్గలేదు. కరకు హృదయాలతో కఠిన కారాగార శిక్ష అనుభవిస్తున్న ఖైదీలను కూడా ఆటలు సహజమైన స్థితికి తీసుకురావడం కళ్లారా చూశాను. మొదటిసారి ఖైదీలను కలవడానికి పర్మిషన్ దొరికింది. చెరసాలలో అడుగిడగానే అక్కడి వాతావరణంలో తీరని శోకం ఉన్నట్లు తోచింది. దాదాపు 200 మందిని ఆటలాడుకునే మైదానానికి రమ్మని ఆహ్వానించాను. ‘‘పాఠాలు వినడానికి మిమ్మల్ని పిలవడం లేదు. మీతో బంతాట ఆడుకోవడానికే పిలిచాను’’ అన్నాను. వారి మొహాల్లో కొద్దిగా మార్పు గోచరించింది. ఆట ప్రారంభమైంది. మొదట తటపటాయించినా, పది పదిహేను నిమిషాల్లో వారు తమను తాము మర్చిపోయారు. పూర్తిగా ఆటలో లీనమైపోయారు. అరుస్తూ, ఒకరినొకరు తగులుకుంటూ, తోసుకుంటూ చిన్నపిల్లల్లా ఆటలో మునిగిపోయారు. ఆట ముగిసిన తర్వాత, నేను బయల్దేరే సమయంలో ‘వెళ్లకండి’ అంటూ, కొందరు నా చేతులు పట్టుకుని కన్నీటి పర్యంతమయ్యారు. ఆట మహాత్మ్యం అది. - జగ్గీ వాసుదేవ్ సమస్య - పరిష్కారం వృత్తిపరంగా నేను మరీ మంచిగా ఉంటే పనులు జరగడం లేదు. అందువల్ల కోపం నాకు మంచి మార్గమా? - ఎస్.గోపాల్, హైదరాబాద్ సద్గురు: మీరు ప్రపంచంలో చేసేవి వృత్తిలాగా చేయడం కన్నా ఔత్సాహికునిలా చేయడం, అంటే చేయడంలోని ఆనందం తెలియడం వల్ల చేసేవానిగా చేయడం మంచిది. ఔత్సాహికునిగా చేసేవాడు, చేయడంలోని అంతరార్థం తెలిసినవాడు. వృత్తిపరంగా చేసేవాడికి దాని విలువ తెలియదు. అతను అది చేయడానికి కారణం, ఆ చేయడం వల్ల అతనికేదో లాభం ఉంది కాబట్టే. అటువంటి జీవితం చాలా రసహీనమైంది. మీలో నిమగ్నత ఉంటే మీద్వారా సహజంగానే కొన్ని పనులు జరుగుతాయి. అది ఎంతో మనోహరంగా ఉంటుంది. నిమగ్నత లేకుండా చేసే పనులు వికృతంగా ఉంటాయి. అంటే మీరు వృత్తిలాగా చేస్తే, జీవితం వికారంగా ఉంటుంది. అదే ఔత్సాహికునిగా చేస్తే ఫరవాలేదు. అదే లాభాపేక్ష లేకుండా, స్వేచ్ఛగా చేస్తే, మీరు ఎంతో ఉత్సాహంగా చేయొచ్చు. అది మరింత అద్భుతం. మీరు వృత్తిపరంగా చేయడమే కాక, కోపం కూడా అదనపు చిక్కు. ఈ కోపం పాత్ర ఏమిటి? మీరు అలా చెబితే మనుషులు వినరు. వినాలంటే, దానికి నిమగ్నత కావాలి. మీరు ఎంతో నిమగ్నతతో, ఉత్సాహంతో చెబితే చుట్టూ ఉన్నవారందరూ స్పందిస్తారు. -
వివేకం: బాధ్యత బరువు కాదు!
సామాన్యంగా బాధ్యత అనగానే బరువు అనుకుంటారు. బాధ్యత అంటే తమ విద్యుక్తధర్మం అని తప్పుగా భావించడం వలనే ఇలా బరువు అనిపిస్తున్నది. చిన్నప్పటినుండే అందరికీ విద్యుక్తధర్మం అనే భావాన్ని పెంపొందించారు. కొడుకుని చదివించడం తండ్రి ధర్మం, వృద్ధులైన తల్లిదండ్రులను కాపాడటం కొడుకు ధర్మం, విద్యార్థులను తీర్చిదిద్దడం ఉపాధ్యాయుని ధర్మం, దేశాన్ని కాపాడటం రక్షణ సిబ్బంది ధర్మం అంటూ ధర్మం అనే మాటను మీ మనసులో బలంగా నాటుకుపోయేలా చేశారు. ‘నా ధర్మం నిర్వహిస్తున్నాను’ అనుకుంటూ ఏది చేసినా అలసటగా ఉంటుంది, దానివల్ల రక్తపు పోటు పెరుగుతుంది. ఒక పాదరక్షల ఫ్యాక్టరీని చూడటానికి యజమాని వచ్చాడు. ఒక కార్మికుడు అట్టపెట్టె అందుకుని, దానిమీద లేబుల్ అతికిస్తున్నాడు. మరో కార్మికుడు దానిలో ఒక పాదరక్షనుంచాడు. అతని తర్వాతి కార్మికుడు ఆ పెట్టెను మూసి, ముందుకు జరిపాడు. తరువాత అతను దాన్ని బండిలోకెక్కించాడు. ‘‘ఏం జరుగుతున్నదిక్కడ? చెప్పులను జతలుగా తయారుచేస్తున్నాం కదా. కాని పెట్టెలో ఒక చెప్పునే ఎందుకు పెట్టి పంపిస్తున్నారు?’’ అని కంగారుగా అడిగాడా యజమాని. ‘‘అయ్యా తీసుకుంటున్న జీతాని కన్నా ఇక్కడ ఎవరూ తక్కువ పనిచేయడం లేదు. ఎడం కాలి చెప్పు అందుకుని పెట్టెలో పెట్టే అతను ఈ రోజు సెలవులో ఉన్నాడు. అదే సమస్య’’ అని ఫ్యాక్టరీ మేనేజర్ సమాధానం. తమ విద్యుక్తధర్మాన్ని క్రమం తప్పకుండా నెరవేర్చే కార్మికులున్నప్పటికీ, ఇలా జరుగుతూ ఉంటే ఆ వ్యాపారం ఏమవుతుందో కాస్త ఆలోచించండి. పూర్తి బాధ్యత తీసుకోకుండా, డ్యూటీ చేస్తున్నామనుకుంటూ ప్రవర్తిస్తే, అది అభివృద్ధికి పనికిరాదు. త్వరలో మీరు విరక్తి, ద్వేషం, చిరాకు కలగలిసిన యంత్రంలా మారిపోతారు. ఎవరో చెప్పింది చేయడం కంటే, మీరే గ్రహించి బాధ్యతాయుతంగా చేస్తే ఈ బాధ ఉండదు.ముందు బాధ్యతను పనిగా భావించకుండా, దాన్ని మనస్ఫూర్తిగా అంగీకరించడానికి ప్రయత్నించండి. ఇష్టంగా, సంపూర్ణంగా బాధ్యతను స్వీకరిస్తే, ‘‘ఇది నాది. నాకు సంబంధించినది’’ అనే భావన కలుగుతుంది. అప్పుడది భారం కాదు. ఇది నా బాధ్యత అనుకున్నప్పుడు, ఈయన నా భర్త, నా గృహం, నా వాహనం అని భావిస్తారు. అలా అనుకోగానే పూర్తి ఆసక్తి కలుగుతుంది. అప్పుడది తేలిక అవుతుంది. ఏ భారమూ ఉండదు. మీరీ భూమిని తలపై పెట్టుకున్నారనుకుందాం. ఈ భూమి నాది అనే తలంపుతో ఉన్నంతవరకు, అది మీకు బరువుగా తోచదు. కాని, ‘నేను బాధ్యుడను కాను’ అనే భావనతో, ఒక చిన్న సూది తీసుకున్నా, అది బరువుగా ఉంటుంది. మనస్ఫూర్తిగా ‘నాది’ అని అనుకుంటున్నప్పుడు మీరు జీవితంతో ఇష్టంగా స్పందిస్తారు. ‘నేను బాధ్యుడను కాను’ అని అనుకుంటే వ్యతిరేకత, అయిష్టత కలుగుతాయి. జీవితంతో మనస్ఫూర్తిగా స్పందించేప్పుడు, ఆ మాధుర్యాన్నే స్వర్గం అంటున్నాం. ఇష్టం లేకుండా, వ్యతిరేక భావంతో స్పందిస్తున్నప్పుడు, దాన్ని నరకం అంటున్నాం. కాబట్టి స్వర్గం, నరకం మరణం తర్వాత కాదు - ఇక్కడే, ఇప్పుడే మీరు స్పష్టించుకోగలిగినవే. సమస్య - పరిష్కారం అందరూ నాకు అహం చాలా ఎక్కువ అంటారు. నా అహానికి భయమే కారణమా? నా అహాన్ని నేను ఎలా తెంచుకోగలను? -కె.ఎల్.శ్రీనివాస్, కావలి సద్గురు: దీనిని అటువైపు నుంచి చూడాలి. భయం వల్ల అహం కాదు, అహం వల్లనే భయం ఉంటుంది. అహం గాయపడుతుందేమోనన్న భయం అది. ఎవరో పరుషంగా దూషించినట్లు మనకు అనిపించేది - అహం వల్లే. మీకు మీరు ఒక పరిమితమైన సరిహద్దు గీసుకున్నారు. ‘నేను’ అనే దానికి ఒక గుర్తింపు పెట్టుకున్నారు. అందువల్ల, సహజంగానే భయం కలుగుతుంది. ‘నేను’ అని మీరు భావించుకునే వ్యక్తి, మీరు స్వయంగా సృష్టించుకున్న రూపమే. మీరు నిజంగా భయపడేది, శరీరాన్ని పోగొట్టుకుంటామని కాదు. మీరు స్వయంగా నిర్మించుకున్న ఈ వ్యక్తిత్వాన్ని పోగొట్టుకుంటామేమోనని మాత్రమే మీరు భయపడుతూ ఉంటారు. ఉదాహరణకు, మిమ్మల్ని అవమానానికి, దూషణకు గురిచేశామనుకోండి. అప్పుడు ఈ వ్యక్తికి మరణం వచ్చినట్లే అని మీరు భావిస్తారు. అటువంటి సందర్భంలో మరణమే నిజమైన వరం అనిపిస్తుంది. మీ ఈ గుర్తింపును మీరు ధ్వంసం చేయాలి. అప్పుడు ఇక హద్దులు, అహాలు, భయాలు ఉండవు. - జగ్గీ వాసుదేవ్ -
వివేకం: ఆదుర్దా వాస్తవం కాదు
మీరు ‘ఆదుర్దా’ అనేది ఏమిటంటే, ఫలితం ఏమౌతుందోనని ఆందోళన పడటం. దేని ఫలితమైనా మీ కోరికలపై ఆధారపడి ఉండదు. మీరు చేసే విధానాన్ని బట్టి ఫలితం నిర్దేశింపబడి ఉంటుంది. ప్రస్తుతం మీరు చేస్తున్న పనిలో మీరు ఎంత అసమర్థులైతే, మీ ఆదుర్దా అంత ఎక్కువగా ఉంటుంది. అవునా, కాదా? మీకు మోటారు సైకిలు నడపడం రాదనుకుందాం. మీరు దానిపై కూర్చుంటే ప్రతిక్షణం ఆదుర్దా. అదే మోటార్ సైకిల్ ఎలా నడపాలో తెలుసనుకోండి, అది ఒక కలలా ఉంటుంది. కాబట్టి మోటార్ సైకిల్ కాదు మీ ఆదుర్దాకి కారణం. కేవలం మీరు దాన్ని నడపలేకపోవడం అనేదే ఆదుర్దాకు కారణం. కాబట్టి మీ ఆదుర్దాని సరిచేసుకుందామని చూడకండి. ఆదుర్దా అనేది నిజం కాదు. అది కేవలం కొంత చేతగానితనానికి పరిణామం. దేనినైనా మనం చేయాలని అనుకుంటే, మన సమర్థతను పెంపొందించుకునే ప్రయత్నం చేయాలి కానీ ఫలితం కోసం చేయడం కాదు. మీరు కేవలం విజయాన్ని కోరుకున్నంత మాత్రాన అది రాదు. మీకు ఉన్న యోగ్యతను బట్టి విజయం మిమ్మల్ని వరిస్తుంది. ఈ భూమిపై ఏదైనా సఫలీకృతం కావాలంటే రెండు ప్రాథమిక విషయాలు పాటించాలి. అవి మీ భౌతిక శరీరాన్ని, మనసును పూర్తి సమర్థతతో ఉపయోగించగలగటం. ఇలా కనక జరగాలంటే మీరు స్వతహాగా ప్రసన్నంగా ఉండాలి. అలా ఉంటే మీ జీవితంలో మీరే ఒక సమస్య కాదని దాని అర్థం. మీరే సమస్య కాకపోతే బయటి విషయాలను తేలికగా ఎదుర్కోవచ్చు. మీరే కనుక ఒక సమస్య అయితే ఇక అన్నీ ఇబ్బందులే. ఈ భూమిపై ఎన్నో వేల సంవత్సరాల జీవితానుభవం ఉన్నప్పటికీ, మానవులు ఇంకా ఎన్నో సమస్యలతో ఉండటానికి కారణం, స్వతహాగా వ్యక్తులు తమకు తామే ఒక పెద్ద సమస్య కావడం వలన. వారు ఏదైనా సరిచేసి సమర్థించడానికి ప్రయత్నిస్తే, ఇంకా ఎక్కువ సమస్యలు సృష్టిస్తారు. మీకు మీరే ఒక సమస్యగా ఉన్నప్పుడు, మీరు దేనిని తాకినా అది ఒక పెద్ద సమస్యగా మారుతుంది. కాబట్టి అన్నింటికంటే మొదటిది, ముఖ్యమైనది ‘ఇది’ అంటే ‘మీరు’ ముందు సరిగ్గా ఉండాలి. మీరు కనుక స్థిరంగా ఉంటే, అప్పుడు మనం ప్రపంచంలో అన్నీ సరిగ్గా చేయగలం. ప్రపంచం ఏ విధంగా ఉన్నా, మీరు మాత్రం స్థిరంగా ఉండగలరు. ఇలా ఉండటానికి ప్రతివారూ యోగ్యులు, అర్హులు; ఆ దిశగా అందరూ ప్రయత్నించాలి. మీరు ఈ దేశపు ప్రధానమంత్రి అవుతున్నారా లేదా ఒక గొప్ప క్రీడాకారునిగా అవబోతున్నారా అనేది ముఖ్యం కాదు. అది అలా జరిగితే మంచిదే; కానీ అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే, కనీసం ఈ జీవితాన్ని హాయిగా జీవించగలగాలి. ఇలా ఉండటానికి ప్రతి ఒక్కరికీ అర్హత ఉంది. సమస్య - పరిష్కారం సద్గురూ! చిన్న చిన్న యోగసాధనాల వల్ల అనేక సమస్యలు దూరం చేసుకోవచ్చనుకుంటే, మరి ఆడవారు యోగా చెయ్యవచ్చా? - ఎస్ వసంత, సికింద్రాబాద్ సద్గురు: ఈ సమాజంలో కొన్ని కుటుంబాల్లో యోగా, ప్రాణాయామం లాంటి ఆధ్యాత్మిక అభ్యాసాలు స్త్రీ ఆచరిస్తే భర్తకు దూరమైపోతుందని, కుటుంబం వదిలి బయటకు వచ్చేస్తుందనే మూఢ విశ్వాసం ఉంది. ‘నీకేమైనా జీవితం మీద విరక్తి పుట్టిందా? యౌవనంలో ఎందుకు యోగం, ధ్యానం?’ అంటూ యువతను తికమక పెట్టేవారూ ఉన్నారు. ‘‘శరీరం వయసులో ఉన్నప్పుడు, దాన్ని సంతోషాలను పొందడానికి ఉపయోగించుకోవాలి. శరీరం దేనికీ పనికిరాకుండా పోయినప్పుడు, ఆధ్యాత్మికంలో దించాలి,’’ అనే ఆలోచనలు పెరిగిపోయాయి. కాని వయసు దాటాక శరీరం సక్రమంగా పనిచేయకపోతే భోజనం సయించదు. తింటే జీర్ణం కాదు. కూర్చుంటే నిల్చోవడం రాదు. నిల్చుంటే కూర్చోవడం కష్టం. అలాంటి స్థితిలో ఆధ్యాత్మికమా? ఏం ఆలోచనలివి? యోగ వలన యౌవన ప్రాయంలో జీవితం మీద విరక్తి పుట్టదు. పైగా జీవితం మీద పరిపూర్ణమైన ప్రేమ జనిస్తుంది. భార్య అనే మనిషిని పనిచేసే యంత్రంగా, సుఖాలనిచ్చే మనిషిగా మాత్రమే భావించే వ్యవస్థను కుటుంబం అని ఎలా అంటాం? కుటుంబం అంటే ఒకరికొకరు భాగం పంచుకోవడం. భార్యాభర్తలిరువురూ పరస్పరం పూర్తి ప్రేమతో ఉంటేనే సహజీవనం సాఫీగా సాగిపోతుంది. ఇరువురూ కలిసి ఒకే దిక్కుకు పయనించాలి కదా! ఉత్తమమైంది ఆశించడానికి అందరూ అర్హులే!! - జగ్గీ వాసుదేవ్ -
వివేకం: పూర్తి ఉత్తేజం కావాలా?
మన ప్రతి అనుభవం వెనుకా ఓ రసాయనిక మూలం ఉంటుంది. తమ శారీరక అనుభవాన్ని మనోహరం చేసుకునేందుకు జనం మాదక ద్రవ్యాల రూపంలోనో, మత్తు పానీయాల రూపంలోనో రసాయనాలను ఉపయోగించడానికి ప్రయత్నిస్తారు. మీరు కొద్దిపాటి ఆనందాన్ని మాత్రమే ఆశిస్తుంటే, నేను అందుకు వ్యతిరేకమేమీ కాదు. కానీ, మీరు కేవలం ఆనందమే కావాలనుకునేవారైతే, ఇంతకన్నా పెద్ద ఆనందాన్ని, పరమానందాన్ని అందిపుచ్చుకునే అవకాశాన్ని మీరు కాదనగలరా? మీరు సర్వకాల సర్వావస్థల్లోనూ తాగి, చురుకుగా, అప్రమత్తంగా ఉండటం నేర్చుకోవడానికి మీరు ఉత్సాహంగా లేరా? జనం ఆల్కహాల్ కోసమే తపించిపోవడానికి కారణమేమిటంటే, వాళ్లకు తెలిసిన అతి గాఢమైనది అదే గనుక. నేను వారికి ఆల్కహాల్ కన్నా ఎక్కువ మత్తు ఇచ్చే వేరే రకమైన పానీయం ఇస్తున్నాను. ఆల్కహాల్‌ను నేను పక్కన పెట్టేస్తున్నది దేనికంటే, నాకు ఇందులో కావలసినంత మత్తు లేదనిపిస్తోంది. నేను వేరే మరోదాన్ని సేవిస్తూ ఉంటాను. జీవితాన్ని ఆస్వాదిస్తాను. నాతో దీన్ని రుచి చూసినవారు ఆల్కహాల్‌కు స్వస్తి చెప్పారు. వాళ్లు దీన్ని వదిలేసింది ఇదేదో చెడు అలవాటని కాదు; ఇది చిన్నపిల్లల వ్యవహారమని వాళ్లు మానేశారు. వాళ్లు ఈ స్థాయిని మించి ఎదిగారు. ఆల్కహాల్ మంచిదా, కాదా అన్నది కాదు ప్రశ్న. రాత్రి కొద్దిగా తాగితే, ఉదయమయ్యే సరికి మీకు తలనొప్పి పట్టుకుంటుంది. కానీ, నేను రోజంతా తాగి ఉండగలను. అయినా నాకు తలనొప్పి రాదు. పైగా నాకేమీ ఖర్చు కాదు కూడా. ఇంకా చెప్పాలంటే, ఆరోగ్యానికి మంచిది కూడా. మరి తాగడంలో ఇదే ఉత్తమమైన తాగుడు కాదా? మాకు మద్యపానం సేవించడం, మాదక ద్రవ్యాలు తీసుకోవడం వగైరాలన్నీ చిన్నపిల్లల వ్యవహారంగా కనిపిస్తుంది. ఎందుకంటే, మేము సచేతనంగానే ఉండి, ఇంతకన్నా వెయ్యి రెట్లు ఎక్కువగా మత్తుగా ఉండగలం. మీరు డి-వైన్‌ను తాగగలిగినప్పుడు వైన్ ఎందుకు? మరొక విధంగా చెప్పాలంటే, మీరు ఆల్కహాల్ లేదా మాదక ద్రవ్యాల ద్వారా పొందే శాంతి, ఆనందం అంతా మీలోనే అనుభవిస్తున్నారు. ఇవన్నీ మీలో అంతర్గతంగా జరిగే రసాయనిక ప్రక్రియల వలనే కలుగుతున్నాయి. ఆల్కహాలు, మాదక ద్రవ్యాలు లేదా మరే ఇతర బయటి పదార్థాలను తీసుకోవాల్సిన అవసరం లేకుండానే మీలో పరమానందాన్ని కలిగించే రసాయనిక ప్రక్రియలను కలిగించడమే ఆధ్యాత్మిక ప్రక్రియలన్నిటి ఉద్దేశం. ఇక మీరు పూర్తి శాంతిమయులవడానికి, పరమానందభరితులవడానికి వైన్ మీద ఆధారపడతారా లేక డి-వైన్ మీద ఆధారపడతారా? అన్నది మీరే నిర్ణయించుకోండి. సమస్య - పరిష్కారం మద్యం తీసుకుంటే కలవరం తగ్గి, బాధలన్నీ మరిచి, హాయిగా నిద్రపోతున్నాను. రోజూ కాస్త మద్యం తీసుకుంటే గుండెకు సంబంధించిన వ్యాధులు రావని డాక్టర్లు చెప్పినట్లు చదివాను. ఇది నిజమేనా? - టి.రాజశేఖర్, కాకినాడ సద్గురు: ప్రతిదినం ఒక ఆపిల్ తినడం మంచిది అంటారు. ఇప్పుడు దాన్ని మద్యం అంటూ మార్చేశారా? వాస్తవంగా, మద్యం తీసుకుంటే ఏం జరుగుతుంది? మీలో ఒక రసాయన ప్రక్రియ జరిగి, కలవరాన్ని తగ్గిస్తుంది. అదే ప్రశాంతత అని అనుకుంటున్నారు. ఒక పెగ్ విస్కీ తాగితేనే ఇంత హాయిగా ఉంటే, ఒక సీసా విస్కీ తాగితే ఎన్నో రెట్లు హాయిగా ఉండాలి కదా? తాగి చూడండి. ఏమవుతుంది? మామూలు సమయాల్లో శాంతంగా, హుందాగా ఉండే ఎంతోమంది మద్యం పుచ్చుకోగానే చేసే హడావిడి మీరు చూడటం లేదా? మద్యం తీసుకుని మతి కోల్పోయి చేసిన నేరాల గురించి, జైలుశిక్ష అనుభవించినవారిని అడగండి చెప్తారు. మీ జీవితంతో మీకు అవసరం ఉన్నందుకే కదా జీవించాలనుకుంటున్నారు. జీవించడాన్ని శక్తిమంతం చేయాలంటే, మెదడుకు పదును పెట్టాలి కదా! మద్యం లాంటి ఏ మత్తు పదార్థమైనా, మీ మెదడును మెరుగు పరుస్తుందా? లేక మందగించేలా చేస్తుందా? మద్యం మిమ్మల్ని శాంత పర్చడం లేదు. మొద్దు బారుస్తున్నది. మీరు జీవించాలని ఆశ పడుతున్నారా? స్పృహ తప్పి పడిపోవాలనుకుంటున్నారా? ఆలోచించండి! మద్యపానం మీకు మంచి చేస్తుందా? చెడు చేస్తుందా? మీరే గమనించండి. - జగ్గీ వాసుదేవ్ -
వివేకం: దెబ్బతింటేనే జీవితపు పంట పండుతుంది!
ఉత్కంఠ భరితమైన వార్తలంటేనే అందరికీ ఆసక్తి. ‘ఎవరో ఇద్దరు ప్రేమగా కాపురం చేస్తున్నారు, సంతోషంగా జీవిస్తున్నారు’ అన్న వార్త చప్పగా ఉంటుంది. కాని మీ జీవితం మటుకు ఏ ప్రతిఘటనా లేకుండా, ఒడుదుడుకుల్లేకుండా, ఒకే రీతిలో ఉండాలి. మీరు అడిగినా, అడక్కపోయినా ఈ ప్రపంచం మీ మీద సమస్యలను విసిరి, తమాషా చూడబోతోంది. మరి వాటిని ఎదుర్కోవడానికి మీరు ఎందుకు జంకుతున్నారు? ఒకసారి రైతు దేవుడితో పొట్లాట వేసుకున్నాడు. ‘‘నీకు వ్యవసాయం గురించి ఏమి తెలుసు? నీవనుకున్నప్పుడే వర్షాలు కురిపిస్తున్నావు. నీ వల్ల చాలా ఇబ్బందిగా ఉంది. నా మాట విని ఈ పనులన్నీ ఒక రైతుకు ఇచ్చెయ్’’ అన్నాడు. దేవుడు, ‘‘ఎండ, వాన, గాలి అంతా నీ వశంలో ఉండుగాక’’ అని వరమిచ్చేసి వెళ్లిపోయాడు. పంటల కాలం వచ్చింది.‘‘ఓ వానా, కురు!’’ అన్నాడు. వాన పడింది! ఆగమంటే ఆగింది! నేలను దున్నాడు. కావలసిన వేగంతో గాలిని రమ్మన్నాడు. విత్తనాలు జల్లాడు. గాలి, వాన, ఎండ అన్నీ అతను చెప్పినట్లు విన్నాయి. చేలు పచ్చగా ఎదిగాయి. కోతల కాలం వచ్చింది. రైతు ఒక వరి కంకిని కోశాడు. తీసి చూశాడు. నివ్వెరపోయాడు! లోపల ధాన్యం కనిపించలేదు. వెంటనే, మరో కంకిని కోసి చూశాడు. దానిలో కూడా ధాన్యం లేదు. ‘‘ఓ భగవంతుడా! గాలి, వాన, ఎండ అన్నింటినీ సమంగానే వాడాను. కానీ పంట ఎందుకు దెబ్బతిన్నది?’’ అంటూ కోపంగా అరిచాడు. దేవుడు ‘‘నా దగ్గరున్నప్పుడు గాలి వేగంగా వీచేది, అప్పుడు పైరు అమ్మను గట్టిగా వాటేసుకునే పసిపిల్లల్లా భూమిలో తమ వేర్లను చాలా లోతుల్లోకి తీసుకెళ్లేవి. అలాగే వాన తగ్గిందంటే, నీటిని వెదుక్కుంటూ వేర్లను నాల్గు దిక్కులకూ పంపించేవి. పోరాట పటిమ ఉంటేనే మొక్కలు తమను తాము కాపాడుకునేందుకు బలంగా పెరుగుతాయి. అన్నింటికీ వసతులు కల్పించి, ఇవ్వగానే నీ పంటకు సోమరితనం వచ్చేసింది. ఏపుగా ఎదిగిందే గాని, ధాన్యం ఇవ్వడం దానిచేత కాలేదు’’ అన్నాడు. ‘‘వద్దు స్వామీ! ఇలాగైతే నీ వాన, గాలి నువ్వే ఉంచుకో’’ అని ఆ రైతు వాటిని దేవుడికే అప్పగించేశాడు. జీవితంలో అన్నీ సులభంగా సమకూరితే, ఆ జీవితం ఇలాగే ఉంటుంది. దానికి మించిన శూన్యం వేరొకటి ఉండదు. ఊహించని అనుభవాలు ఎదురొస్తే, జీవితంలో అనుభవించి తెలుసుకునే అవకాశాలుగా వాటిని భావించాలి. చిక్కులు వచ్చినప్పుడే మన సామర్థ్యం ఏమిటి? మనం ఎక్కడ ఉన్నాం అనేది స్పష్టంగా తెలుస్తుంది. చీకటి సమస్య ఉన్నందుకే కదా విద్యుద్దీపాలు కనుగొన్నారు. సమస్యలే లేకుంటే, మీ మెదడు పనితీరు ఏ విధంగా ఉందో ఎలా తెలుసుకోగలరు? వాస్తవానికి, మీ పద్ధతి సరిగా లేనందువల్లే, సాధారణ పరిస్థితులు కూడా సమస్యలుగా కనిపిస్తాయి. సమస్య - పరిష్కారం ఒత్తిడి వల్ల జీవితంలో సంబంధాలు దెబ్బతింటున్నాయి. సహాయం చేయగలరు. - డి.రాజ్మలక్ష్మి, సికింద్రాబాద్ సద్గురు: మీలాగే ప్రస్తుత ప్రపంచంలో అనేక మంది వివిధ రకాల ఒత్తిడులకు గురి అవుతున్నారు. ఒత్తిడి, ఆందోళన అనేవి మనం కొత్తగా పెట్టుకున్న పేర్లు మాత్రమే. పూర్వకాలంలో వీటిని అజ్ఞానం అని పిలిచేవారు. మీరు చేస్తున్న పనివల్ల మీకు ఒత్తిడి లేదు. మీ జీవన క్రియను మీరు సరిగ్గా నిర్వహించుకోలేని అసమర్థతతో ఉన్నారు. దీనివల్లనే మీకు ఒత్తిడి కలుగుతోంది. మీ జీవన క్రియను - మీ శరీరాన్ని, మీ బుద్ధిని, మీ భావోద్వేగాలను, మీ ప్రాణశక్తిని - ఒక క్రమపద్ధతిలో నిలుపుకోలేని మీ అసమర్థతయే ఒత్తిడి. ఏ వ్యక్తి అయినా ఒక స్పష్టతా స్థితిలో ఉంటే ఒత్తిడి అనే ప్రశ్నే తలెత్తదు. మనం ధ్యానం అని చెబుతున్నది, దీనికి చికిత్సయే. ధ్యానం అనేది ఒక పని కాదు. అది ఒక లక్షణం, గుణం. మీ శరీరాన్ని, బుద్ధిని, భావోద్వేగాలను, ప్రాణశక్తులను - ఒక పరిపక్వ స్థాయిలో ఉండేటట్లు మీరు మలచుకోగలిగితే, ధ్యానం సహజంగానే కలుగుతుంది. ఇది సరిగ్గా ఎలాంటిదంటే, మీరు నేలను సారవంతంగా ఉంచారు. సరైన ఎరువును, నీటి వసతిని కల్పించారు. ఇక సరైన రకపు విత్తనం అక్కడ ఉంటే కనుక, అది పెరుగుతుంది, పుష్పాలుగా, ఫలాలుగా వికసిస్తుంది. మీరు కోరుకున్నంత మాత్రం చేత, మొక్క నుండి పుష్పాలు, ఫలాలు రావు. అందుకు ఆవశ్యకమైన, అనుకూలమైన వాతావరణాన్ని కల్పిస్తే అవి వస్తాయి. అదే విధంగా, మీరు మీ లోపల అవసరమైన వాతావరణాన్ని కల్పించుకోవాలి. అప్పుడు ధ్యానం మీ లోపల సహజంగా కనిపిస్తుంది. - జగ్గీ వాసుదేవ్ -
వివేకం: తప్పు ఒప్పుకోవడం అవమానమా?
చిన్నతనంలో మీరెంతో సర్దుకుపోయేవారు. ఏ బాధా లేకుండా తప్పు ఒప్పుకునేవారు. జీవితంలో అప్పుడెలాంటి సంతోషం ఉండేది? అదే ఇప్పుడెందుకు కరువయ్యింది? శారీరకంగాను, మానసికంగాను మీరు పెరిగేకొద్దీ గట్టిపడిపోయారు. సమాజంలో మీకంటూ ఒక గుర్తింపు ఏర్పరచుకున్నారు. ఆ గుర్తింపునకున్న గౌరవాన్ని నిలబెట్టుకోవడానికి, మీ నిజాయితీని బలిపెట్టదలచుకున్నారు. అందుకే తప్పులను ఒప్పుకునే తత్వాన్ని పోగొట్టుకున్నారు. మనిషిగా పుట్టినవారెవరూ తప్పులకు అతీతులు కారు. చేసింది తప్పా, ఒప్పా అనేది కాదు సమస్య. దాన్ని అంగీకరించడంలో ‘అవమానం’ అనే అహంకారపు భావనే సమస్య. ‘క్షమించు, తెలియక జరిగింది! ఈసారి ముందే తెలియజేయి, దిద్దుకుంటాను’ అని వినయంగా చెప్పుకుంటే ఏమి పోతుంది? తప్పు తెలుసుకున్న తర్వాత కూడా, నలుగురిలో ఒప్పుకునే ధైర్యం లేక, దాన్ని సమర్థించుకుంటూ పోవడం పెద్ద తప్పు. ఒకసారి శంకరన్ పిళ్లైకి పక్క తోటలో వేలాడుతున్న ‘పండిన పండ్లు’ కనిపించాయి. గోనె సంచీ తీసుకొని, కంచె దాటి వెళ్లాడు. పండ్లను కోసి, సంచీ నింపి, భుజమ్మీద వేసుకుని కంచె దాటుతూ ఎదురుగా వచ్చిన తోటమాలికి దొరికిపోయాడు. ‘‘ఎవరినడిగి ఇవన్నీ కోశావు?’’ ‘‘నేనేం కోయలేదు. పెద్ద గాలికి అన్నీ రాలిపడ్డాయి’’ అన్నాడు శంకరన్ పిళ్లై. ‘‘అయితే మరి గోనెసంచీనెందుకు తెచ్చావు?’’ ‘‘ఓ! ఇదా! ఇదీ గాల్లోనే ఎగిరి వచ్చింది!’’ ‘‘గాలికి పండ్లు రాలాయి! సంచీ ఎగిరి వచ్చింది! కాని, పండ్లు సంచీలో నింపిందెవరు?’’ అని తోటమాలి అడిగాడు. శంకరన్ పిళ్లై బెదరకుండా, అమాయకుడిలా మొహం పెట్టి ‘‘అదే నాకూ ఆశ్చర్యంగా ఉంది’’ అన్నాడు. చాలామంది తప్పుచేసేవారు శంకరన్ పిళ్లైలా పట్టుబడ్డా ఒప్పుకోకుండా, అది తప్పు కాదంటూ దాటవేస్తారు. తప్పు ఒప్పుకోకుండా, ఇలా మొండికేయడం ప్రమాదకరమే! స్నేహితులు, సహోద్యోగులు, పై అధికారులు, మీ కింద పనిచేసే ఉద్యోగులు, అపరిచితులు... ఇలా ఎవరిదగ్గరైనా బేధభావం చూపకుండా తప్పు చేసినప్పుడు నిజాయితీగా ధైర్యం చేసి దాన్ని ఒప్పుకోండి. అది మీ గౌరవాన్ని పెంచుతుంది. అనాలోచితంగా ఒకసారి తప్పు చేయవచ్చు. కాని గ్రహింపు లేకుండా, అదే తప్పును తిరిగి చేయడం అభివృద్ధికి ఆటంకం. కొందరు మీ తప్పును భూతద్దంలోంచి చూడవచ్చు. చూడనీయండి. క్షమింపమని అడిగితే, అక్కడితో యుద్ధం ముగుస్తుంది కదా, తరువాత తప్పులెంచినవారే తామే తప్పు చేసినట్లు భావిస్తారు. గుర్తుంచుకోండి, మీ మనసు పక్వం చెందినదనటానికి ఇది ఒక గుర్తు. వ్యాపారంలోనైనా, ఆటల్లోనైనా, యింట్లోనైనా, తప్పులను ఒప్పుకోవడంలోనే గెలుపు ఉంటుంది. తప్పు అంగీకరించడం శత్రువులను కూడా స్నేహితులుగా మార్చగలదు. అది ఓటమి లేని బలం. జీవితంలో ఉన్నతికి తీసుకెళ్లగలిగే బలం. సమస్య - పరిష్కారం బాగా బతకడానికి చేసే పనిలో ఆత్మవిశ్వాసం పెంచుకోవడానికి ప్రయత్నించి పైకి రావాలి గానీ, ఈ ఆత్మజ్ఞానం కోసం ప్రయత్నించడం సమయం వృధా చేయడమే కదా? -పి.జీవన్‌కుమార్, కాకినాడ సద్గురు: ఆత్మజ్ఞానమంటే మీ గురించి మీరు తెలుసుకోవడమే. మీకో సెల్ఫోనుందా? మీరు కెమెరాను వాడుతారా? దాని గురించి మీరెంత ఎక్కువగా తెలుసుకుంటే అంత బాగా దానిని ఉపయోగించుకోగలుగుతారు. మీరు వాడే వస్తువు విషయంలో ఇది నిజమైనప్పుడు, మీ విషయంలో ఇది నిజమెందుకు కాకూడదు? ఈ మానవ పరికరాన్ని (ఈ శరీరం, మనసుల) గురించి మీరెంత ఎక్కువగా తెలుసుకుంటే, మీరు అంత బాగా దానితో వ్యవహరించగలుగుతారు. ఆత్మజ్ఞానమనేది హిమాలయ గుహలలో సంభవించేదని అనుకోకండి. జీవన ప్రక్రియ గురించి ఏమాత్రం తెలుసుకోకుండానే ఆత్మవిశ్వాసంతో ఎలా ఉండాలో అవి మనుషులు నేర్చుకోవాలనుకుంటున్నారు. స్పష్టత లేని ఆత్మవిశ్వాసం ఓ పెను విపత్తు. మీ కళ్లకు గంతలు కట్టి మిమ్మల్ని అలా నడవమని చెప్పామనుకుందాం. మీకు వివేకముంటే, మీరు మీ దారిని గ్రహిస్తారు. అటు ఇటు మెల్లగా మెల్లగా అడుగులు వేస్తూ, గోడల్ని పట్టుకుంటూ, మీ చేతులతో, కాళ్లతో స్పృశిస్తూ నడుస్తారు. అయితే మీరు మితిమీరిన విశ్వాసంతో ఏది పట్టించుకోకుండా నడిస్తే, ప్రపంచం మీ పట్ల అంత దయ చూపించదు. స్పష్టత లేని విశ్వాసంతో ఉంటే జీవితమూ మీ పట్ల అంత దయ చూపించదు. మీరు ఎందులో ఉన్నా అందులో విజయం సాధించడానికి, మీకు కావల్సింది స్పష్టత! విశ్వాసం కాదు. ఏ విషయంలోనైనా స్పష్టత తీసుకువచ్చేదే ఆత్మజ్ఞానం. - జగ్గీ వాసుదేవ్ -
వివేకం: మార్పు రావాల్సింది మీలోనే!
ఈ కాలంలో ఎవరు చూసినా కోపాలు, చిరాకులతో సతమతమౌతున్నారు. అలా ఎందుకుంటున్నారంటే మా తండ్రులు, తాతల నుంచీ మా రక్తంలో ఉందనో, ఉంటున్న పరిస్థితులలో ఉందనో చెప్పబోతారు. కాని మీ కోపాలకు, చిరాకులకు కారణం మీరేననీ, అది మార్చుకోవడం మీ చేతుల్లోనే ఉందనీ గ్రహించడం మంచిది. దీనికి శంకరన్ పిళ్లై ఉదాహరణ చెప్పాలి. ఎండాకాలం. శంకరన్ పిళ్లై వీధివీధిన టోపీలు అమ్ముకుంటున్నాడు.మధ్యాహ్న సమయం. అలసిపోయి ఒక చెట్టు నీడన కూర్చొని ఉండగా, బాగా నిద్ర పట్టేసింది. చాలాసేపైనాక కళ్లు తెరచి చూశాడు. అమ్మకానికి పెట్టుకున్న టోపీలన్నీ, కోతులు తీసుకెళ్లాయి. అతని తాతగారొకరు ఇదే పరిస్థితిలో ఏం చేశారో శంకరన్ పిళ్లైకి బామ్మ చెప్పిందొకసారి. మనిషి చేసేది కోతి అలాగే చేస్తుంది కాబట్టి, అతని తాతగారు తన టోపీని తీసి భూమ్మీదకు విసిరికొట్టారనీ, అది చూసి కోతులూ అలాగే టోపీలను కిందకు విసిరికొట్టాయనీ బామ్మ చెప్పింది. అలాగే చేయాలనుకుని, కోతులను చూసి చేతులను ఆడించాడు. అవి కూడా చేతులు ఆడించాయి. తన బుగ్గ మీద చేత్తో చిన్నగా కొట్టుకున్నాడు. కోతులు కూడా తమ చెంపల మీద తట్టి చూపించాయి. శంకరన్ పిళ్లై తన టోపీని తీసి ఒకసారి తిప్పి, మరలా తలమీద పెట్టుకున్నాడు. కోతులు కూడా అలానే చేశాయి. ఇలా కాస్సేపు వాటిని ఆడించి, చివరికి తన టోపీని తీసి నేలకేసి కొట్టాడు. చెట్టుపైనున్న ఒక కోతి వేగంగా కిందికి దూకి, శంకరన్ పిళ్లై విసిరికొట్టిన టోపీని టక్కున అందుకుంది. తెల్లమొహం పెట్టి చూస్తున్న అతణ్ని సమీపించి, అతని చెంప మీద బలంగా ఒక్కటిచ్చింది. ‘‘ఇడియట్! నీకేనా బామ్మ ఉండేది?’’ అనడిగింది. కోతుల ఆలోచనలు మారవా? రోజూ అన్నిటికీ చిరాకేనా? కోపాలు, చిరాకులు మంచివి కావని తెలియదా? మీ తెలివితో వాటిని అధిగమించలేరా? జీవితంలో ఏ రోజూ చిరాకు కలిగించేది కాదు. ఈ భూమి కూడా ఆగకుండా తిరుగుతూ ఉంది. ఏ నిమిషం మీరు తలెత్తి చూసినా, ఆకాశంలో ఒక కొత్త భాగాన్ని చూస్తారు. మీ మనసే ఆ అనుభూతి పొందలేక అల్లాడుతోంది. అధీనంలో పెట్టుకోవడం తెలియక కట్లు విప్పదీస్తే, మనసుకు వేరే విధంగా పని చేయడం తెలియదు. చిరాకుకు కారణం మీ ఆఫీస్ కాదు. మీరు మీ మనసుకు బానిస అయిపోయినందుకే. మనసును ఎలా ఉపయోగించుకోవాలో మీకు తెలియకపోవటం వల్లే, అది మిమ్మల్ని ఉపయోగించుకుంటోంది. ఒక స్టేజ్‌లో అది మిమ్మల్ని మింగేసి మిమ్మల్ని ఏమీ లేనివాడుగా చేస్తుంది. చిరాకు నుండి బయటపడ్డానికి ఒక మార్గం ఉంది. ఏ పనిచేసినా, దాంట్లో పూర్తిగా లీనమైపోండి. పూర్తిగా అంటే, మిమ్మల్నే దానికోసం అర్పించుకునేందుకు సిద్ధమయ్యే పూర్ణ స్థితి. చేసేది సంతోషంగా చేస్తున్నామని భావించగలిగితే, పూర్తిగా పనిచేయగలుగుతారు. ఎవరి బలవంతం మీదో పనిచేస్తున్నాననుకుని విసుగ్గా చేస్తే, రక్తపోటు, గుండెనొప్పి, మిగతా మానసిక వ్యాధులు పిలువకుండా వచ్చి కూర్చుంటాయి. బయట దేనిని మార్చినా, ఎన్ని మార్చినా, అది నిజమైన మార్పు కాదు. సరైన స్పృహతో జీవిస్తే, ప్రతిక్షణం జీవంతో ఉంటారు. ఒక్క క్షణం కూడా పాతగా ఉండదు. ధ్యానం చేస్తే మీ లోపల మార్పు వస్తుంది, చిరాకు ఎగిరిపోతుంది. సమస్య - పరిష్కారం పెద్దవారంటే ఇప్పటివాళ్లకు మర్యాద లేకుండా పోయింది. మా ఆత్మగౌరవం ఎలా కాపాడుకోవాలి? - ఎం.రాజలింగం, మహబూబ్‌నగర్ సద్గురు: మీ కింద పనిచేసేవారో, మీ ఇంట్లో వారో మీకు తగిన మర్యాదనివ్వటం లేదని బాధపడుతున్నారా? ఒక విషయాన్ని అర్థం చేసుకోండి. మీ ఆత్మ ఎటువంటి మర్యాదా ఆశించడం లేదు. ఆత్మగౌరవం అనేదేదీ లేదు. అదొక కాల్పనిక భావం. అందులోని నిజం ఏమిటంటే... ప్రస్తుతం, మీలో మీకు పూర్ణత్వం కనిపించడం లేదు. అసంపూర్ణంగా ఉన్నట్లు భావిస్తున్నారు. ఆ ఖాళీని భర్తీ చేయడానికి మీకు ఇతరులు అవసరమౌతున్నారు. మర్యాదను అధికారికంగానో, ప్రేమతోనో అడిగి తీసుకోవడం భిక్షం అడిగినట్లే. తిండి కోసం చేతులు చాచవచ్చు. మర్యాదల కోసం చేతులు చాచరాదు. ఈ రోజు మీకు అపరిమితంగా గౌరవ మర్యాదలు ఇచ్చేవారు, రేపు మిమ్మల్ని తిరిగి చూడకుండా వెళ్లవచ్చు. అది మిమ్మల్ని బాధిస్తే, తప్పు మీదే. ఎప్పుడు మిమ్మల్ని మీరు అసంపూర్ణంగా భావిస్తారో, అప్పుడే ఎదుటివారి నుండి ఏదో ఆశిస్తారు. మిమ్మల్ని మీరు సంపూర్ణులుగా చేసుకోక, పక్కవారి నుండి మర్యాదలు కోరడం హీనం కదా! నన్నడిగితే, చేదు అనుభవాలన్నీ వెంట వెంటనే కలగడం మంచిదే. చిన్న చిన్న పాఠాలు ఆలస్యమయ్యే కొద్దీ, మీ జీవితం వృథా అయిపోతుంది. అభిమానం, ఆత్మగౌరవం అంటూ పోతే, ఒక్కరోజైనా ఆనందం పొందలేరు. ఇది తెలుసుకోగలిగితే, మిగిలిన జీవితాన్నైనా ఆనందంగా ఎలా గడపాలా అని చూడటం మొదలెడతారు. - జగ్గీ వాసుదేవ్ -
వివేకం: ఇవ్వడంలో ఉన్నది పొందడంలో లేదు
ఎంతో సారవంతమైన భూమిని తన ఇద్దరు కొడుకులకు అప్పగించాడో భూస్వామి. పెద్దవాడికి వివాహమైంది. ఐదుగురు పిల్లలు. చిన్నవాడు పెళ్లి చేసుకోలేదు. తండ్రి ఇష్టప్రకారం, పంటను ఇద్దరూ సమంగా పంచుకుంటున్నారు. ఓరోజు పెద్దవాడికి, ‘‘నాకు వయసైపోయినా చూసుకోవడానికి పిల్లలున్నారు. తమ్ముడికి ఎవరూ లేరే? వాడికి అదనంగా ధనం అవసరం కదా!’’ అని ఆలోచన వచ్చింది. దాంతో అతను ప్రతినెలా తన వాటా నుండి ఒక మూట ధాన్యాన్ని తమ్ముడి గిడ్డంగిలో చేర్చడం మొదలుపెట్టాడు. రెండోవాడు, ‘‘నేను ఒంటరిని. అన్న కుటుంబానికి ఎక్కువ భాగం కావాలి కదా’’ అని వేరేవిధంగా ఆలోచించాడు. అతను కూడా తన వాటా నుండి ఒక మూట ధాన్యాన్ని ఎత్తుకెళ్లి అన్న గిడ్డంగిలో రహస్యంగా చేర్చడం మొదలెట్టాడు. కొంతకాలం తర్వాత ఒకరోజు అన్నదమ్ములిద్దరూ ధాన్యపు బస్తాలతో ఎదురెదురుగా రావడం జరిగింది. ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఆ ధాన్యపు బస్తాలను తమ తమ గిడ్డంగులలో దించేసి, ఇళ్లకు చేరుకున్నారు. తర్వాత, ఆ ఊరిలో ఒక గుడి కట్టడానికి తగిన స్థలం వెతికేటప్పుడు, ఆ అన్నదమ్ములు కలుసుకున్న ఆ ప్రత్యేకమైన స్థలమే పవిత్రమైన స్థలంగా ఎన్నుకున్నారు. సత్సంబంధాలు అంటే ఇలా ఉండాలి. మరి మన సంబంధాలు ఎలా ఉంటున్నాయి? ఎంతటి సన్నిహితులైనా ఒక హద్దు విధించుకుని, గిరి గీసుకుని కూర్చుంటున్నాం. ఇరువురిలో దాన్ని ఎవరు దాటినా, యుద్ధం ప్రకటిస్తున్నాం. ఒక్కరైనా పోనీలే అనుకుని గొప్ప మనసుతో ఉంటే కదా ఎదుటివాడు బతికేది! బాగా గమనించండి. ప్రత్యేకించి ఒక వ్యక్తి సంతోషంగా ఉన్నప్పుడు, అతనితో పనిచేయడం చాలా సులభంగా ఉంటుంది. అతనే సంతోషంగా లేని సమయాన అతనితో కలిసి పనిచేయడం కష్టమౌతుంది. ఆటలు కానీ, వ్యాపారం కానీ, ఆఫీసు కానీ, ఎక్కడైనా అందరూ ఒకటిగా కలిసి పనిచేయాల్సి ఉంటుంది. వేరు వేరు విభాగాల నుండి వచ్చినవారు కలిసి ఉన్న సమయంలో, అంతా ఒకరి ఇష్టప్రకారం జరగడమనేది కష్టమే. అక్కడ ఇతరులను తక్కువగా చూసే అలవాటును మొదట మానాలి. ఎవరినీ ‘నీలా ఎవరు ఉండరంటూ’ తప్పు పట్టకండి. చుట్టూ ఉన్నవారంతా గొప్పవారే. ఒకటీ రెండు సందర్భాల్లో వారు తెలివితక్కువగా ప్రవర్తించి ఉండవచ్చు. దగ్గరి బంధువులు కూడా పలు సందర్భాల్లో నిరాశపరచి ఉండవచ్చు. దాన్ని కొండంత చేయకండి. జీవితం యొక్క సారం దాని ఒడిదుడుకుల్లోనే ఉంది. అందరినీ మీకు కావలసిన రీతిగా వంచాలని చూడకండి. ఎదుటివారిని అలాగే అంగీకరించటం నేర్చుకోండి. అలా చేస్తే, ఇతరులు మీ ఇష్టప్రకారం ఉండకపోవచ్చు. కాని జీవితం మీ ఇష్టప్రకారమే ఉంటుంది. ఇవ్వడంలో లభించే ఆనందం, పొందడంలో లేదు. ‘‘ఆకలితో ఉన్నవాడికి నీ ఆహారం ఇచ్చేస్తే, నీవు బలహీనపడవు. బలపడతావు’’ అని బుద్ధ భగవానుడు అందంగా దీన్ని ఉటంకించారు. ఆహారం మటుకే కాదు, ప్రేమ కూడా అంతే. ప్రేమను అంతులేకుండా ఇవ్వడంలో లభించే ఆనందానికి సరితూగేది మరేదీ లేదు. దీన్ని మాటల్లో కంటే చేతల్లో చూడండి. దీనిలోని పూర్తి నిజం, అనుభవం మీద తెలుస్తుంది. సమస్య - పరిష్కారం దేవుని కంటే దెబ్బే గురువు అన్నట్లు, ఈ కాలంలో భయపెట్టకుండా ఎవరిచేత ఏ పనీ చేయించుకోలేకపోతున్నాం. అలా చేయడం సబబేనా? -కె.వేణుగోపాల్, హైదరాబాద్ సద్గురు: ఒక్క విషయం గుర్తుంచుకోండి - అలా బలవంతపెట్టి పనిచేయించుకుంటే, పనిచేసినవారు మీరెప్పుడు చిక్కుతారా అని అవకాశం కోసం ఎదురుచూస్తుంటారు. అదను చూసి మీరు వేసిన దెబ్బ కంటే బలంగా వేస్తారు. మీరు మీ కుటుంబంలోనైనా, వ్యాపారంలోనైనా మీ చుట్టూ ఉన్నవారిపై ప్రేమతో ఉండాలి. అప్పుడే వారి నుండి మీకు పరిపూర్ణ సహాయం అందుతుంది. ఇదెలా సాధ్యమవుతుంది? ముందుగా మీరు వారి నుండి ఎటువంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా వారిపై మీరు ప్రేమ కురిపించాలి. మీపై నమ్మకం కలిగించుకోవాలి. మీరు వారి హృదయంలో చోటు చేసుకోవాలి. ఎప్పుడైతే మీరు ఆవలి మనసు చూరగొన్నారో అప్పుడు మీరెక్కడున్నా మీ పనులన్నీ సవ్యంగా జరిగిపోతాయి. మీరు ఉన్నా లేకపోయినా వారి కర్తవ్యాన్ని సక్రమంగా నెరవేర్చగలరు. ప్రేమతో అనితర సాధ్యమైన పనులను కూడా సాధించగలం. కాని భయాలు, బలవంతాల వల్ల ఏమీ చేయలేమన్నది నగ్న సత్యం. - జగ్గీ వాసుదేవ్ -
వివేకం: మీ శరీర తయారీదారు ఎవరు?
అంటువ్యాధులు వేరు; అవి బయటి నుండి జరిగే దాడి. వాటికి కొన్ని రకాల మందులు అవసరమౌతాయి. కాని దీర్ఘకాలిక అనారోగ్యం అంటే, మన లోపల మనమే సృష్టించుకునే కొన్ని లోపాల వల్ల మాత్రమే ఎక్కువగా వచ్చేవి. డెబ్భై శాతం పైగా దీర్ఘవ్యాధులను మనమే సృష్టించుకుంటున్నాం. శరీరంలోని ప్రతి కణానికీ బతికి ఉండాలనే ఒక సహజమైన తపన ఉంటుంది. ఇలా ఉన్నప్పటికీ, మన శరీరానికి వ్యతిరేకంగా అవి ఎందుకు పనిచేస్తాయి? శరీరం సంగతి చూద్దాం. ప్రస్తుతం ఉన్న ఇంత ఆకారంలో పుట్టలేదు మనం. తల్లి గర్భంలో కేవలం రెండు కణాలుగా మీరు మొదలయ్యారు. ఒక శిశువుగా బయటికి వచ్చారు. ఇప్పుడేమో ఇంత పెరిగారు. ఇదంతా ఎలా జరిగింది? ఈ శరీరాన్ని సృష్టిస్తున్న మౌలిక శక్తి ఏదో ఈ పనిచేసింది. అదే సృష్టికి ఆధారం. దానిని మీరు సృష్టికర్త అంటున్నారు. మీ జీవితపు అనుక్షణమూ, ఆ సృష్టి మీ శరీరం లోపలి నుంచే పనిచేస్తోంది. ఈ శరీరాన్ని తయారుచేసేవాడు లోపలే ఉన్నాడు. మీరు ఏదైనా ఒక మరమ్మతు చేయించాలనుకోండి. మీరు తయారుచేసినవాడి దగ్గరకు వెళ్దామనుకుంటారా? లేకపోతే దగ్గరలో అందుబాటులో ఉండే మెకానిక్ దగ్గరకా? మీకు తయారీదారు చిరునామా తెలియకపోతే, అప్పుడు దగ్గరలోని మెకానిక్ దగ్గరకు వెళ్తారు. కానీ మీకు తయారీదారు తెలిసినవాడైతే, అతని వద్దకు వెళ్లే చనువు ఉంటే, కచ్చితంగా తయారీదారు దగ్గరకే వెళ్తారు. అవునా? మీ లోపల మీరు సృష్టించుకునే వాటన్నింటికీ, దగ్గరలో అందుబాటులో ఉండే డాక్టర్ దగ్గరకు పరిగెత్తితే ప్రయోజనం లేదు. ఆధునిక వైద్యశాస్త్రం దీర్ఘ రోగాలను మేనేజ్ చేసుకోవడానికి మాత్రమే మీకు సహాయం చేస్తుంది. మిమ్మల్ని దీర్ఘరోగాల బారి నుండి ఎప్పటికీ బయటకు పడవేయలేదు. ఎందుకంటే దీర్ఘరోగాలు బయట నుండి రాలేదు కాబట్టి. అవి బయట నుండి వచ్చి ఉంటే, వాళ్లు వాటిని మీ నుంచి తీసివేసేస్తారు. కానీ అవి లోపల నుండే వస్తున్నప్పుడు, మీరే వాటిని సృష్టిస్తున్నప్పుడు, మిమ్మల్ని వాటి నుండి వారు ఎలా వదిలించగలరు? ఆరోగ్యం కేవలం భౌతికమైన అంశం కాదు. మనసులో జరిగేది ఏదో, సహజంగా అదే శరీరంలో కూడా కలుగుతుంది. తిరిగి శరీరంలో జరిగేది ఏదో, అదే మనసులో కలుగుతుంది. అందుచేత, ఇక్కడ మనం ఎలా జీవిస్తున్నాము, మన వైఖరి, మన భావోద్వేగాలు, మన మానసిక స్థితి, మనం జరిపించే కార్యకలాపాల స్థాయి, మన ఆలోచనలు... ఇవన్నీ మన ఆరోగ్యంతో తప్పనిసరిగా ముడిపడి ఉండే భాగాలు. మీ శరీరం తయారీదారు దగ్గరకు వెళితే వీటన్నిటికీ చికిత్స ఉంటుంది. ఆరోగ్యం అంతర్గతంగా కలగాలంటే, లోపల కొంత ఇంజనీరింగ్ చేయాలి మనం. శరీరం, బుద్ధి, భావాలు, ప్రాణశక్తి - అన్నీ చక్కటి సమతుల్యతలో ఉండే వాతావరణాన్ని, సృష్టించుకోవాలి కొన్ని సరళమైన ప్రక్రియలతో శరీరాన్నీ, బుద్ధినీ సంపూర్ణ ఆరోగ్యంతో నిర్మించుకోవచ్చు. నేను చెప్పే ‘ఇన్నర్ ఇంజనీరింగ్’ అంటే, సరిగ్గా అదే. మీ తయారీదారుని వద్దకు రహదారి నిర్మించటం. ఇక అప్పుడు ఆరోగ్యంగా ఉండటం మీ పనికాదు, ఆరోగ్యాన్ని ఇవ్వడం అతని వంతు కార్యక్రమం అవుతుంది. సమస్య - పరిష్కారం ప్రస్తుత అధిక జనాభా పరిస్థితుల్లో, నేను ఒక బిడ్డతోనే సరిపెట్టుకుందామనుకుంటున్నాను. ఇంట్లో తల్లిదండ్రులు మరొకరినైనా కనమని బలవంతపెడుతున్నారు. మీ సలహా ఏమిటి? - ఎం.వెంకటేశ్, చిత్తూరు సద్గురు: భారతదేశ ప్రస్తుత జనాభా ఒక బిలియన్ కంటే ఎక్కువ. ఇంతమందికి సరిపోయేంత భూమి, నీరు, పర్వతాలు, కనీసం ఆకాశం కూడా లేదు. 60% కంటే ఎక్కువ గ్రామీణ జనాభాకు, శరీర నిర్మాణం సరిగా లేదు. వారి శరీరం, మెదడు పూర్తి స్థాయికి ఎదగడం లేదు. కారణం, గర్భస్త శిశు దశ నుంచి వారికి తగిన పోషణ అందడం లేదు. 35% మంది పిల్లలు బరువు తక్కువతో పుడుతున్నారు. ఈ కారణాన వారు ఎప్పటికీ సరిగా ఎదగలేరు. ఏ పిల్లలకైతే, పిండ దశలో పోషకాహార సమస్యలుంటాయో, ఎవరైతే సరైన బరువుతో పుట్టరో, వారికి మీరు ఏమి చేసినా, వారి జీవితంలో వారి శరీరము, మెదడు పరిపూర్ణంగా ఎదగదు. అంటే, మనం ఒక పరిపుష్టి లేని సమాజాన్ని తయారుచేస్తున్నాం. ఇది అభివృద్ధి కాదు. నా దృష్టిలో పిల్లలను కనడం కన్నా సరైన పోషణ లేని కొందరి పిల్లలనైనా ఆదుకోవడం ఉత్తమం. మీ పెద్దలకు ఈ విషయాలు మీరు విడమర్చి చెబితే వారు ఒప్పుకోకపోరు. - జగ్గీ వాసుదేవ్