ఓ రోజు యోగా నేర్పినందుకు గురుదక్షణ?
విజయవాడ: యోగా గురువు జగ్గీవాసుదేవ్కు చంద్రబాబు ప్రభుత్వం 400 ఎకరాలను కేటాయించడంపై కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. శుక్రవారం విజయవాడలో ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ.... ఓ రోజూ సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలకు యోగా నేర్పినందుకు గురుదక్షణగా 400 ఎకరాలను వాసుదేవ్కు కేటాయించారా? అని ఆయన చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
జగ్గీవాసుదేవ్కు ఏ హోదా ఉందని సీఎం, మంత్రులు, అధికారులు రెడ్ కార్పెట్ పర్చుతున్నారని ఆయన ఆగ్రహాం వ్యక్తం చేశారు. ఏకంగా 400 ఎకరాల అటవీ భూమిని యోగా స్కూల్కు కేటాయించటం సరికాదని ఆయన చంద్రబాబు ప్రభుత్వానికి హితవు పలికారు. జగ్గీవాసుదేవ్కు భూమిని ఇవ్వడానికి వీలులేదని మల్లాది విష్ణు అన్నారు.