హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు జగ్గీ వాసుదేవన్ ఆదివారం భేటీ కానున్నారు. మదీనగూడలోని చంద్రబాబు ఫాంహౌస్‌లో ఆయన కలుస్తారు. ఈ భేటీలో చంద్రబాబు కుటుంబసభ్యులు కూడా పాల్గొంటారు.
జగ్గీ వాసుదేవ్ గతంలో ఏపీ మంత్రులు, అధికారులకు యోగాలో శిక్షణనిచ్చారు. ఆ తర్వాత ఆయన సంస్థలు ఏర్పాటు చేసేందుకు కృష్ణా జిల్లాలో 400 ఎకరాల భూమిని ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించింది. దీనిపై అప్పట్లో రాజకీయ పార్టీలు అభ్యంతరం తెలపడంతో ప్రభుత్వం వెనక్కితగ్గిన విషయం తెలిసిందే.
రేపు బాబుతో జగ్గీ వాసుదేవన్ భేటీ
Published Sat, Mar 26 2016 7:18 PM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement
Advertisement