న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టాని(సీఏఏ)కి మద్దతు కూడగట్టేందుకు బీజేపీ సోమవారం సోషల్ మీడియా వేదికగా ‘ఇండియా సపోర్ట్ సీఏఏ’పేరుతో సరికొత్త ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా ఆ«ధ్యాత్మిక గురువు జగ్గీ వాసుదేవ్ సీఏఏకు అనుకూలంగా మాట్లాడిన వీడియో క్లిప్పింగ్‌ను ప్రధాని మోదీ పోస్ట్ చేశారు. శరణార్థులకు పౌరసత్వం ఇవ్వడం కోసమే సీఏఏ తప్ప ఎవరి పౌరసత్వాన్నీ తొలగించేది కాదంటూ మోదీ వ్యక్తిగత ట్విట్టర్ ఖాతాలో ట్వీట్‌చేశారు. ‘ఇండియా సపోర్ట్ సీఏఏ’హ్యాష్‌ట్యాగ్ తో ఈ మెసేజ్‌ను పోస్ట్ చేశారు. అలాగే, సీఏఏ అనుకూల ప్రజాస్పందనను ప్రతిబింబించే వివిధ అంశాలనూ, వీడియోలనూ, గ్రాఫిక్స్‌నూ ప్రధానమంత్రి నమో యాప్‌లో పెట్టాలని ప్రజలను కోరారు. సీఏఏ భారత పౌరులకు ఎలాంటి నష్టం చేకూర్చదని, మతపర వివక్ష ఈ చట్టంలో లేదని, అందుకే సమర్థిస్తున్నామంటూ బీజేపీ ఉపాధ్యక్షుడు వై జయంత్ జే పాండా ట్వీట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment