
హాలీవుడ్ స్టార్ హీరో విల్ స్మిత్ అంటే సినీ ప్రియులకు తప్ప ఇంకేవరికి పెద్దగా పరిచయం లేదు. కానీ ఇటీవల నిర్వహించిన ఆస్కార్ వేడుకల్లో హోస్ట్, కమెడియన్ క్రిస్‌రాక్‌పై విల్ స్మిత్ చేయి చేసుకోవడంతో ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయ్యాడు.
Will Smith In India And Spotted At Mumbai Airport After Slap Controversy: హాలీవుడ్ స్టార్ హీరో విల్ స్మిత్ అంటే సినీ ప్రియులకు తప్ప ఇంకేవరికి పెద్దగా పరిచయం లేదు. కానీ ఇటీవల నిర్వహించిన ఆస్కార్ వేడుకల్లో హోస్ట్, కమెడియన్ క్రిస్‌రాక్‌పై విల్ స్మిత్ చేయి చేసుకోవడంతో ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయ్యాడు. ఈ సంఘటన తర్వాత విల్ ఎన్నో సమస్యలను ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. మోషన్ పిక్చర్ అకాడమీ విల్‌స్మిత్‌పై 10 ఏళ్ల నిషేధం కూడా విధించింది. ఇదిలా ఉంటే విల్ స్మిత్ తాజాగా ఇండియా బాట పట్టాడు. శనివారం (ఏప్రిల్ 23) ముంబై విమానాశ్రయం వద్ద విల్ స్మిత్ దిగిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. చెంపదెబ్బ ఘటన తర్వాత విల్ కెమెరాలకు చిక్కడం ఇదే తొలిసారి.
విల్ స్మిత్ జుహులోని జెడబ్ల్యూ మారియట్‌హోటల్‌లో బస చేస్తున్నట్లు సమాచారం. అయితే విల్ స్మిత్ ఇండియాకు రావడానికి కారణం ఏంటని తీవ్రంగా చర్చ నడుస్తోంది. అందులోనూ ఇలాంటి సమయంలో రావడం హాట్ టాపిక్‌గా మారింది. ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సద్గురు జగ్గీ వాసుదేవ్‌ను కలిసేందుకే విల్ స్మిత్ వచ్చినట్లు రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. చెంపదెబ్బ ఘటనతో విల్ కొద్ది రోజులుగా విచారంగా ఉన్నాడట. దీంతో సద్గురు వద్ద కొంత సమయం గడిపేందుకు వచ్చాడని సమాచారం. ఈ విషయంపై ఎలాంటి అదికారిక ప్రకటన మాత్రం ఇంతవరకు వెలువడలేదు. గతంలో విల్ స్మిత్ సద్గురుకు తన ఇంట్లో ఆతిథ్యం ఇచ్చిన విషయం తెలిసిందే. 2019లో కూడా విల్ స్మిత్ భారతదేశాన్ని సందర్శించాడు. అప్పుడు పలువురు బాలీవుడ్ ప్రముఖులను కలిసి ముచ్చటించాడు. మరీ ఈసారి ఎవర్నైనా కలుస్తాడా ? లేదో ? చూడాలి.
చదవండి: విల్ స్మిత్‌పై 10 ఏళ్లు నిషేధం, స్పందించిన హీరో
చెంపదెబ్బ ఎఫెక్ట్.. ఆగిపోయిన విల్ స్మిత్ సినిమాలు !