
ఢిల్లీ: ప్రముఖ ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్(66) శరవేగంగా కోలుకుంటున్నారు. తలకు బ్యాండేజ్ ప్యాచ్‌తో ఆస్పత్రిలో బెడ్ మీద ఆయన పేపర్ చదువుతూ ఉండగా.. వీడియో తీసిన ఆయన కుమార్తె రాధే జగ్గీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఆయన అభిమానులు, శిష్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
మెదడులో రక్తస్రావం కారణంగా ప్రాణాపాయ స్థితికి చేరుకున్న సద్గురు.. ఎమర్జెన్సీ బ్రెయిన్ సర్జరీ చేయించుకున్న సంగతి తెలిసిందే. మెదడు, కపాలం మధ్య చేరిన రక్తాన్ని తొలగించడానికి ఈ నెల 17న న్యూఢిల్లీలోని ఇంద్రప్రస్థ అపోలో ఆసుపత్రిలో వైద్యులు సర్జరీ చేశారు.
#Sadhguru #SpeedyRecovery pic.twitter.com/rTiyhYPiJM
— Sadhguru (@SadhguruJV) March 25, 2024
సద్గురుకి సర్జరీ విషయం తెలియగానే ఆయన అభిమానులు, శిష్యుల్లో ఆందోళన నెలకొంది. అయితే ఆయన త్వరగా కోలుకుని మన ముందుకు వస్తారంటూ ఈశా ఫౌండేషన్ ఒక ప్రకటన చేసింది. మరోవైపు.. ఆ టైంలో సద్గురుతో మాట్లాడానని, ఆయన ఆరోగ్యం త్వరగా మెరుగుపడాలని ఆకాంక్షిస్తున్నట్లు ప్రధాని మోదీ సైతం ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. ఇక తాము ఊహించిందానికంటే వేగంగా ఆయన కోలుకుంటున్నారని.. త్వరలోనే డిశ్చార్జి చేస్తామని వైద్యులు ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment