
వయసుతో సంబంధం లేకుండా తెలుగు ప్రేక్షకులకు కామెడీ ఇష్టం. యూట్యూబ్‌లో అయితే బ్రహ్మానందం, సునీల్ కామెడీ వీడియోలు తెగ చూసేస్తుంటారు. ఇప్పుడు అలానే 'అదుర్స్' సినిమాలోని బ్రహ్మీ కామెడీ వీడియోలు చూస్తుండగా 55 మహిళకు డాక్టర్స్ సర్జరీ చేశారు. కాకినాడలోని జీజీహెచ్‍లో ఈ సంఘటన జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో కూడా ఇప్పుడు వైరల్ అవుతోంది.
(ఇదీ చదవండి: లైంగిక వేధింపుల కేసు.. పరారీలో జానీ మాస్టర్)
కొత్తపల్లికి చెందిన 55 ఏళ్ల అప్పన్న అనంతలక్ష‍్మికి ఏడాదిగా కుడి కాలు, కుడి చెయ్యి లాగేస్తుండటం వల్ల బాధపడుతోంది. ఈ క్రమంలోనే ఆమెకు పలు పరీక్షలు చేయగా మెదడులో ఎడమవైపు ట్యూమర్ ఉందని గుర్తించారు. దీన్ని అలానే వదిలేస్తే పక్షవాదం వచ్చే ప్రమాదం ఉందని చెప్పి సర్జరీకి సిద్ధమయ్యారు. అయితే మత్తు మందు ఇవ్వకుండా ఆమెకు ఇష్టమైన బ్రహ్మానందం వీడియోలు చూపిస్తూ క్రైనీయాటమీ సర్జరీ పూర్తి చేశారు.
ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ సర్జరీ చేశారు. ఇది విజయవంతం కావడంతో వైద్యులపై ప్రశంసలు కురుస్తున్నాయి. అలానే శస్త్రచికిత్స చేస్తున్నప్పుడు సదరు మహిళ బ్రహ్మానందం కామెడీ సీన్స్ చూస్తున్న ఆరు సెకన్ల వీడియో ఒకటి వైరల్ అవుతోంది.
(ఇదీ చదవండి: ఎన్టీఆర్ నోట తమిళనాడు ఫేమస్ బిర్యానీ.. ఏంటంత స్పెషల్?)
Comments
Please login to add a commentAdd a comment