ఈ నెల 8న మహాశివరాత్రి. ఈ సందర్భంగా దేశ వ్యాప్తంగా పలుచోట్ల ఆధ్మాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. తమిళనాడులోని కోయంబత్తూరులోగల ‘ఈశా’ ఫౌండేషన్ రాబోయే మహశివరాత్రి వేడుకలను ఆదియోగి విగ్రహం ముందు అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.
ఈ వేడుకల్లో భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్, ప్రముఖ గాయకుడు శంకర్ మహదేవన్ ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. ఈ మెగా వేడుక మార్చి 8వ తేదీ సాయంత్రం 6 గంటల నుండి మార్చి 9వ తేదీ ఉదయం 6 గంటల వరకు సద్గురు యూట్యూబ్ ఛానల్‌లో, ప్రధాన మీడియా నెట్‌వర్క్‌లలో ప్రసారం కానుంది.
ఆరోజు అర్ధరాత్రి, బ్రహ్మ ముహూర్త సమయంలో ఈశా ఫౌండేషన్ వ్యవస్థాపకులు ‘సద్గురు’ జగ్గీవాసుదేవ్ భక్తులను శివుని ధ్యానంలో లీనమయ్యేలా చేయనున్నారు. కాగా గతంలో జరిగిన ‘ఈశా’ మహాశివరాత్రి వేడుకల లైవ్ స్ట్రీమింగ్ పలు రికార్డులను బద్దలు కొట్టింది. 2023లో ‘ఈశా’లో జరిగిన మహాశివరాత్రి వేడుకలను 14 కోట్ల మంది వీక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment