ఆర్‌పీఎఫ్ అదుపులో నకిలీ టీసీ | Arpieph control the pseudo-TC | Sakshi
Sakshi News home page

ఆర్‌పీఎఫ్ అదుపులో నకిలీ టీసీ

Published Tue, Feb 24 2015 1:53 AM | Last Updated on Sat, Sep 2 2017 9:47 PM

ఆర్‌పీఎఫ్ అదుపులో నకిలీ టీసీ

ఆర్‌పీఎఫ్ అదుపులో నకిలీ టీసీ

బాపట్లటౌన్` వివరాల్లోకి వెళితే కృష్ణాజిల్లా అవనిగడ్డ మండలం వేకనూరు గ్రామానికి చెందిన బోగాది వెంకటనాగశ్రీహరిప్రసాద్ అలియాస్ బీవీఎన్‌ఎస్ ప్రసాద్ సోమవారం ఉదయం తెనాలి నుంచి ఒంగోలు వెళ్తున్న 67256 నంబర్ గల పాసింజర్ రైలులో ప్రయాణిస్తూ టీసీని అని చెప్పి రైల్లో టికెట్లు లేని ప్రయాణికులను బెదిరించి వారి వద్ద నుంచి రూ.250 వసూలు చేశారు.
 
అదుపులోకి తీసుకుందిలా...
రైలు బాపట్లలో నిలిచిన సమయంలో బాపట్ల స్టేషన్‌లో దిగి బీవీఎన్‌ఎస్ ప్రసాద్ అనుమానస్పదంగా ప్లాట్‌ఫామ్‌పై తిరుగుతుండడాన్ని గమనించిన ఆర్‌పీఎఫ్ ఏఎస్‌ఐ ఎస్.సుధాకరరావు అతన్ని అదుపులోకి తీసుకొని వివరాలు సేకరించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చిన్నప్పటి నుంచి రైల్వే ఉద్యోగి కావాలనే కోరిక ఉండేదని, అది నెరవేరకపోవడంతో ఇలాంటి చేష్టలకు అలవాటు పడటం జరిగిందని ప్రసాద్ తెలిపారన్నారు. మరిన్ని వివరాల సేకరించేందుకు ఆర్‌పీఎఫ్ పోలీసులు ప్రసాద్‌ను జీఆర్‌పీ పోలీసులకు అప్పగించారు. నిందితుడిన్ని అదుపులోకి తీసుకున్న ఆర్‌పీఎఫ్ ఏఎస్‌ఐ ఎస్.సుధాకర్‌రావు, కానిస్టేబుల్ డి.సుబ్రమణ్యంలను ఆర్‌పీఎఫ్ ఉన్నతాధికారులు ఫోన్‌లో అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement