దెందులూరు మండలం వీరం పాలెం వద్ద ఈనెల 20న వెంకటేశ్వర శాస్త్రి అనే పూజారిని అడ్డగించి దారి దోపీడీకి పాల్పడిన ఇద్దరు యువకులను ఏలూరు రూరల్ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు.
దెందులూరు మండలం వీరం పాలెం వద్ద ఈనెల 20న వెంకటేశ్వర శాస్త్రి అనే పూజారిని అడ్డగించి దారి దోపీడీకి పాల్పడిన ఇద్దరు యువకులను ఏలూరు రూరల్ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. వీరి నుంచి ఓ బ్రాస్లెట్, ఓ చైన్, ఒక సెల్‌ఫోన్, రూ.10వేల నగదు రికవరీ చేశారు. పట్టుబడిన నిందితులు సదాశివరావు, గొరిపర్తి రమేశ్‌లు అదే గ్రామానికి(వీరంపాలెం) గ్రామానికి చెందిన యువకులు. పూజారి పూజ ముగించుకుని ఒంటరిగా వెళ్తున్న సమయంలో దారిదోపిడీకి పాల్పడ్డారు.ఏలూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.