తల్లికి గోరుముద్దలు తినిపిస్తున్న పిల్లలు
అమ్మ కళ్ల ముందే ఉంది.. కానీ గోరు ముద్దలు తినిపించలేకపోతోంది. ఆ తల్లి పిల్లల ఎదురుగానే ఉంది. కానీ దగ్గరకు తీసుకోలేకపోతోంది. అంతుచిక్కని వ్యాధి అమ్మను కబళించేస్తుంటే.. ఆ పిల్లలు చూడలేకపోతున్నారు. తల్లిని కాపాడుకునేందుకు సర్వ ప్రయత్నాలు చేస్తున్నారు. మూడు పూటలా తినిపించడం దగ్గర నుంచి మందులు వేయించడం వరకు అన్ని బాధ్యతలు వారివే. కన్నతల్లిని కళ్లలో పెట్టుకుని చూసుకుంటున్నారు. చికిత్స కోసం మాత్రం సమాజం నుంచి కాస్త సాయం కోరుతున్నారు. ‘మా అమ్మ మళ్లీ మాకు నవ్వుతూ కనిపించాలి’ అంటూ చే యూత అర్థిస్తున్నారు.. రణస్థలం మండలం కమ్మశిగడాం గ్రామానికి చెందిన సునీత అనే మాతృమూర్తి కోసం భర్త, పిల్లలు పడుతున్న ఆ..వేదన.
రణస్థలం రూరల్: రణస్థలం మండలం కమ్మశిగడాంకు చెందిన కాపరపు మహాలక్ష్ము నాయీ బ్రాహ్మణుడు. కుల వృత్తి చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవారు. అప్పుడప్పుడూ కూలి పనులకు కూడా వెళ్లేవారు. ఈయనకు 2006 లో ఒడిశాకు చెందిన సునీతతో వివాహమైంది. ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. జీవితం సాఫీగా సాగుతుండగా నాలుగేళ్ల కిందట సు నీత ఓ దీర్ఘకాలిక వ్యాధితో మంచాన పట్టింది. ఎన్ని ఆస్పత్రులకు తిరిగినా ఫలితం కనిపించలేదు. ఓ వైపు పేదరికం, ఇంకోవైపు అంతు చిక్కని వ్యాధి, మరోవైపు పిల్లలు చదువులు.. ఇన్ని బాధ్యతల నడుమ మహాలక‌్ష్ము నలిగిపోతున్నాడు. ప్రభుత్వం పింఛన్ సదుపాయం క ల్పించాలని కోరుతున్నాడు. రోజూ వంట చేసి కూలి పనికి వెళ్లి తిరిగి వచ్చే వరకు తన భార్య ఆలనాపాలనా పిల్లలే చూసుకుంటున్నారని, ఈ యాతన తప్పేలా చికిత్స కోసం దాతలు సాయం చేయాలని అభ్యర్థిస్తున్నాడు.
వంట చేసి పనికి వెళ్తున్నా..
వంట చేసి నా భార్యకు పిల్లలకు భోజనం పె ట్టి కూలి పనులకు వెళ్తుంటాను. పిల్లలే వాళ్ల అ మ్మకు భోజనం తినిపిస్తుంటారు. నేను కూలికి వెళ్తే తప్ప పూట గడవదు. పింఛన్‌కు దరఖాస్తు చేసుకుందామంటే కరోనా సమయంలో సద రం సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. దాతలే మమ్మల్ని ఆదుకోవాలి.
– మహాలక‌్ష్ము, సునీత భర్త
అమ్మ త్వరగా కోలుకోవాలి..
నా చిన్నతనం నుంచి అమ్మను మంచంపైనే చూస్తున్నాను. ఆమె త్వరగా కోలుకోవాలి. అ మ్మకు బాగవ్వాలని రోజూ దేవుడిని ప్రార్థి స్తున్నాం.
– మణికంఠేశ్వరి, పెద్ద కుమార్తె
సాయం చేయదలచుకున్న వారు 78936 41275 ఫోన్ నంబర్‌కు కాల్ చేసి సాయం అందించాలని కుటుంబం విజ్ఞప్తి చేసింది.
Comments
Please login to add a commentAdd a comment