చికిత్స పొందుతున్న రామగిరి శ్రావణ్
సాక్షి,జ్యోతినగర్(పెద్దపల్లి): జాండీస్ బారినపడి లివర్, కిడ్నీలు సరిగా పనిచేయకపోవడంతో ఓ నిరుపేద వైద్య ఖర్చులకు దాతల సాయ కోసం ఎదురుచూస్తోంది. మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లు సూచించడంతో అప్పులు చేస్తూ ఆస్పత్రిలో చికిత్స చేయిస్తున్నారు. తన భర్తను ఎలాగైనా కాపాడుకోవాలని ఆ ఇల్లాలు దీనంగా రోధిస్తుంది. రామగుండం కార్పొరేషన్ నాలుగో డివిజన్ కృష్ణానగర్‌కు చెందిన రామగిరి శ్రావణ్‌కుమార్ కిరాణా వ్యాపారం చేసుకుంటూ భార్య మౌనిక, తల్లి లలిత, కుమారులు మోక్షానంద్(మూడేళ్లు), అనిరుధ్(మూడు నెలలు)లతో జీవిస్తున్నాడు.
ఈ క్రమంలో శ్రావణ్‌కుమార్ అనారోగ్యంతో ఆస్పత్రికి వెళ్లాడు. వైద్య పరీక్షల అనంతరం డాక్టర్లు జాండీస్ ఎఫెక్ట్‌తో లివర్, కిడ్నీలు సరిగ్గా పనిచేయడం లేదని మెరుగైన వైద్యం అందించాలన్నారు. దీంతో ఆ కుటుంబం అప్పులు చేసి హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. ఆరోగ్యం మెరుగుపడటానికి ఇంకా డబ్బులు ఖర్చు అవుతాయని డాక్టర్లు తెలుపడంతో దాతలు ఆదుకోవాలని కుటుంబసభ్యులు వేడుకుంటున్నారు.
సాయం చేయాలనుకునే దాతలు
రామగిరి శ్రావణ్‌కుమార్
గూగుల్ పే, ఫోన్ పే: 8465921213
Comments
Please login to add a commentAdd a comment