
ఉరేసుకుని
కథలాపూర్(వేములవాడ): కథలాపూర్ మండలకేంద్రానికి చెందిన ఆకుల శృతి (27) సోమవారం ఉదయం తన ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. శృతి ఎంకాం పూర్తి చేసింది. పోటీ పరీక్షల కోసం ప్రిపేరవుతూ.. ఇటీవలే గ్రూప్–1, 2 పరీక్ష రాసినా మంచి ర్యాంక్ రాలేదు. వీటికితోడు శృతి తండ్రి శ్రీనివాస్ అనారోగ్యంతో మంచానికి పరిమితమయ్యాడు.
మరోవైపు శృతి ఏడాదికాలంగా కడుపునొప్పితో బాధపడుతోంది. చికిత్స చేయించుకుందామంటే ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మనస్తాపానికి గురైన శృతి ఇంట్లోనే ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. శృతి తల్లి రోజ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నవీన్‌కుమార్ పేర్కొన్నారు.
పండుగ కోసం వచ్చి.. ప్రాణాలు వదిలి..
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
సుల్తానాబాద్‌రూరల్ (పెద్దపల్లి): ఐతరాజుపల్లి గ్రామ శివారులో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎలిగేడు మండలం సుల్తాన్‌పూర్ గ్రామానికి చెందిన పంగ నిఖిల్(26) మృతి చెందాడు. ఎస్సై శ్రావణ్‌కుమార్ కథనం ప్రకారం.. పంగ భాస్కర్–పద్మ దంపతుల కుమారుడు నిఖిల్ హైదారాబాద్‌లో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. ఉగాది పండుగ కోసమని ఈనెల 29న స్వగ్రామానికి వచ్చాడు. ఆదివారం సాయంత్రం ఐతరాజుపల్లిలోని తన స్నేహితుడి ఇంటికి వెళ్లి రాత్రి ద్విచక్ర వాహనంపై తిరిగి ఇంటికి బయలు దేరాడు. ఈక్రమంలో ప్రమాదవాశాస్తు ద్విచక్ర వాహనంపై నుంచిపడి తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి తండ్రి ఇచి్చన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై వివరించారు.