helping actions
-
అమ్మా.. బతకాలని ఉంది!
కరీంనగర్: ‘అమ్మా.. నాన్న నాకు బతకాలని ఉంది. మీరు ఇన్నిరోజులు నా కోసం ఎంతోడబ్బు ఖర్చు చేశారు. ఇక డబ్బులు లేవని బాధపడకండి.. నేను మంచి మార్కులతో ఇంటర్మీడియెట్ పాసైన. జీవితంలో మరిన్ని సాధించాలని ఉంది. కానీ, నా అనారోగ్య సమస్యలతో ఇబ్బందిగా ఉంది. ప్రభుత్వం, దాతలు దయ తలచి సాయం అందించి నా ప్రాణాలు కాపాడండి.. ప్లీజ్’ అంటోది కూనారపు సిరి.చదువులో మిన్న..రామగుండం కార్పొరేషన్ మూడో డివిజన్ జంగాలపల్లెలో నివసిస్తున్న కూనారపు పోశం–వెంకటలక్ష్మి దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పోశం సెంట్రింగ్ పనులు చేస్తూ కుటుంబాన్ని పో షిస్తున్నాడు. ఏడాది క్రితం పెద్దకూతురు సిరి గో దావరిఖని ప్రభుత్వ కళాశాలలో ఇంటర్ సీఈసీ విభాగంలో 927 మార్కులు సాధించి కళాశాల టాపర్‌గా నిలిచింది. కానీ, చదువులో గెలిచినా.. అనారోగ్యం ఆమెను వెంటాడుతోంది. ఆటో ఇ మ్యూన్ వ్యాధి బారిన పడడంతో కిడ్నీలు పనిచే యడం లేదని వైద్యులు తెలిపారు. వారి సూచన మేరకు వారానికి రెండుసార్లు డయాలసిస్ చేస్తు న్నారు. కిందుకోసం తల్లిదండ్రులు చాలావరకు అప్పు చేసి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.దాతలు ఆదుకోండి.. ప్రాణాలు కాపాడండి..ఆర్థిక ఇబ్బందులతో చదువుల తల్లి ఇబ్బంది పడుతున్న విషయాన్ని ప్రభుత్వం, మనసున్న దాతలు స్పందించి ఆదుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. తమ తూతురు ప్రాణాలు కాపాడి పునర్జన్మ ప్రసాదించాలని వారు వేడుకుంటున్నారు.సాయం అందించే వారు..కూనారపు పోశం: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాఖాతా నంబర్: 62414082268ఐఎఫ్ఎస్సీ కోడ్: ఎస్బీఐఎన్ 0011086గూగుల్ పే, ఫోన్‌పే నం: 99590 59795అమ్మ వెంకటలక్ష్మి: 93985 57486తండ్రి పోశం: 89774 79397 -
Kaushal Shetty: పచ్చటి గూడుతో...
ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు నిరాశ్రయులైన ప్రజల కోసం 27 సంవత్సరాల కౌశల్ శెట్టి ‘నోస్టోస్ హోమ్స్’ పేరుతో స్వచ్ఛందసంస్థను ప్రారంభించి దేశవ్యాప్తంగా సహాయక కార్యక్రమాలలో పాల్గొంటున్నాడు. నిరాశ్రయుల కోసం ఈ సంస్థ తేలికపాటి, ఈజీ ట్రాన్స్‌పోర్టబుల్ షెల్టర్స్‌ను రూపొందించింది... ‘అనుభవమైతేగానీ తత్వం బోధపడదు’ అంటారు. ‘తత్వం’ మాట ఎలా ఉన్నా కౌశల్ షెట్టికి ‘కర్తవ్యం’ బోధపడింది. షెట్టిదీ కర్నాటకలోని ఉడిపికి సమీపంలోని మది అనే గ్రామం. పచ్చదనానికి ఈ గ్రామం పర్ఫెక్ట్ అడ్రస్. అలాంటి పచ్చటి ఊరు కాస్తా ఘటప్రభ నది పొంగి పొర్లడంతో అల్లకల్లోలం అయింది. అంతెత్తు చెట్లు నిలువునా కూలి పోయాయి. పొలాలు మునిగిపోయాయి. ఇండ్లు ఘోరంగా దెబ్బతిన్నాయి. ఇంట్లో ఉండలేని పరిస్థితి. దీంతో ప్రజలు తట్టాబుట్టా సర్దుకొని ఊరు విడిచి తోచిన దిక్కుకు వెళ్లారు. షెట్టి కుటుంబం ముంబైకి వెళ్లింది. ముంబైకి వెళుతున్నప్పుడు షెట్టి మనసు బాధతో నలిగిపోయింది. దీనికి కారణం...ఎటు పోవాలో తెలియక, గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆ ఊళ్లోనే ఉండిపోయిన ప్రజలు. సంవత్సరాలు గడుస్తున్నా ఆ బాధ తన నుంచి దూరం కాలేదు. ఖరగ్‌పూర్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చదుకునే రోజుల్లో మరోసారి తుఫాను బీభత్సాన్ని, బాధితులు, నిరాశ్రయుల కష్టాలు, కన్నీళ్లను దగ్గర నుంచి చూశాడు. ‘ఇలా బాధ పడుతూ కూర్చోవడం తప్ప నేను ఏం చేయలేనా!’ అనుకున్నాడు షెట్టి. ఎన్నో రకాలుగా ఆలోచించిన తరువాత... తన స్నేహితుడు మాధవ్ దత్తో కలిసి ‘నోస్టోస్ హోమ్’ అనే స్వచ్ఛంద సంస్థను ప్రారంభించాడు. ‘ప్రకృతి వైపరీత్యాల కారణంగా ప్రతి సంవత్సరం వందలాది మంది ప్రజలు నిరాశ్రయులవుతున్నారు. అలాంటి వారికి నిలువ నీడ కల్పించడానికి మా సంస్థ ద్వారా కృషి చేస్తున్నాం’ అంటున్నాడు షెట్టి. తమ సంస్థ ట్రాన్స్‌పోర్టబుల్ హోమ్స్ గురించి చెబుతూ... ‘పర్సనల్ డిగ్నిటీ, ప్రైవసీతో కూడిన హోమ్స్ ఇవి’ అంటాడు షెట్టి. ‘నోస్టోస్ హోమ్’ సంస్థ అస్సాం, నాగాలాండ్ రాష్ట్రాలతో పాటు ఆఫ్రిక దేశాలలోనూ సేవలు అందిస్తోంది. కౌశల్ చేపట్టే సేవాకార్యక్రమాలకు అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు లభిస్తున్నాయి. ‘తక్కువ సమయంలోనే బాధితులకు సహాయం అందించి నిరాశ్రయులకు అండగా నిలబడింది కౌశల్ బృందం. నిపుణుల సహాయంతో సౌకర్యాలు సమకూర్చారు’ అంటున్నాడు హాబిటాట్ ఫర్ హ్యూమానిటీ మలావి నేషనల్ డైరెక్టర్ కపీరా. ఇక షెట్టి భవిష్యత్ లక్ష్యం విషయానికి వస్తే... తన సేవాకార్యక్రమాలను మరింత విస్తృతం చేయాలనుకుంటున్నాడు. మారుమూల ప్రాంతాలలో వైద్య సౌకర్యాల మెరుగుదల కోసం కృషి చేయాలనుకుంటున్నాడు. ‘నోస్టోస్ హోమ్’తో తొలి అడుగు వేసినప్పుడు ‘నిజంగా నేను చేయగలనా?’ అనే సందేహం షెట్టికి వచ్చేది. మంచి పని కోసం బయలు దేరినప్పుడు ఎన్నో ద్వారాలు మన కోసం తెరుచుకుంటాయి...అన్నట్లుగా షెట్టికి ఎంతోమంది ఎన్నో రకాలుగా సహాయం అందించారు. కొన్ని అడుగులు పడిన తరువాత శెట్టికి తనపై తనకు ఎంతో నమ్మకం వచ్చింది. ఆ నమ్మకమే మరిన్ని సేవాకార్యక్రమాలు చేపట్టాలనే లక్ష్యం నిర్దేశించుకోవడానికి కారణం అయింది. -
ఉత్తరాఖండ్‌లో కొండచరియల బీభత్సం
డెహ్రాడూన్: భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడటంతో ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఆరుగురు చనిపోయారు. ఘాట్ ప్రాంతాలున్న చమోలీ జిల్లాలో కొండచరియలు విరిగిపడటంతో ఆ శిధిలాల్లో చిక్కుకుని మహిళ, ఆమె 9 నెలల కూతురు సహా ఆరుగురు మృతి చెందారు. బద్రీనాథ్– పగల్నాలా, రిషికేష్– కేదార్నాథ్ రహదారుల్లో రవాణా సైతం కొండచరియలు విరిగిపడిన కారణంగా నిలిచిపోయింది. రాష్ట్రంలో పోటెత్తిన చాఫ్లాగద్ నది ధాటికి పక్కనే ఉన్న ఇళ్లు, భవనాలు, షాపులు కుప్పకూలి నీటిలో కొట్టుకుపోయాయి. జమ్మూకశ్మీర్‌లోని రిసాయి జిల్లాలో ఓ పెద్ద బండరాయి విరిగిపడటంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. మరోవైపు, భారీ వర్షాలతో అతలాకుతలమైన కేరళ, కర్నాటక, మహారాష్ట్ర, గుజరాత్ ల్లో సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. పై నాలుగు రాష్ట్రాల్లో వర్షాలు, వరద కారణంగా మృతి చెందిన వారి సంఖ్య సోమవారానికి 199కి చేరగా, కేవలం కేరళలోనే 83 మంది చనిపోయారు. అయితే, మలప్పురంలో ఇంకా 50 మంది వరకు జాడ తెలియని నేపథ్యంలో మృతుల సంఖ్య ఇంకా పెరగొచ్చని అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. కేరళలో 2.87 లక్షల మంది ఇంకా సహాయ కేంద్రాల్లోనే ఉన్నారు. గుజరాత్‌లోని కచ్ జిల్లాలో వరదల్లో చిక్కుకుపోయిన 125 మందిని భారత వైమానిక దళం కాపాడింది. మహారాష్ట్రలోని కొల్హాపూర్ సమీపంలో వరదల కారణంగా గత 6 రోజులుగా మూసివేసి ఉన్న ముంబై– బెంగళూరు హైవేపై సోమవారం వాహనాలకు పాక్షికంగా అనుమతి ఇచ్చారు. వర్షాలకు భారీగా ధ్వంసమైన తన నియోజకవర్గం వాయినాడ్(కేరళ)లో కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పర్యటించి, బాధితులను పరామర్శించారు. వరద సహాయ చర్యల్లో పాలుపంచుకోవాల్సిందిగా కాంగ్రెస్ శ్రేణులను కోరారు. -
కేరళకు అందరూ అండగా నిలవాలి
హైదరాబాద్: ప్రకృతి వైపరీత్యాలతో తీవ్రంగా నష్టపోయిన కేరళ రాష్ట్ర పునర్నిర్మాణంలో ప్రతీ ఒక్కరు భాగస్వాములు కావాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టి.బి.రాధాకృష్ణన్ పిలుపు నిచ్చారు. ఆదివారం రవీంద్రభారతిలో కాన్ఫె డరేషన్ ఆఫ్ తెలుగు రీజియన్ మలయాళీ అసోసియేషన్ సంస్థ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక, పర్యాటక శాఖలతో కలసి కేరళ వరద సహాయనిధి సేకరణను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హైకోర్టు చీఫ్‌జస్టిస్ టి.బి.రాధాకృష్ణన్ మాట్లాడుతూ కష్ట కాలంలో ఉన్న కేరళ రాష్ట్రానికి అండగా నిలవాల్సిన అవసరం ఎంతగానో ఉందన్నారు. దేశం మొత్తం కేరళ రాష్ట్రానికి అండగా నిలుస్తోందనీ, సకాలంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం అభినందనీయమన్నారు. తెలంగాణ రాష్ట్ర సాంస్కృతికశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం కూడా మాట్లాడారు. ముందుకు వచ్చిన దాతలు.. రవీంద్ర భారతి ప్రాంగణంలో నిర్వహించిన కేరళ వరద సహాయనిధి సేకరణకు విశేష స్పందన లభించింది. కేరళ వరదల బాధితులకు హైదరాబాద్ నగరవ్యాప్తంగా ప్రముఖులతోపాటు సాధారణ ప్రజలు సైతం తమకు తోచినంత సాయం చేశారు. హైదరాబాద్, సికింద్రాబాద్ రోటరీ క్లబ్ రూ.4 లక్షలు, ఇంక్రడబుల్ ఇండియా రూ.2 లక్షలు, విజయాబ్యాంక్ రూ.2 లక్షలు, ఐఏఎస్ అధికారి విజయ్‌కుమార్, జిల్లా జడ్జి రాధారాణిలు తమ నెల జీతాన్ని విరాళంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో హైకోర్ట్ చీఫ్ జస్టిస్ టి.బి.రాధాకృష్ణన్ సతీమణి మీరా రాధాకృష్ణన్, రవాణాశాఖ అధికారి సీఎల్ఎన్ గాంధీ, అసోసియేషన్ అధ్యక్షుడు బెంజ్‌మెన్ తదితరులు పాల్గొన్నారు. ఓసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో.. ఓసీ సంక్షేమ సంఘం మలయాళీ విభాగం ఆధ్వర్యంలో రెండు లక్షల రూపాయల చెక్కు, మూడు లక్షల రూపాయల విలువగల సామగ్రిని ముఖ్యమంత్రి సహాయనిధికి అందజేశారు. ఓసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జి.కరుణాకర్‌రెడ్డి, మలయాళీ విభాగం అధ్యక్షుడు కె.సూర్యకుమార్, మహిళా విభాగం అధ్యక్షురాలు ఉష ఆధ్వర్యంలో వీటిని సేకరించారు. -
'మృతుల సంఖ్య పెరుగుతోంది'
హైదరాబాద్: పెనుభూకంపం ధాటికి నేపాల్ మృతుల సంఖ్య మరింత పెరుగుతోంది. ఇప్పటి దాకా అందిన సమాచరం మేరకు మృతుల సంఖ్య 1832కు చేరింది. సహాయక చర్యల్లో భాగంగా.. ఇప్పటిదాకా ఖాట్మండులో 1000కి పైగా మృతదేహాలను వెలికితీశారు. ప్రభుత్వం అందిస్తున్న సహాయక చర్యల్లో 249 ఎన్టీఎఫ్ బృందం, 50 మంది వైద్యులు ఉన్నారు. నేపాల్‌కు 43 టన్నుల మెడిసిన్స్, సహాయ సామగ్రిని భారత్ పంపింది. దరహర్ గోపురం శిథిలాల కింద దాదాపు 200కు పైగా మృతదేహాలు వెలికి తీశారు. -
నేపాల్‌లో కొనసాగుతున్న సహాయక చర్యలు
హైదరాబాద్: పెనుభూకంపం ధాటికి నేపాల్ కకావికలం అయిపోయింది. మొదలైన కొద్దిసేపటికే తీవ్ర ప్రభావం చూపించింది. ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టింది. భూకంప మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పటిదాకా ఖాట్మండులో 1000కి పైగా మృతదేహాలను వెలికితీశారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 1832 దాటింది. ప్రభుత్వం అందిస్తున్న సహాయక చర్యల్లో 249 ఎన్టీఎఫ్ బృందం, 50 మంది వైద్యులు ఉన్నారు. నేపాల్‌కు 43 టన్నుల మెడిసిన్స్, సహాయ సామగ్రిని భారత్ పంపింది. దరహర్ గోపురం శిథిలాల కింద దాదాపు 200కు పైగా మృతదేహాలు వెలికి తీశారు.