
'మృతుల సంఖ్య పెరుగుతోంది'
హైదరాబాద్: పెనుభూకంపం ధాటికి నేపాల్ మృతుల సంఖ్య మరింత పెరుగుతోంది. ఇప్పటి దాకా అందిన సమాచరం మేరకు మృతుల సంఖ్య 1832కు చేరింది. సహాయక చర్యల్లో భాగంగా.. ఇప్పటిదాకా ఖాట్మండులో 1000కి పైగా మృతదేహాలను వెలికితీశారు. ప్రభుత్వం అందిస్తున్న సహాయక చర్యల్లో 249 ఎన్టీఎఫ్ బృందం, 50 మంది వైద్యులు ఉన్నారు. నేపాల్కు 43 టన్నుల మెడిసిన్స్, సహాయ సామగ్రిని భారత్ పంపింది. దరహర్ గోపురం శిథిలాల కింద దాదాపు 200కు పైగా మృతదేహాలు వెలికి తీశారు.