
ప్రతి నేపాలీ కన్నీళ్లు తుడుస్తాం: మోదీ
ఖఠ్మాండు: ప్రకృతి ప్రకోపానికి గురై కన్నీటి సంద్రంలో మునిగిపోయిన ప్రతి ఒక్క నేపాలీయుడి కన్నీళ్లు తూడుస్తామని భారత ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆపదలో ఉన్న ఏ దేశాన్నైనా ఆదుకోవడంలో భారత్ ఎప్పుడూ ముందే ఉంటుందని అన్నారు. నేపాల్కు భారత్ ఎప్పుడూ అండగా ఉంటుందని చెప్పారు. ఆదివారం మన్ కీ బాత్ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన నేపాల్ సోదరుడు, సోదరీ మణులకు భారత్ ఎప్పుడూ అండంగా ఉటుందని చెప్పారు. వారి చేతులను తమ చేతుల్లోకి తీసుకుని ధైర్యం చెప్తామన్నారు. ఈ భూకంపం ఒక్క నేపాల్, భారత్ మాత్రమే కాకుండా యావత్ ప్రపంచాన్ని భయబ్రాంతులకు గురిచేసిందని చెప్పారు. ఏ రకంగా అవకాశం ఉన్నా సహాయం చేసేందుకు భారత్ పూర్తి సిద్ధమని చెప్పారు.