నేపాల్కు గూర్ఖా సైన్యం కూడా..
న్యూఢిల్లీ: భూకంపం బారిన పడిన నేపాల్కు సహాయక చర్యలు అందించడంలో భారత్ శరవేగంగా కదులుతోంది. ఇప్పటికే తన సైన్యాన్ని నేపాల్లో సహాయక చర్యలకోసం పంపించిన భారత్ గూర్ఖా సైనికులను కూడా పంపించింది. ఈ విషయాన్ని ఆల్ ఇండియా రేడియో ద్వారా ప్రకటించింది. ఈ నెల 25న రిక్టర్ స్కేలుపై 7.9 తీవ్రతతో భూకంపం సంభవించి నేపాల్ పూర్తిగా దెబ్బతిన్న విషయం తెలిసిందే.
ఈ దేశానికి సహాయక చర్యలు అందించడంలో మిగతా దేశాల కన్నా భారతే ముందుంది. యుద్ధ సమయంలో ధైర్య సాహసాలతో ముందుకు వెళ్లడం గూర్ఖా సైన్యం ప్రత్యేకత. నేపాల్ సంతతికి చెందిన వీరు భారత్ పౌరసత్వాన్ని పొందడం ద్వారా భారత సైన్యంలో చేరతారు. క్లిష్ట సమయాల్లో చాలా చురుకుగా సేవలు అందిస్తారు.